ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి.ముఖ్యంగా సిరియా లాంటి దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలిసే ఉంటుంది. ప్రయాణికులకు అనుకూలం కాని ప్రమాదకరమైన దేశాలు ( Dangerous Countries To Travel ) చాలానే ఉన్నాయి. ఈ దేశాలు రాజకీయ అనిశ్చితి, పెరుగుతున్న నేరాలు, రెబల్స్ లేదా ఆర్మీ చేతుల్లో ప్రభుత్వాలు ఉండటం వంటి అనేక కారణాల వల్ల అటు స్థానిక ప్రజలు…ఇటు అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి.
యుద్ధ క్షేత్రాలుగా మారిన దేశాలతో పాటు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న దేశాలు ప్రయాణించడానికి ( Travel ) ఎప్పుడూ సురక్షితం కావు. ఇలాంటి దేశాలకు వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. చాలా దేశాలు తమ ప్రజలను ఈ రిస్కీ అండ్ డేంజరస్ దేశాలకు వెళ్లకుండా సూచనలు జారీ చేస్తాయి.
ముఖ్యాంశాలు
1.ఆఫ్ఘనిస్థాన్ | Dangerous Countries, Afghanistan,
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న డేంజరస్ దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందు వరుసలో ఉంటుంది. ఈ దేశంలో సంక్షోభంతో పాటు రాజకీయ అనిశ్చితి, మానవ హక్కుల ఉల్లంఘన లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడి రూల్స్ రోజురోజుకూ మారుతూ ఉంటాయి. తాలిబాన్ల రాక ముందు నుంచి, వచ్చిన తరువాత కూడా ఈ దేశంలో స్థిరమైన జీవన విధానం లేదు. దీంతో పాటు పేదరికం, కనీస అవసరాల లేమి, ఆహార కొరత, పేలవంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థ ఇలా ఎన్నో సమస్యలు ఉన్న దేశం ఇది.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
2.సిరియా | Syria
Dangerous Countries in world to travel : సిరియాను ఇప్పుడు ఎలాంటి దేశమో ప్రపంచానికే అర్థం కావడం లేదు. ఈ మధ్యే ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సిరియాను విడిచిపెట్టి రష్యాలో తలదాచుకుంటున్నాడు. అక్కడి రెబల్స్ దేశాన్ని కబ్జాలో తీసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. దానికి తోడు ఏళ్ల నుంచి కొసాగుతున్న సివిల్ వార్, రాజకీయ అనిశ్చిత, ఎన్నో మావవ హక్కుల ఉల్లంఘనలు కలిసి సిరియాను ప్రమాదకరమైన దేశంగా మార్చాయి.
వేలాది, లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ యుద్ధాల వల్ల అక్కడ పేదరికం పెరిగింది. ఆహార కొరత ఏర్పడింది. ఆరోగ్య వ్యవస్థ పతనం అయింది. మిలియన్ల మంది జీవితాలు అగమ్య గోచరంగా మారిపోయాయి. ఇలాంటి టైమ్‌లో సిరియా వెళ్లడం అనేది తెలివైన వాళ్లు చేసే పని కాదు. పైగా భారత దేశం కూడా సిరియా వెళ్లవద్దని ప్రజలను సూచించింది.
3.యెమెన్ | Dangerous Countries, Yemen
Dangerous Countries on earth : యెమెన్‌లో కూడా ప్రస్తుతం సివిల్ వార్ నడుస్తోంది. దీని వల్ల రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. మానవతా హక్కుల ఉల్లంఘన సాధారణం అయింది. 2014 నుంచి హౌతీ రెబల్స్, అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఇక్కడి ప్రభుత్వం మధ్య సాగుతున్న పోరు సాగుతోంది.
ఎన్నో సార్లు సౌదీ దేశం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, నేలపై యుద్ధం చేసింది. దీని వల్ల అక్కడ చాలా విధ్వంసం జరిగింది. లక్షలాది మంది చనిపోయారు. పదేళ్ల నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధం వల్ల అక్కడ పేదరికం పెరిగి, ఆహార నిల్వలు తరిగి, ప్రజారోగ్య వ్యవస్థ ఆరోగ్యం కూలిపోయింది.
ఇందులో కొన్ని దేశాల గురించి ప్రభుత్వాలు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేయకున్నా అక్కడి పరిస్థితి గురించి తెలిస్తే మీరే అలర్ట్ అవుతారు.
4. సౌత్ సుడాన్ | South Sudan
Dangerous Countries In the World : పౌర అసమ్మతి, రాజకీయ సంక్షోభం, మానవతా సంక్షోభం వంటి అనేక కారణాల వల్ల సౌత్ సుడాన్ దేశం వెళ్లడం గురించి అసలు ఆలోచించకపోవడమే మంచిది. 2011 లో స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి స్థానిక ప్రభుత్వం, రెబల్స్ మధ్య పోరు జరుగుతోంది.
దీంతో హింస వ్యాపించింది. ఊచకోతలు జరిగాయి. ఆహార కొరత ఏర్పడింది. మౌళిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. దీనికి తోడు ఆర్థిక అస్థిరత్వం, లంచగొండితనం ఇలా ఎన్నో అంశాలు సౌత్ సుడాన్‌ను ఒక ప్రమాదకరమైన దేశంగా మార్చేశాయి. ఈ పరిస్థితిలో ఈ దేశానికి ట్రావెల్ చేయాలనే ఆలోచన ఎవరూ చేయరు.
5.కాంగో | Democratic Republic Of Congo
Dangerous Countries to travel : కాంగో అంటే నాట్ టు గో అని కూడా అనవచ్చు. ఎందుకంటే డెమక్రెటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. మానవతా హక్కుల ఉల్లంఘనలు కూడా ఎక్కువే.
ఇక్కడి డెమోక్రాటిక్ ఫోర్ప్, ఎం23 వల్ల హింస జరుగుతోంది. ఈ రెండు వర్గాలు కూడా ఇక్కడి కోల్టన్, డైమండ్స్ వంటి వనరుల కోసం పోటీ పడుతూ హింసకు దిగుతుంటాయి. దీనికి తోడు కరప్షన్, అస్థిరత, తరచూ ఇబోలా లాంటి ప్రమాదకరమైన రోగాలు వ్యాపించడం ఇవన్నీ కలిపి కాంగోను నోగో కంట్రీగా మార్చేశాయి. ఇలాంటి ప్రమాదకరమైన దేశానికి ఎవరు వెళ్తారు చెప్పండి ?
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
6. రష్యా | Russia
రష్యా మన దేశానికి మిత్రదేశం. ప్రమాదకరమైన దేశాల జాబితాలో రష్యాను ప్రస్తావించడం కొంచెం ఇబ్బందిగానే అనిపించవచ్చు. కాని ఒకసారి అక్కడ ఏం జరుగుతోందో చూద్దాం. 2022 నుంచి ఉక్రెయిన్‌తో ( Ukraine ) యుద్ధం చేస్తోంది రష్యా. ఈ యుద్ధం అంతర్జాతీయ సంక్షోభానికి, అస్థిరతకు కారణం అవుతోంది.
దీంతో పాటు అక్కడి ప్రభుత్వం అసమ్మతి దారులను అణచివేస్తోంది అని అంతర్జాతీయ సెక్యూరిటీ రిపోర్టు వెల్లడించింది. దీనికి తోడు సిరియాలాంటి దేశాల్లో రష్యా సైన్యం సాయం చేయడానికి వెళ్లడం వల్ల ఈ దేశ ప్రతిష్టకు భంగం కలిగింది. అందుకే ప్రమాదకరమైన దేశాల జాబితాలో రష్యాను కూడా చేర్చాల్సి వస్తోంది.ఎందుకంటే యుద్ధంలో ఉన్న ఏ దేశం కూడా అంత సేఫ్ కాదు.
7.ఉక్రెయిన్ | Ukraine
రష్యాతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్న దేశం ఉక్రెయిన్. ఈ యుద్ధం వల్ల ఈ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. దీనికి తోడు రష్యా అధ్యక్షుడు ఇటీవలే అణ్వాయుధాలను ప్రయోగించాల్సి వస్తే వెనకాడము అని చెప్పాడు.
పూర్తిగా యుద్ధ క్షేత్రంగా మారిన ఈ దేశంలో ప్రభుత్వం స్థిరంగా ఉన్నా ఆర్థికంగా అస్థిరత ఉంది. దీనికి తోడు ఎక్కడ మందు పాత్రలు ఉంటాయో తెలియవు. రష్యా నుంచి ఏదైనా పేలుడు పదార్థం వస్తే ఎక్కడ పడుతుందో తెలియదు. ఇవన్నీ కలిసి ఉక్రెయిన్‌ను ప్రమాదకరమైన దేశంగా మార్చాయి.
