Eateries In Goa : గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన 10 రెస్టారెంట్స్ ఇవే

గోవా అంటే అక్కడి బీచులు మాత్రమే కాదు…అక్కడి రుచికరమైన భోజనం కూడా. అద్బుతమైన చరిత్ర ఉన్న గోవా, తన వైవిధ్య భరితమైన వంటకాలతో ( Eateries In Goa ) పర్యాటకులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సారి మీరు గోవాకు వెళ్తే ఈ ఈటరీస్‌లో ట్రై చేసి చెప్పండి.. దాంతో పాటు మీకు నచ్చిన ఫుడ్ ఫ్లేస్ ఇందులో ఉందా లేదా కూడా చెక్ చేయండి.

1.మార్టిన్స్ కార్నర్ | Martin’s Corner

సీ ఫుడ్‌ కోసం మార్టిన్స్‌ కార్నర్ చాలా ఫేమస్ ఇక్కడ భోజన ప్రియులు గోవా ఫిష్ కర్రీని ( Goa Fish Curry) తప్పకుండా ట్రై చేస్తారు.ఇక ప్రాన్స్ విండాలూ అనే అనే డిష్ నాన్ వెజ్ లవర్స్ బాగా నచ్చుతుంది.హోటల్ యాంబియెన్స్ కూడా బాగుంటుంది

Best eateries in goa
ఈ హోటల్ లొకేష్ కూడా చాలా బాగుంటుంది | Photo : Martin’s Corner, Facebook
  • ప్రదేశం: Betalatim, Goa
  • టైమింగ్:-11.30 am-4pm, 6.30 pm-11.30 pm

2. ఫిషర్‌మాన్స్ వార్ఫ్ | Fisherman’s Wharf

పేరును బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది.ఇక్కడ సీ ఫుడ్ చాలా పాపులర్ అని.ఈ బ్రాండ్ గోవాలోనే కాదు ఇండియాలో అనేక ప్రాంతాల్లో ఉంది.అంతెందుకు మన హైదరాబాద్ లోని పుప్పాల గూడలో కూడా ఉంది. సీఫుడ్ ఇష్టపడే వారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది.

Best eateries in goa
సీ ఫుడ్ లవర్స్ ఇక్కడ వ్యాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు.| Photo : Fisherman’s Wharf, Website
  • ప్రదేశం: Cavelossim
  • టైమింగ్: 12.30 pm-3.30, 7pm-1130
  • ఇద్దరికి అయ్యే ఖర్చు : రూ.800 నుంచి రూ.1200

3.గన్‌పౌడర్ రెస్టారెంట్ | Gunpowder Restaurant Goa

ఈ ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్‌లో భారత దేశంలోని వివిధ ప్రాంతాల ఫుడ్ లభిస్తుంది. ఇక్కడికి చాలా మంది టేస్టీ కర్రీస్, కాక్‌టెయిల్స్ కోసం వెళ్తూ ఉంటారు.

  • ప్రదేశం: అసాగోవా
  • టైమింగ్:- 12pm-3.30, 7pm-1.30pm
  • ఇద్దరికి అయ్యే ఖర్చు : రూ.800-1200
Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here

4. వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్

Vinayak Family Restaurant: ఆథెంటిక్ గోవా డిష్‌లను మీరు ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది.మరీ ముఖ్యంగా ఇక్కడి ఫిష్ థాలి ( Fish Thali ) ఒక్కసారి అయినా ట్రై చేసి చూడండి.లోకల్‌ ఏరియాలో ఇది చాలా ఫేమస్.

  • ప్రదేశం: కెలాన్‌గుటే
  • టైమింగ్: -9am-10pm
  • ఇద్దరికి అయ్యే ఖర్చు : రూ.500-రూ.800

5.మమ్స్ కిచెన్

Mum’s Kitchen: మీరు పనాజీలో ఉంటే మాత్రం మమ్స్ కిచెన్‌ తప్పకుండా వెళ్లండి . ఇంటి ఫుడ్‌లా రుచికరంగా చేపల కర్రీ, ప్రాన్స్ బాల్చావ్ డిషెస్ సర్వ్ చేస్తారు.

