Experium Eco Park : హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరానికి దగ్గర్లోనే ఒక ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ పార్క్ అయిన ఎక్స్పీరియం పార్క్ ప్రారంభమైంది. ఈ పార్కును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కు అందం చూస్తూ దాని గురించి తెలుసకుందాం.

- Experium Park Facts : అద్భుతమైన చరిత్రకు, సంప్రదాయానికి ఆలవాలం అయిన భాగ్యనగరానికి మరో అందమైన పార్కు తోడైంది. వరల్డ్ క్లాస్ స్టాండర్ట్స్‌తో ఏర్పాటు అయిన ఎక్స్ పీరియం పార్కులో 150 ఎకరాల పార్కులో 25,000 జాతులు మొక్కలు, వృక్షాలు, అందమైన కళాఖండాలు ఉన్నాయి.

దుబాయ్‌లోని ఐకానిక్ మిరాకిల్ గార్డెన్‌ను తలదన్నేలా ఉంది ఈ ఎక్స్ పీరియం పార్కు. దీనిని తెలంగాణ ముఖ్యమంత్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది రంగారెడ్డి జిల్లాలోని ప్రొద్దుటూరు గ్రామంలో ఉంది.

నేచర్‌తో పాటు ఇక్కడ అందమైన 20 స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలు ఉన్నాయి. అందులో కొన్ని అయితే ఏకంగా 30 అడుగుల ఎత్తు ఉన్నాయి. వీటి ధర వచ్చేసి రూ.5 లక్ష నుంచి 1 కోటి వరకు ఉంటుంది. వీటి విలువే సుమారు రూ.15 కోట్ల వరకు ఉంటుంది.

ఈ పార్కులో మొత్తం 40 గదులు, 20 రిసాార్టులు ఉన్నాయి.దీంతో పాటు ఇక్కడ జిప్‌లైన్ యాక్టివిటీస్ కూడా చేయవచ్చు. ఇక్కడ సెల్పీలు తీసుకోవడానికి సుమారు 600 స్పాట్స్ ఉన్నాయి.

ఇక్కడి మొక్కలను 85 దేశాల నుంచి సేకరించారు. అంటే అంతర్జాతీయ వృక్షాలను, మొక్కలను నేచర్ లవర్స్ ఇక్కడ వీక్షించే అవకాశం ఉంది.

India’s Biggest Amphitheatre : ఇక్కడ ఎన్నో అరుదైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. ఇందులో కొన్నింటి ధర వచ్చేసి రూ. 1 లక్ష నుంచి రూ.3.5 కోట్ల వరకు ఉంటుంది. ఎక్స్ పీరియం పార్కులో దేశంలోనే అతిపెద్ద హంపి థియేటర్ ఉంది. ఇందులో 1500 మంది కూర్చోవచ్చు. దీని విస్తీర్ణం 5 ఎకరాలు. ఎక్స్ పీరియం పార్కు సిద్ధం చేయడానికి వ్యవస్థాపకుడు, నేచర్ లవర్ అయిన రాందేవ్ సుమారు ఆరున్నరేళ్ల పాటు శ్రమించారు.

First Aquarium Restaurant : ఎక్స్ పీరియంలో తొలి ఏక్వేరియం రెస్టారెంట్ ఉంది. ప్రపంచంలోనే తొలి ట్రీ కాఫీ షాప్ ఉంది. 12 ఎకరాల్లో విస్తరించిన మ్యాన్‌మేడ్ బీచ్ ఉంది. ఈ పార్కులో ఉన్న మొక్కల విలువే సుమారు రూ.150 కోట్లు ఉంటుంది.

ఈ పార్కు చిలుకూరు ఆలయం రోడ్డు సమీపంలో ఉన్న పొద్దుటూరు గ్రామంలో ఉంది. దీని విస్తీర్ణం 5 ఎకరాలు. ఎక్స్ పీరియం పార్కు సిద్ధం చేయడానికి వ్యవస్థాపకుడు, నేచర్ లవర్ అయిన రాందేవ్ సుమారు ఆరున్నరేళ్ల పాటు శ్రమించారు.
ఆ శ్రమకు ఫలితంగా అత్యంత అందగా సిద్ధమైన ఈ పార్కు ఇకపై భాగ్యనగర వాసులను ఎంతగానో అలరించనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.