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
8.సోమాలియా | Somalia
Dangerous Countries for shipping : ఒక ప్రయాణికుడు ( traveler ) కలలో కూడా వెళ్లడానికి ఇష్టపడని దేశం ఏదైనా ఉంది అంటే అది సోమాలియానే అని చెప్పవచ్చు.ఈ దేశం రాజకీయ అస్థిరత, తీవ్రవాదం వంటి ఎన్నో సమస్యలతో, సంక్షోభాలతో సతమతం అవుతోంది. . అల్ షబాబ్ అనే సంస్థ వల్ల చెలరేగే హింసతో 1991 నుంచి ఈ దేశంలో చట్టం పనిచేయడం లేదు. వివిధ గ్రూపులు, వర్గాల మధ్య ఘర్షణలు కూడా హింసాత్మాక వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయి. దీని వల్ల ఇక్కడ తీవ్రమైన ఆర్థిక అస్థిరత్వం ఏర్పడింది. ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. ప్రభుత్వం ఉంది అంటే అది పేరుకు మాత్రమే అని చెప్పవచ్చు.
ప్రపంచంలోనే ఎక్కువ మంది సముద్రపు దొంగలు ( Somalia Pirate ) ఉన్న దేశం ఇదే. సొంతంగా గ్రూపులు ఏర్పాటు చేసుకుని గల్ఫ్ ఆఫ్ అడామ్స్ లాంటి సముద్ర ప్రాంతాల్లోకి ప్రవేశించే వెసెల్స్ అండ్ నావలను, కంటైనర్ షిప్స్‌ను హైజాక్ చేసి తమ అధీనంలోకి తీసుకుంటారు ఈ సముద్రపు దొంగలరు. డబ్బు వచ్చాకే వారిని విడిచిపెడతారు. ఇలా 2000 సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నారు. వీరి వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యంలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడింది.
9. ఇరాన్ | Iran
Dangerous Countries on map : ఇరాన్ అంటే యుద్ధమే గుర్తుకు వస్తుంది. 2003 నుంచి ఇరాన్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఐఎస్ఐఎస్ ప్రభావం కూడా ఈ దేశంపై పెరిగింది.
ఐఎస్ఐఎస్ తన భూభాగాన్ని కోల్పోయినా నేటికీ అత్యంత ప్రమాదకరమైన దాడులను నిర్వహిస్తోంది. దీంతో పాటు ఇరాన్ అండతో ఉన్న మిలిటెంట్ల మూమెంట్స్, కరప్షన్, బలహీనమైన ప్రభుత్వం ఇవన్నీ కలిపి ఇరాన్‌ను ఒక ప్రమాదకరమైన దేశంగా మార్చాయి.
10 సుడాన్ | Sudan
2003 నుంచి ఈ దేశంలో హింస, మానవ హక్కులల ఉల్లంఘన జరుగుతూ ఉంది. దీనికి తోడు రాజకీయ అనిశ్చితి కూడా ఉంది. ఒమార్ అల్ బషీర్‌ను గద్దె దింపిన తరువాత ఈ దేశంలో అస్థిరత్వం మరింతగా పెరగింది.
దార్ఫుర్, దక్షిణ కోర్దోఫాన్ వంటి ప్రాంతాలు హింసకు కేరాఫ్‌గా మారాయి. వివిధ వర్గాల మధ్య పోరు, ఆర్థిక ఇబ్బందులు, కనీస సదుపాయాల లేమి ఇవన్నీ కూడా సుడాన్‌ను అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో ఉంచాయి.
ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
మీరు ప్రయాణికులైనా, వ్యాపారులు అయినా తెలుగు ట్రావెల్ వ్లాగర్ ( telugu travel vloggers ) అయినా, వార్ జర్నలిస్టు, వార్ ఫోటోగ్రాఫర్ లేదా ఎన్జీయో అయినా… గుర్తుంచుకోండి…ఈ దేశాలకు వెళ్లే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించండి. ఈ దేశాల్లో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చూడాలి అనుకుంటే మీకు యూట్యూబ్‌లో చాలా వీడియోలు ఉంటాయి చూడండి. ప్రయాణికుడు వెబ్‌సైట్‌లో తరచూ వివిధ దేశాలకు సంబంధించిన పర్యాటక ప్రదేశాల గురించి పోస్టులు పెడుతుంటాను వాటిని కూడా చదవండి.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.