Honeymoon : వీసా లేకుండా ఈ 7 దేశాలకు హనీమూన్ వెళ్లొచ్చు

లైఫ్‌లో హనీమూన్ అనేది ఒక స్పెషల్ మూమెంట్. జీవితాంతం ఈ ఎపిసోడ్ మైండ్‌లో రివైండ్ అవుతూ ఉంటుంది. అందుకే చాలా మంది హనీమూన్ ( Honeymoon ) అత్యంత అందమైన ప్రాంతంలో ఆహ్లదకరంగా ఉండేలా ప్లాన్ చేస్తారు. 

దాని కోసం మంచి డెస్టినేషన్స్‌ కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లాలో ఏం చూాడాలో తెలియని వారి కోసం వీసా లేకుండా వెళ్లే 7 బ్యూటిఫుల్ డెస్టినేషన్స్‌ సెలెక్ట్ చేసి తీసుకువచ్చాను.

ఇక్కడ తమ జీవిత భాగస్వామితో కలిసి చక్కని టైమ్ స్పెండ్ చేయవచ్చు. కొత్త ప్రాంతంలో కొత్త కల్చర్‌, ఫుడ్, లైఫ్‌స్టైల్‌ను ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు.

Read Also : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!

బాలి, ఇండోనేషియా | Bali, Indonesia

భారత దేశానికి దగ్గర్లో ఉన్న హనీమూన్ డెస్టినేషన్‌లో బాలి కూడా ఒకటి. బాలిని దేవుడి ఐల్యాండ్ ( Island of the Gods ) అని కూడా అంటారు. కొత్త జంటకు అయితే ఇది స్వర్గంలాంటి ప్లేస్.

honeymoon in bali by prayanikudu
బాలి, ఇండోనేషియా | Photo : Pexels

బాలి అందం, ఇక్కడి విభిన్నమైన జీవన విధానం, కల్చర్, స్థానికుల ఆతిథ్యం ఇవన్నీ కలిసి జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కల్పిస్తాయి.

బాలిలో చేయాల్సినవి

Things To Do In Bali : బాలిలో అడ్వంచర్ యాక్టివిటీస్ డెస్టినేషన్స్‌తో పాటు రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా స్పాట్స్ ఉంటాయి. 

  • ఉబుద్ : ఉబుద్‌ ( Ubud ) ను బాలి కల్చరల్ క్యాపిటల్ అని కూడా అంటారు. ఈ ప్రాంతం చుట్టూ రెయిన్ ఫారెస్ట్, వరి పొలాలు చాలా ఉంటాయి. కొత్త జంటలు ఇక్కడ ఫేమస్ తెగల్లాలాంగ్ రైస్ టెర్రెస్ ( Tegallalang Rice Terrances ) , ఆర్ట్ గ్యాలరీ చూడొచ్చు. దగ్గర్లోని స్పాలో రిలాక్స్ కూడా అవ్వొచ్చు.
  • బీచ్ లైఫ్ : ప్రపంచంలోనే అందమైన బీచుల్లో బాలి బీచెస్ కూడా ఉంటాయి. కుటా బీచ్ ( Kuta Beach ) నుంచి నూసా డువా ( Nusa Dua ) వరకు ఇక్కడ ప్రతీ బీచ్ పర్యాటకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది.
  • సన్‌సెట్ పాయింట్ : బాలిలో సన్‌సెట్ చూడటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా తనా లోట్ ( Tanah Lot ) అనేది బాలిలోనే మోస్ట్ ఐకానిక్ స్పాట్.  సముద్రానికి ఆనుకుని ఉన్న ఒక కొండ ఉంటుంది. దానిపై నుంచి సూర్యాస్తమయాన్ని చూడటం అనేది కొత్త ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.
  • ఫుడ్  ( Food In Bali ) : మనం చైనీస్, మంగోలియన్, ఇటాలియన్ మొఘలై, రాజస్థానీ ఇలా చాలా రకాలు ఆహారాలు టేస్ట్ చేస్తుంటాం. కానీ వాటికి భిన్నంగా ఉలండే బాలినీస్ ( Balinese ) ఫుడ్ మీరు బాలిలో టేస్ట్ చేయవచ్చు. స్థానికంగా లభించే పదార్థాలతో తయారు చేసే నాసీ గోరెంగ్ అనే ఫ్రైడ్ రైస్, సాట్ లిలిట్ అనే సీ ఫుడ్‌ను చాలా మంది ట్రై చేస్తుంటారు.

