2024 దాదాపు ముగియవస్తోంది. ముందుకు వెళ్తన్నాం అన్న ఆనందంతో పాటు ఈ ఏడాది మనకు ఎలా గడిచిందో అని కూడా మనం ఆలోచిస్తుంటాం. అయితే మీ ప్రయాణికుడు కేవలం ప్రయాణాల గురించే మాట్లాడుతాడు కాబట్టి మనం ఆ విషయమే మాట్లాడుదాం. 2024 లో భారతీయులు గూగుల్ తల్లిని ఏఏ ప్రాంతాల గురించి అడిగారో ( Google Travel Search 2024 ) మీ కోసం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. చూడండి సారీ చదవండి. నేను ట్రావెల్ వీడియోలు కూడా చేస్తుంటాను. అందుకే చదవండి అనడానికి బదులు చూడండి అన్నాను. ఈ పోస్ట్ పూర్తిగా చదివిన తరువాత మీకు వీలైతే పైన లింక్‌పై క్లిక్ చేసి ఛానెల్ కూడా ఒకసారి చూడండి.
ఇది చదవారా ? Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
భారతీయ పర్యాటకులను ( Indian Tourists ) చాలా దేశాలు ఆహ్వానిస్తున్నాయి. రివేంజ్ టూరిజం ( Revenge Tourism ) మొదలైన తరువాత మన రేంజ్ పెరిగింది. వీసా ఫ్రీ… ఈ వీసాతో పాటు వివిధ ట్రావెల్ కంపెనీలు ఆసక్తికరమైన ప్యాకేజీలు అందించడంతో చాలా మంది భారతీయులు విదేశాలకు కూడా వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. దీనికి సంబంధించి గూగుల్ కూడా ఇయర్ ఇన్ సెర్చ్ లిస్టు ( Google Year Search Results ) విడుదల చేసింది. ఈ లిస్టులో అందమైన ప్రదేశాలతో పాటు, కల్చర్ అడ్వెంచర్ యాత్రలు కూడా ఉన్నాయి.
1.అజర్ బైజాన్ | Azerbaijan
చాలా మంది దీన్ని అజర్ బజార్ అని కూడా సెర్చ్ చేశారు. ఎలా సెర్చ్ చేసినా ( Google Travel Search 2024) గూగుల్ మాత్రం మీకు కావాల్సిన రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఇక ఈ దేశం విషయానికి వస్తే ప్రాచీనత, ఆధునికతల కలబోతలతో ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తుంది అజర్ బైజాన్. ఈ దేశ రాజధాని బాకు ( Baku ) అయితే తన అందంతో చాకులా పర్యాటకుల మనసులో గుచ్చుతోంది. అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఇక్కడ ఏం చూడాలి ? ఏం తినాలి ? అక్కడ కరెన్సీ, హిస్టరీ మొత్తం కలిపి ఒక బ్లాగ్ ఇంతకు ముందే రాశాను. కావాలంటే మీరు అది కూడా చెక్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
2.బాలి | Bali In Google Travel Trends 2024
గల్లీ గల్లీల టూరిస్టులు ( Tourists ) ఉన్నా బాలిలో లొల్లి ఉండదు. ఎందుకంటే బాలికి వెళ్లేది ప్రశాంతత కోసం. దీంతో పాటు అక్కడ కల్చర్, ఆలయాలు, సన్‌సెట్ వ్యూస్ సన్‌రైజ్ వ్యూస్ ఇవన్నీ బాలిని భారతీయులకు చేరువ చేశాయి. బాలిలో హనీమూన్ ప్లాన్ ( Honeymoon In Bali ) చేసేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇక్కడి బీచులు అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.
3. మనాలి | Manali
యాజ్ ఎ ట్రావెలర్ నాకు మనాలి అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఎందుకంటే టూ మచ్ జనం ఉంటారు. కానీ మనాలి మనాలి మనాలి ( Manali ) అని ఈ ప్రదేశాన్ని ఎంత పాపులర్ చేశారంటే ఇప్పటికీ మనాలికి వెళ్లడానికి లెక్కకు మించి ఎక్కువ మంది తహతహలాడుతుంటారు. అందుకే ఈ సారి కూడా మనాలి గురించి తెగ వెతికారు.
మనాలి అందం ( Beauty of Manali ) గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి మాత్రం నేను ఫిదా అయ్యాను. ఇక్కడ వ్యాలీస్, బియాస్ నది, హిడింబా ( Hadimba Temple ), వశిష్ట్ ఆలయం…ఇలా ఎన్నో ఉన్నాయి. మీ లిస్టులో మనాలి వెళ్లాలని ఉంటే మాత్రం ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? ఎప్పుడు వెళ్లాలి ? వంటి ప్రశ్నలకు సమాధానం నేను చేసిన ఒక వీడియో చూస్తే మీకు లభిస్తుంది. వీలైతే చూడండి.
Watch : మనాలి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? | Manali Complete Travel Guide In Telugu
4.కజకిస్తాన్ | Kazakhstan
ఈ మధ్య బాగా వినిపిస్తోన్న టూరిస్ట్ డెస్టినేషన్ కజకిస్తాన్. భారతీయులు ఈ దేశం గురించి వెతకడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడి అల్మాటీ నగరం ( Almaty) , చెరియన్ కాన్యాన్ ( Charyn Canon ) వంటి ప్రదేశాలు చాలా పాపులర్. కావాలంటే మీరు ఫ్రీ వీసాతో 14 రోజుల వరకు కజకిస్తాన్‌లో ఉండవచ్చు.