6.కేప్ ఆల్కెమియా

Cafe Alchemia : ఇది ఒక అందమైన రెస్టారెంట్. ఇక్కడ మీకు ఫ్రెష్ సలాడ్స్, గోవా క్లాసికల్ డిషెస్, ఆరోగ్యకరమైన రెసెపీలు లభిస్తాయి. ఇక్కడ స్మూథీస్ తప్పకుండా ట్రై చేయండి.

  • ప్రదేశం: పంజిమ్ ( Panjiam)
  • టైమింగ్:- 9am-6pm
  • ఇద్దరికి అయ్యే ఖర్చు : రూ.500-800

7. కాసా పోర్చుగీసా

Casa Portuguesa: పోర్చుగీసు క్యూజిన్‌ను చక్కగా కంఫర్టుగా కూర్చుని ఎంజాయ్ చేయాలి అనుకుంటే కాసా పోర్చుగీసా మీకు మంచి ఛాయిస్ అవుతుంది.ఇక్కడ బకాల్హో, పాస్టెల్ డె నాటా బాగా పాపులర్.

Best eateries in goa
పోర్చుగీసు రుచలకు నెలవు ఈ రెస్టారెంట్ | Photo : Casa Portuguesa, Website
  • ప్రదేశం: కెలాన్‌గుటే
  • టైమింగ్:-7 to 11pm ( సోమవారం సెలవు )

8.రిట్జ్ క్లాసిక్ : Ritz Classic

ఇక్కడ మీరు ఫిష్ థాలీ, ఇతర సీ ఫుడ్ వెరైటీలు ట్రై చేయవచ్చు. గోవా క్లాసిక్ రుచులను ఎంజాయ్ చేయాలి అనుకుంటే రెస్టారెంట్ మీకు తప్పకుండా నచ్చుతుంది.

  • ప్రదేశం: పనాజి
  • టైమింగ్: 11am-4pm, 7pm-11pm
  • ఇద్దరికి అయ్యే ఖర్చు :

9.సూజీస్ | Suzies

ఇక్కడ ఛెఫ్ సూజీ గోవా స్టైల్ వంటలకు తన ఫ్యూజన్ టచ్ ఇచ్చి కొత్త రుచులను భోజన ప్రియులకు అందిస్తుంటారు. అందుకే ఇక్కడ సంవత్సరానికి నాలుగైదు సార్లు మెన్యూ మారుతూ ఉంటుంది.

  • ప్రదేశం: అసాగోవా
  • టైమింగ్:- 11am-3.30pm, 7.30 pm-11.30pm
  • ఇద్దరికి అయ్యే ఖర్చు : రూ.500-800

10.బ్రిట్టోస్ | Britto’s

బీఛ్ ముందు ఉన్న ఈ రెస్టారెంట్‌లో మీరు సీ ఫుడ్‌తో పాటు కాంటినెంటల్ ఫుడ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడి మెన్యూలో ఫుడ్ లవర్స్ కోసం చాలా ఆప్షన్స్ ఉంటాయి.

Best eateries in goa
బీచులో నీసు తినాలి అనుకుంటే ఈ ప్లేస్ మీకోసమే | Photo : Brittos Website
  • ప్రదేశం: బాగా, కెలాన్‌గుటే
  • టైమింగ్:-8.30 am-12.30pm

గోవాకు వెళ్తే గోవా క్లాసిక్, ఆథెంటిక్ ఫుడ్ తప్పుకుండా ట్రైచేయండి. ఎందుకంటే వీటి రుచులే చాలా మందిని గోవాకు లాక్కెళ్తాయి. కేవలం భోజనమే కాదు ఇక్కడ మీకు మంచి డైనింగ్‌ అనుభవం లభిస్తుంది. ఇంతకి మీకు గోవాలో ఇష్టమైన రెస్టారెంట్ ఏది ?

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని లింక్స్ లేదా ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

Leave a Comment

error: Content is protected !!