2. థాయ్‌లాండ్ | Thailand

భారతీయులు ఈ మధ్య బాగా ఇష్టపడుతున్న దేశాల్లో థాయ్‌లాండ్ ( Thailand ) కూడా ఒకటి. ఇక్కడి హనీమూన్‌కు సోలోగా వెళ్లేవాళ్లు కూడా ఉంటారు. జస్ట్ జోకింగ్. 

థాయ్‌లాండ్‌ అనేది అందమైన ల్యాండ్‌స్కేప్, అద్భుతమైన చరిత్ర, నోరూరించే ఫుడ్, సూపర్ బీచులు ఉన్న అద్భుతమైన హనీమూన్ డెస్టినేషన్.

honeymoon destinations thailand prayanikudu
థాయ్‌లాండ్ | Photo : Pexels

థాయ్‌లాండ్‌లో చేయాల్సినవి 

Things To do in Thailand : మీరు బ్యాంకాక్ లాంటి జోష్‌ఫుల్ సిటీకి వెళ్లాలి అనుకున్నా, లేక ఫుకెట్‌ ( Phuket ) లోని బ్యూటిఫుల్ బీచుల్లో ఎంజాయ్ చేయాలనుకున్నా మీ ఇష్టం థాయ్‌లాండ్ మీకు ఫుల్ ఫ్రీడం ఇస్తుంది. కొత్త జంటకు గిఫ్ట్‌లా…

  • బ్యాంకాక్ | Bangkok  : ఈ మధ్య వచ్చిన వ్లాగ్స్ వల్ల బ్యాంకాక్ అంటే చాలా మందికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. అది బ్యాంకాక్‌లో ఒక కోణం మాత్రమే. ఈ సిటీలో కొత్త జంట కలిసి ఎన్నో ఆలయాలకు వెళ్లవచ్చు, నిత్యం రద్దీగా ఉండే మార్కెట్స్‌‌లొ తిరగొచ్చు. కొత్తకొత్త స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయొచ్చు. ఇక్కడ గ్రాండ్ ప్యాలెస్, లాంగ్‌టెయిల్ బోట్ రైడ్ మిస్ చేసుకోకండి. 
  • ఐలాండ్ హపింగ్ | Island Hoppping : థాయ్‌లాండ్‌లో కో ఫిఫి, కో సమూయ్ లాంటి ద్వీపాల్లో బీచులు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ మీరు క్రిస్టల్ క్లియర్ సముద్ర జలాల్లో, సముద్రం మధ్యలో వచ్చే నేచురల్ అందాల్లో సూపర్‌గా టైమ్ స్పెండ్ చేయొచ్చు. స్నార్కిలింగ్ ( Snorkeling ), సన్ బాతింగ్‌తో పాటు ప్రైవేట్ బీచ్ పిక్నిక్‌ కూడా ట్రై చేయవచ్చు.
  • థాయ్ కల్చర్ | Thai Cultures : మీకు వీలైతే థాయ్ ట్రెడిషనల్ కుకింగ్ క్లాసులు అటెండ్ అవ్వండి.  లేదంటే అక్కడి వాళ్ల కల్చర్‌ గురించి కాస్త రీసెర్చ్ చేసి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దీని గురించి మీ పార్టనర్‌తో డిస్కస్ చేయవచ్చు. ఇది మీ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. 
  • థాయ్ రుచులు | Thai Food : థాయ్‌లాండ్‌లో స్ట్రీట్ ఫుడ్ చాలా పాపులర్. నాలుకను నాట్యం చేయించే బోల్డ్ ఫ్లేవర్ నుంచి లంగ్స్‌కి లైఫ్ ఇచ్చే సువాసనలతో సూపర్ మసాలాలతో చేసిన ఫుడ్ ట్రైయండి. మీకు వీలైతే పాడ్ థాయ్, టాయ్ యం సూప్, మ్యాంగో స్టికీ రైస్ ఖచ్చితంగా ట్రై చేయండి.

3. సీషెల్స్ | Seychelles

ఇప్పుడిప్పుడే సీచెల్స్ గురించి భారతీయులు రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. దీని అందం గురించి తెలుసుకున్నాక వెళ్లాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. హిందూ మహా సముద్రంలో ఇసుక రేణువంత ఉండే ఈ దేశం ఇప్పుడు మెల్లిమెల్లిగా టూరిస్టులకు ఫేవరిట్ డెస్టినేషన్ అవుతోంది. 

honeymoon destinations thailand prayanikudu
సీచెల్స్ | Photo: Pexels

సీషెల్స్‌లో కూడా మన లక్షద్వీప్‌లాగే ( Lakshadweep ) అద్భుతమైన బీచెస్‌ ఉన్నాయి. క్రిస్టల్ క్లియర్ సముద్ర నీటితో, పచ్చని చెట్లు , తెల్లని ఇసుకతో మన ల్యాప్‌టాప్ వాల్‌పేపర్ ఎలా ఉండాలనుకుంటామో అలా ఉంటాయి ఈ దేశంలో బీచులు.

ఇక్కడ బీచుల్లో ఉండే రాళ్లు, చిన్న చిన్న గుట్టల ఆకారాలు పర్యాటకులు ఆకర్షిస్తుంటాయి. 

సీషెల్స్‌లో ఏం చేయాలి ?

Things to do in Seychelles : కొత్త జంటలు ఇక్కడికి వెళ్లి బ్యూటిఫల్‌గా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఇంకా అంత పాపులర్ డెస్టినేషన్ కాదు కాబట్టి మీకు మిగితా బీచ్ దేశాల్లో ఉన్నట్టు క్రౌడ్ కనిపించదు.

  • లా డిగ్యూ ఐల్యాండ్ ( La Digue Island ) : ఇది చాలా ఛార్మింగ్ ఐల్యాండ్. ఇక్కడి అన్సే సోర్స్ డార్జెంట్ ( anse source d’argent ) లాంటి బీచు అందాలు చూస్తే కాసేపు మీ కళ్లను మీరే నమ్మలేరు.  చెప్పాను కదా ల్యాప్‌టాప్ వాల్ పేపర్ అని అలాంటి బీచే ఇది. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫోటోలు తీసే బీచు కూడా ఇదే.
  • స్నార్కిలింగ్, డైవింగ్ : ఇక్కడి ద్వీపాల చుట్టూ ఉన్న పగడపు దిబ్బలు ( coral reefs ) స్కార్కిలింగ్‌కు, డైవింగ్‌కు సూపర్ స్పాట్స్‌ లాంటివి. మీరు సముద్రంలోకి వెళ్లగానే రంగురంగుల చేపలు, తాబేళ్లు మీ చుట్టు చేరిపోతాయి.
  •  ప్రకృతి సోయగాలు : సీచెల్స్‌లో వాల్లీ డే మై అనే యూనెస్కో ( UNESCO ) గుర్తింపు పొందిన సైట్‌కు మీరు తప్పకుండా వెళ్లండి. ఇక్కడ కవల కొబ్బరియాలు కనిపిస్తాయి. వీటిని కోకో డె మెర్ పామ్ ( Coco de Mer palm Seychelles ) అంటారు. రెండు కొబ్బరికాయలు అతుక్కునే పుడతాయి. కలిసే పెరుగుతాయి. 
  • సీచెల్స్ ఫుడ్ : సీచెల్స్‌లో ఎన్నో వెరైటీ  సీఫుడ్ దొరుకుతాయి. గ్రిల్డ్ ఫిష్ వంటి వాటిని లోకల్ మసాలాలతో సిద్ధం చేసి ఇస్తారు. చాలా మంది వీటిని లొట్టలేసుకుని తింటారు.
  • Read Also: UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు

4. మారిషస్ | Mauritius 

చాలా మంది మాల్దీవ్స్‌ మారీషస్ మధ్య కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మాల్దీవ్స్‌ ( Maldives ) అనేది భారత్‌పై తప్పుడుగా మాట్లాడే నేతలున్న దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ మారిషస్ ధీనికి భిన్నంగా భారతీయులను ఇష్టపడే దేశంగా మారింది.

honeymoon destinations thailand prayanikudu
మారిషస్ | Photo: Pexels

హిందూ మహాసముద్రం మధ్యలో ప్రశాతంగా తన పనేదో తానుచేసుకునే అందమైన దేశం మారిషస్. ఇక్కడి బీచులు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడి విభిన్నమైన కల్చర్, విలాసవంతబమైన రిసార్టులు పర్యాకులను మళ్లీ మళ్లీ వెళ్లేలా చేస్తాయి.

మారిషస్‌లో చేయాల్సినవి

Things to do In Mauritius : మారిషస్ అనేది అడ్వెంచర్ అండ్ రిలాక్సేషన్ కోసం మంచి టూరిస్ట్ స్పాట్. హనీమూన్‌కు పర్పెక్ట్ డెస్టినేషన్ ఇది.

  • బీచులు : మారిషస్ బీచుల్లో మీరు ప్రశాంతంగా మీకు నచ్చినన్ని రోజులు స్పెండ్ చేయొచ్చు. ఇక్కడి బెల్లె మారే లేదా లే మార్నె బీచుల్లో మీరు స్నార్కిలింగ్, విండ్ సర్ఫింగ్ చేయొచ్చు. లేదంటే బీచుల్లో ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేయండి. మిమ్మల్ని ఎవరు ఆపుతారో చూద్దాం.
  • బ్లాక్ రివర్ గార్జెస్ నేషనల్ పార్క్ : ఎటు చూసినా ఆశాశాన్నంటే కొండలు, దట్టమైన పచ్చని చెట్లతో నిండిన అడవి, ఆకాశం అంత ఎత్తు నుంచి జారిపడుతున్న జలపాతాల ఇవన్నీ చూడాలంటే మీరు బ్లాక్ రివన్ గార్జెస్ నేషనల్ పార్క్ ( Black River Gorges National Park )  వెళ్లాల్సిందే. ఇక్కడ చాలా మంది హైకింగ్ కూడా చేస్తుంటారు.
  • మారిషస్ కల్చర్ :  కొత్త జంటలు మారిషస్ కల్చర్ తెలుసుకోవడానికి పోర్ట్ లూయిస్‌కు ( Port Louis ) వెళ్లొచ్చు. లేదంటే మెహెబూర్జ్ పట్టణంలో సరదాగా చక్కర్లు కొట్టొచ్చు.
  • మారిషస్ ఫుడ్ | Mauritius Food : మారిషస్‌లో మీకు ఆప్రికన్, ఇండియన్, చైనీస్, ఫ్రెంచ్ వంటలు ఎక్కువగా కనిపిస్తాయి.ఇక్కడ మీరు డోల్ పురీ , ఫిష్ విండేయ్ ట్రై చేయొచ్చు.
  • Read Also: Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

5. ఫిజీ | Fiji

నీలిరంగు బీచులకు, ఆకుపచ్చని ప్రకృతి రమణీయతకు, సాహసయాత్రికులకు ఫిజీ చాలా ఫేమస్. ఇక్కడి ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. టూరిస్టులతో చాలా మర్యాదగా మాట్లాడుతారు. ఎందుకంటే ఇక్కడ టూరిస్టుల నుంచి వచ్చే ఆదాయమే ప్రధానం.

honeymoon-destinations-fiji-prayanikudu
ఫిజీ | Photo : Pexels

ఫిజీలో చేయాల్సినవి 

Things to do in Fiji : పగడపు దీవులు, అద్భుతమైన ల్యాండ్ స్కేప్ ఇవన్నీ కొత్త జంటకు ఒక మంచి హనీమూన్ డెస్టినేషన్‌గా ఫిజీని మార్చేశాయి.

  • ఐలాండ్ హాపింగ్ | Fiji Island Hopping : ఇక్కడి బీచు అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. మీ మనసుని అందంగా చుట్టిపడేస్తాయి. మామానుకా బీచ్, యసావీ ఐల్యాండ్‌లు కొత్త జంటలకు కావాల్సిన ఏకాంత సమయాన్నిఅందిస్తాయి. ఇక్కడ రిసార్టుల్లో సకళ సౌకర్యాలు ఉంటాయి.
  • వాటర్ యాక్టివిస్ :  ఫిజీ అనేది వాటర్ స్పోర్ట్స్‌కు అడ్డా లాంటిది. ఇక్కడి పగడపు దీవులు చూడాలని చాలా మంది దూరదూరం నుంచి వస్తుంటారు. స్కూబా డైవింగ్, స్కార్కిలింగ్, బోట్ టూరు ఇంకా ఎన్నో యాక్టివిటీస్ చేసేయొచ్చు.
  • ఫిజీ కల్చర్ : ఇక్కడి లోకల్ కావా అనే ట్రెడిషనల్ ( Kava Ceremony ) ఆచారంలో పాల్గొని మీరు లోవో అనే విందును ( lovo feast) ఎంజాయ్ చేయొచ్చు. లోవో విందులో ఫుడ్‌ను భూమి కింద ఉన్న భట్టీ లేదా ఓవెన్‌లో వండుతారు.
  • ఫిజీ ఫుడ్ : ఫిజీలో మీరు ఎన్నో రకాలు సీఫుడ్, అడవి పండ్లను ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కోకోడా ( Kokoda ) అనే డిష్ ఎక్కువ మంది ట్రై చేస్తారు. దీన్ని ఫిష్, నిమ్మకాయ, పాలతో తయారు చేస్తారు.
  • Read Also: Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి? 

6. టర్కీ | Turkey

ఈ మధ్య కాలంలో టర్కీ వెళ్లే వాళ్ల సంఖ్య భారీగా తగ్గింది. అక్కడ కూడా గోవా ( Goa ) లాగే బాదుడే బాదుడు కార్యక్రమం నడుస్తోంది. దీంతో టర్కీలో ఉన్నవాళ్లే టర్కీలో ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా పక్కనే ఉన్న యూరప్ దేశాలు, ఇతర ఆసియా దేశాలకు వెళ్తున్నారు.

ఇలాంటి సమయంలో కొత్త జంట ఇక్కడికి వెళ్లడం అనేది సాహసమే అని చెప్పాలి.

Prayanikudu

ఎనీవే ఆప్షన్స్ చెప్పడం నా భాద్యత..భాద్యత కాదు బాధ్యత.  ఓకే ఓకే ఓకే. బాధ్యత కాబట్టి చెబుతున్నాను.

ముందుగా టర్కీ అనేది ట్రాన్స్ అజర్ బైజాన్‌లాగే ( Azerbaijan ) ట్రాన్స్ కాంటినెంటల్ కంట్రీ ( transcontinental country ). రెెండు ఖండాల మధ్య ఉండే దేశాన్ని ట్రాన్స్ కాంటినెంటల్ కంట్రీ అంటారు. టర్కీ యూరోప్ అండ్ ఆసియా ఖండాల మధ్యలో ఉంటుంది. సో టర్కీకి వెళ్లి మీరు యూరోప్ అండ్ ఆసియా రెండూ కవర్ చేయొచ్చు. 

టర్కీలో చేయాల్సినవి 

Things to to In Turkey : టర్కీ చరిత్ర, లోకల్ మార్కెట్లు, పురాతన భవనాలు, అందమైన ల్యాండ్‌స్కేప్స్, రుచికరమైన భోజనం ఇవన్నీ కలిపి ఒక మంచి ( అండ్  కాస్ట్‌లీ ) హనీమూన్ ప్యాకేజీగా చెెప్పవచ్చు.

  • ఇస్తాంబుల్ |  Istanbul :  మీ ప్రయాణాన్ని ఇస్తాంబుల్‌లో ప్రారంభిస్తే తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రాంతాలు కవర్ చేయొచ్చు. టర్కీ ( Turkiye )  సోల్ ఇక్కడ చూడొచ్చు. ఇస్తాంబుల్ అనేది టర్కీ చరిత్రను, వర్తమానాన్ని రెండింటినీ చూపే ప్లేస్. ఇక్కడ మీరు హగియా సోఫియా ( hagia sophia ) అనే మసీదు ( istanbul Mosque ) చూడొచ్చు. స్థానికంగా గ్రాండ్ బజార్లో షాజింగ్ చేయొచ్చు. 
  • కేపడోషియా | Cappadocia : ఇది చూడ్డానికి హాలివుడ్ సినిమా సెట్‌లా ఉంటుంది. ఇక్కడి పర్వతాల ఆకారం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు.
Honeymoon Destinations Turkey prayanikudu pexels
కేపడోషియా, టర్కీ | Photo : Pexels
  • చిన్న చిన్న ఎత్తైన లేదా పొడవైన పర్వతాల్లో అప్పట్లో జనాలు ఇల్లు కట్టుకున్నారు. అది అద్భుతంగా అనిపిస్తుంది. ఈ పాత కాలం ఇళ్లకు ఆనుకుని కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు చాలా మంది. అది కూడా బాగుంటుంది. ఇక్కడ మీరు హాట్ బెలూన్‌లో ఆకాశంలో విహారయాత్ర చేయొచ్చు.
  • టర్కైస్ కోస్ట్ | Turquoise Coast : టర్కీలో చాలా మంది టర్కైస్  కోస్ట్‌కు వెళ్లి చారిత్రాత్మక నగర తీరం నుంచి ఎదురుగా సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
  • టర్కీ ఫుడ్ | Turkey Food : టర్కీలో పుడ్ చాలా పాపులర్ అని చెప్పొచ్చు. ఇక్కడ కబాబ్స్, బక్లావా వంటి ఎన్నో వెరైటీస్ ట్రై చేయొచ్చు.

7. శ్రీలంక | Sri Lanka


ఇండియాకు అతి దగ్గర్లో ఉన్న దేశాల్లో శ్రీలంక ఒకటి. చాలా మంది ఈ దేశాన్ని తమ హనీమూన్‌ స్పాట్‌గా మార్చుకుంటారు. మిగితా దేశాలతో పోల్చితే శ్రీలంకకు మన దేశానికి మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. 

Honeymoon Destinations Sri Lanka prayanikudu pexels
శ్రీలంక | Photo : Pexels

కొంత కాలం క్రితం తీవ్ర సంక్షోభంలో ఉన్న ఈ దేశం ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. అందుకే టూరిస్టులను బంగారంలా చూసుకుంటారు. 

శ్రీలంకలో చేయాల్సినవి

Things to do in Sri Lanka : శ్రీలంకా బీచుల నుంచి వైల్డ్ లైఫ్, అద్భుతమైన ల్యాండ్ స్కేప్, పురాతన మందిరాలు, ఇంకా ఎన్నో కలిసి ఈ దేశాన్ని హనీమూన్ స్పాట్‌గా మార్చాయి.

  •  సిగిరియా | Sigiriya : రావణుడి లంక అనే పిలిచే కొండ ఇది. దీనిని లయన్ రాక్. సిగిరియా అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడే సీతమ్మను రావణుడు ఉంచారని చెబుతారు. ఇది యూనెస్కో గుర్తింపు పొందిన సైట్.  శ్రీలంకలో రామయణంలో ప్రధాన ఘట్టాలు జరిగిన ప్రాంతాలకు రామాయణ ట్రెయిల్ ( Ramayana Trail ) అనే ప్యాకేజీతో విజిట్ చేయవచ్చు.
  • వైల్డ్ లైఫ్ సఫారీ: శ్రీలంకలో మీరు యాలా నేషనల్ పార్క్‌లో ( Yala National Park ) మీరు చిరుతలను, ఏనుగులను, ఎన్నో రకాలు పక్షులను చూడొచ్చు.
  • బీచులు :  శ్రీలకంలో కూడా అందమైన బీచులు ఉన్నాయి. ఈ దేశం అన్ని వైపులా సముద్రం ఉంది కాబట్టి వాటర్ యాక్టివీటీస్ కోసం ప్రయత్నించవచ్చు. ఇక్కడి మిరిస్సా ( Mirissa ), ఉనావతునా ( Unawatuna ) బీచులు హైలైట్ అని చెప్పొచ్చు.
  • శ్రీలంక ఫుడ్ | Sri Lanka Food : శ్రీలంక్ ఫుడ్‌‌లో వాడే మసాలాలు ఫుడ్ లవర్స్‌ను కట్టిపడేస్తుంటాయి. ఇక్కడ మీరు హోప్పర్ ( Hoppers ) అనే ఒకరమైన ప్యాన్ కేక్, లాంపరిస్ ( Lamparis) అనే రైస్ డిష్ మీరు తప్పకుండా ట్రై చేయండి

మొత్తానికి హనీమూన్ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక స్పెష్ మూమెంట్. ఈ మూమెంట్ జీవితాంతం ఒక మంచి మెమోరీలా మిగిలి పోవాలంటే మీకు అవకాశం, ఆర్థిక వెసులు బాటు ఉంటే పైన ఉన్న వాటిలో ఏదో ఒక డెస్టినేషన్‌ను ఎంచుకోండి. మన దేశంలో కూడా కేరళ, మనాలి, మేఘాలయ లాంటి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. వాటిని కూాడా ఎంచుకోవచ్చు.

నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా నచ్చినా, నచ్చకపోయినా లేదా మీరు ఏదైనా సజెస్ట్ చేయాలన్నా కామెంట్ సెక్షన్ 24*7 మీకోసం అందుబాటులో ఉంటుంది. 

ఈ  కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతంది అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!