5.జైపూర్ | Jaipur
రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. అయితే రాజసం పోతుందా ? ఛాన్సే లేదు. దానికి ఉదాహరణే జైపూర్. పింక్ సిటీ ( Pink City ) అని పిలవబడే ఈ సిటీకి మన దేశ ప్రజలు గ్యాప్ లేకుండా వెతికారట ( Google Travel Search 2024 ). ఎందుకయ్యా అలా వెతికారు అనడిగితే ఇక్కడి చారిత్రాత్మక నిర్మాణాలు, హవా మహల్ ( Hawa Mahal ), కోటంటే ఇలా ఉండాలి అనేలా ఉండే అమేర్ ఫోర్ట్ ( Amer Fort ), ఇక్కడి ఫుడ్ ఇవన్నీ జైపూర్‌ను సెర్చింగ్ లిస్టులో ఉంచాయి.
6.జార్జియా | Georgia
తెలుగు సినిమాల్లో పాటలు ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఉంటుంది జార్జియా. ఇది అటు ఆసియాను, ఇటు యూరోపును కవర్ చేసే తోపు దేశం. జార్జియా భౌగోళిక స్వరూపం ఉంది చూడండి దాన్ని చూసి మీరు తొలి చూపులోనే ప్రేమలో పడిపోతారు. ఇక్కడి మెజెస్టిక్ కాకసస్ పర్వతాలు ( Majestic Caucasus ) పర్వతాలు ఆ దేశాన్ని రక్షించడమే కాదు వచ్చే పర్యాటకులుకు వీక్షించడానికి ఒక మంచి ప్రదేశాలు.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
7. మలేషియా | Malaysia
డెవలెప్మెంట్ అంటే ఎలా ఉంటుంది ? ఆధునిక జీవన శైలి అంటే ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే మనం వెళ్లాల్సిన దేశం ఇదే. కౌలాలంపూర్‌లోని ఐకానిక్ ట్విన్ టవర్స్ నుంచి లంగ్వాకీ బీచుల వరకు మలేషియాలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లి డెస్టినేషన్ ఇది. అంటే మీ జేబుకు జేబు వెనక ఉన్న మనసుకు రెండింటికీ ఈ దేశం సెట్ అవుతుంది.
ప్రయాణికుడు ట్రావెల్ వ్లాగ్స్ కోసం క్లిక్ చేయండి.
8.అయోధ్య | Ayodhya
వందలాది సంవత్సరాల తరువాత శ్రీరామ చంద్రుడికి అద్భుతమైన ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఏడాది శ్రీరామ భక్తులు అయోధ్యా రామ మందిరం గురించి చాలా సెర్చ్ చేశారు ( Google Travel Search 2024 ) . ఆలయ నిర్మాణ విశేషాలు, దర్శన వివరాలు, నగర చరిత్ర ( Ayodhya History ) ఇలా ఎన్నో విషయాల కోసం వెతికారు. నాకు తెలిసి వచ్చే ఏడాది…తరువాత వచ్చే ఏడాది ఇలా గూగుల్ ఉన్నంత వరకు భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసే ట్రావెల్ డెస్టినేషన్‌లో అయోధ్య తప్పకుండా ఉంటుంది.
9.కశ్మీర్ | Kashmir
“అగర్ పిర్దోస్ బర్ రూయె జమీన్ అస్త్ ,
మీ అస్తో హమీ అస్తో, హమీ అస్తో”
ఖంగారు పడకండి కశ్మీర్ గురించి ఇది హజ్రత్ అమీర్ ఖుస్రో రాసిన లైన్స్ ఇవి. దీనర్థం ఏంటి అంటే..
కశ్మీర్ నిజంగానే భూమిపై ఉన్న స్వర్గం లాంటి ప్రదేశం. ఇక్కడ గుల్మార్గ్ ( Gulmarg ), డాల్ లేక్ ( Dal Lake ), పహల్గామ్ వంటి ప్రదేశాలు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇంకో విషయం తెలుసా..కశ్మీర్‌లో ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో ఎన్నో కొత్త కొత్త డెస్టినేషన్స్ కూడా మన ముందుకు రానున్నాయి అని ఆశిస్తున్నాను
10. సౌత్ గోవా | South Goa
గోవాలో బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతున్నా…భారతీయులు మాత్రం డబ్బులదేముంది మచ్చా ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి. మెమోరీస్ ఇంపార్టెంట్ అని గోవాకు వెళ్తున్నారు. ముఖ్యంగా అందాలకు అడ్డా అయిన సౌత్ గోవావైపు వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇక్కడి పలోలెమ్ ( Palolem ), అగోండా ( Agonda ) బీచులు చాలా మందికి బాగా నచ్చుతాయి.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
2024 అనేది ప్రయాణికులకు అద్భుమతమైన సంత్సరం అని చెప్పవచ్చు కేవలం కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడమే కాదు అక్కడి సంప్రదాయం, ఆచారాలు, భోజన అలవాట్లు ఇలా ఎన్నో తెలుసుకున్నారు భారతీయులు. ఈ సంవత్సరం మీరు ఎక్కడ ట్రావెల్ చేశారో ( Travel ) చెప్పనే లేదు. కామెంట్ చేసి చెప్పగలరు.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
- హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
- Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
- షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
- Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
- Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
చాలా మంది ఇవి చదివారు మరి మీరు ?
- వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
- Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- elugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
- Travel Vlogging Tips : ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటే ఏం చేయాలి ? 10 టిప్స్ !
- Honeymoon : వీసా అవసరం లేకుండా ఈ ఏడు దేశాల్లో హనీమూన్‌కు వెళ్లొచ్చు.
- First time Flyers : ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే