2020 నుంచి తెలుగులో వ్లాగింగ్స్ వేగాన్ని పుంజుకున్నాయి. అందులో మరీ ముఖ్యంగా వందలాది మంది ట్రావెల్ వ్లాగర్స్ తన ప్రయాణాలను ప్రేక్షకులతో షేర్ చేసి ఆన్‌లైన్ ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తున్నారు.
నిజానికి ట్రావెల్ వ్లాగింగ్ ( Telugu Travel Vlogging ) ప్రతీసారి కనిపించినంత ఆహ్లాదరకంగా ఉండదు. ఎన్నో కష్టాలను, నష్టాలను భరిస్తూ తెలుగు ట్రావెల్ వ్లాగర్స్‌గా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న, తెచ్చుకుంటున్న వ్లాగర్స్ చాలా మంది ఉన్నారు. అందులో మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది Telugu Women Travel Vloggers వీరే…
1.చమేలీ నాదెల్లా | Chameli Nadella
తెలుగులో ట్రావెల్ వ్లాగింగ్ ఊపు 2020 నుంచి మొదలైంది. అదే సమయంలో చమేలీ నాదెల్లా మోటో వ్లాగ్ స్టార్ట్ చేసి సుమారు 2023 వరకు మొత్తం 50 వ్లాగ్స్ పూర్తి చేసింది తను.
తెలుగు వాళ్లే అయినా ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌కి 2020 ఆ సమయంలో కుటుంబంతో సహా షిఫ్ట్ అయ్యారని ఒక వీడియోలో తెలిపారామె. దేవ్ భూమీలోని ( Uttarakhand Is Also Called As Dev Bhoomi) రిస్కీ టెర్రెయిన్స్‌లో మోటో వ్లాగింగ్ మొదలు పెట్టింది చమేలీ నాదెల్లా.
Also Read : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ప్రస్తుతం తను యాక్టీవ్‌గా పోస్ట్ చేయడం లేదు. ఏమైనా అప్డేడ్స్ ఉంటే ఈ స్టోరీలో షేర్ చేస్తాను చూడండి
Chameli Nadella YouTube Channel
2.తెలుగు యాత్రి | Telugu Yatri
ఆప్ఘనిస్తాన్‌కి (Afghanistan) మగవాళ్లు వెళ్లడానికే భయపడతారు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న పరిస్థితులు అలాంటివి. అర్థం పర్థం లేని రూల్స్ ఉన్న ఆ దేశానికి వెళ్లి ఇబ్బంది పడటం కన్నా పక్కనే ఉన్న పాకిస్తాన్‌కు వెళ్లడం బెటర్ అనుకుంటారు. అలాంటిది మహిళలపై కోటిన్నర కండిషన్స్ పెట్టే తాలిబన్ల దేశంలోకి తెలుగమ్మాయి వెళ్లడం ప్రశంసనీయం అని చెప్పాలి.
తెలుగు యాత్రి పేరుతో యూట్యూబ్ నిర్వహించే డేర్ అండ్ డ్యాషింగ్ గాళ్ 2023 నుంచి వ్లాగింగ్ స్టార్ట్ చేసి విజయం సాధించింది. ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ సోలో ట్రిప్స్ వేయగలదా అని ప్రశ్నించే చాలా మంది నోటికి తాళం వేసింది.
తన వివరాలు తెలిస్తే అప్డేడ్ చేస్తాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
3.శుభ వీరపనేని | Subha Veerapaneni
నేను ఒకప్పుడు బాగా ఫోలో అయిన ట్రావెల్ వ్లాగర్ శుభ వీరపనేని. వినదగునెవ్వరు చెప్పినా అంటారు కదా శుభ మాట్లాడే విధానానికి చాలా మంది కనెక్ట్ అయ్యేవారు. చాలా క్యాజువల్‌గా, జోవియల్‌గా చెదరని చిరునవ్వుతో తను నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి రష్యా, అమెరికాను తన వ్లాగ్స్‌తో కవర్ చేసింది.
ప్రస్తుతం రెండు సంవత్సరాల నుంచి శుభ వ్లాగ్స్ చేయడం లేదు. మేబీ ఏదోక రోజు మళ్లీ స్టార్ట్ చేస్తారేమో, చూద్దాం మరి.ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఇక్కడే పోస్ట్ చేస్తాను.
Subha Veerapaneni Youtube Channel :
4.మధులత పల్లి | Madhulatha Palli
నేను ప్రయాణికుడు (Prayanikudu) అనే ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే 2023 అక్టోబర్ నుంచి మధలత పల్లి వ్లాగ్స్‌ను ఫాలో అవుతున్నాను. ప్రస్తుతం చాలా యాక్టివ్‌గా ఉన్న women travel vloggers telugu లో తను కూడా ఒకరు.
వియాత్నాం, థాయ్‌లాండ్ నుంచి ఈజిప్ట్, ఉజ్బేకిస్తాన్, చైనా, శ్రీలంకా ఇలా వేగంగా దేశాలన్నీ చుట్టేస్తోంది మధులత.
ప్రశాంతంగా ట్రావెల్‌ను ఎంజాయ్ చేస్తూ ఎలాంటి హడావిడి లేకుండా వ్లాగ్స్ చేస్తుంది.
Madhulatha Palli YouTube Channel
నేను ఇక్కడ కొంత మంది గురించే ప్రస్తావించాను.ఇంకా చాలా మంది గురించి నాకు తెలియదు అని నేను క్లియర్‌గా చెప్పగలను. అందుకే మీకు తెలిసిన మహిళా ట్రావెల్ వ్లాగర్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయగలరు. లేదా నాకు మెయిల్ చేయగలరు.
kishoreteugutraveller@gmail.com
Also Read : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ముగింపు | This Story Ends Here
ఈ స్టోరీలో ఫోటోలను వారి ఇన్‌స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను. ఆ ఫోటోలపై సర్వహక్కులు వారివే.
Photo Credit Notes :
- Gif Taken From Tenor
- Vloggers Images Downloaded From Their Respective Instagram Accounts
- I Don’t Claim Ownership Neither Intended To do so.
- Photos Used For Narrative Purpose Only