Tourist Destinations : సౌత్ ఇండియాలో స్వర్గం..టాప్-10 టూరిస్ట్ స్పాట్స్ ఇవే.. ట్రిప్ ప్లాన్ చేసే ముందు తప్పక చదవండి
Tourist Destinations : దక్షిణ భారతదేశం పర్యాటకులకు ఎప్పుడూ కొత్త అనుభూతులను, మంత్రముగ్ధులను చేసే అందాలను అందిస్తుంది. ఆహ్లాదకరమైన బీచ్‌లు, పచ్చని కొండ ప్రాంతాలు (Hill Stations), ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, పురాతన దేవాలయాలకు సౌత్ ఇండియా ప్రసిద్ధి చెందింది. మీ రాబోయే ట్రిప్ కోసం సౌత్ ఇండియా వైపు ప్లాన్ చేస్తుంటే మీరు అస్సలు మిస్ కాకూడని టాప్ 10 పర్యాటక ప్రాంతాల వివరాలను, వాటి విశేషాలను ఇప్పుడు చూద్దాం. కేరళ(Kerala): బ్యాక్ వాటర్స్, హనీమూన్…
Tourist Destinations : దక్షిణ భారతదేశం పర్యాటకులకు ఎప్పుడూ కొత్త అనుభూతులను, మంత్రముగ్ధులను చేసే అందాలను అందిస్తుంది. ఆహ్లాదకరమైన బీచ్‌లు, పచ్చని కొండ ప్రాంతాలు (Hill Stations), ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, పురాతన దేవాలయాలకు సౌత్ ఇండియా ప్రసిద్ధి చెందింది. మీ రాబోయే ట్రిప్ కోసం సౌత్ ఇండియా వైపు ప్లాన్ చేస్తుంటే మీరు అస్సలు మిస్ కాకూడని టాప్ 10 పర్యాటక ప్రాంతాల వివరాలను, వాటి విశేషాలను ఇప్పుడు చూద్దాం.
కేరళ(Kerala): బ్యాక్ వాటర్స్, హనీమూన్ స్పాట్స్
అలెప్పి (Aleppey) / అలప్పుజ: వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచే అలెప్పి, పచ్చని ప్రకృతి మధ్య బ్యాక్ వాటర్స్‌తో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ హౌస్‌బోట్ ప్రయాణం చాలా ప్రసిద్ధి. బెస్ట్ టైమ్: నవంబర్ నుంచి ఫిబ్రవరి.
కుమరకోమ్ (Kumarakom): శీతాకాలంలో సందర్శించడానికి ఇది చాలా ఆకర్షణీయమైన ప్రదేశం. ఇది తాటి చెట్లు, పచ్చని బ్యాక్ వాటర్స్‌తో నిండి ఉంటుంది. హనీమూన్ జంటలకు ఇది స్వర్గధామం. బెస్ట్ టైమ్: నవంబర్ నుంచి ఫిబ్రవరి.

మున్నార్ (Munnar): కేరళలోని కన్నన్ దేవన్ కొండలలో ఉన్న మున్నార్, సుందరమైన టీ తోటలు, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి. ఇది కూడా ఒక ప్రముఖ హనీమూన్ గమ్యస్థానం. బెస్ట్ టైమ్: డిసెంబర్ నుంచి ఫిబ్రవరి.
వయనాడ్ (Wayanad): పశ్చిమ కనుమలలో దట్టమైన వృక్షజాలం, జంతుజాలం ఉన్న ప్రదేశం వాయనాడ్. ట్రెకింగ్, ప్రకృతిని ప్రేమించేవారికి ఇది అద్భుతమైన స్పాట్. బెస్ట్ టైమ్: అక్టోబర్ నుంచి మే.
కర్ణాటక (Karnataka): అడవులు, కాఫీ తోటలు
కూర్గ్ (Coorg): ‘కర్ణాటక స్విట్జర్లాండ్’ అని పిలవబడే కూర్గ్‌లో కాఫీ, టీ తోటలు, ప్రవహించే నదులు, జలపాతాలు పర్యాటకులకు స్వర్గంలో ఉన్న అనుభూతిని ఇస్తాయి. బెస్ట్ టైమ్: అక్టోబర్ నుంచి మార్చి.

కబిని (Kabini): వన్యప్రాణులను దగ్గరగా చూడాలనుకునే వారికి కర్ణాటకలోని కబిని అత్యుత్తమ ప్రదేశం. ఇక్కడ భారతదేశంలోని విభిన్న వృక్షజాలం, జంతుజాలాలను చూడవచ్చు. బెస్ట్ టైమ్: అక్టోబర్ నుంచి ఫిబ్రవరి.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
అగుంబే (Agumbe): వర్షారణ్యాలు, ఉప్పొంగే జలపాతాలకు ప్రసిద్ధి చెందిన అగుంబే, ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన గమ్యస్థానం. బెస్ట్ టైమ్: అక్టోబర్ నుంచి ఫిబ్రవరి.
తమిళనాడు (Tamil Nadu): కొండల రాణి, చరిత్ర
కొడైకెనాల్ (Kodaikanal): తమిళనాడులోని ఈ అందమైన హిల్ స్టేషన్ పొగమంచుతో నిండిన కొండలు, చల్లని వాతావరణానికి చాలా ప్రసిద్ధి. బెస్ట్ టైమ్: మార్చి నుంచి మే.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఊటీ (Ooty): క్వీన్ ఆఫ్ ది హిల్స్ అని పిలవబడే ఊటీ, ముఖ్యంగా హనీమూన్ జంటలకు, కుటుంబాలకు ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ పచ్చని లోయల అందాలు ఆకట్టుకుంటాయి. బెస్ట్ టైమ్: ఏప్రిల్ నుంచి జూన్, సెప్టెంబర్ నుంచి నవంబర్.
తంజావూరు (Thanjavur): గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే చారిత్రాత్మక పట్టణం తంజావూరు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు ఇక్కడి హైలైట్. నిర్మాణ అద్భుతాలు చూపు తిప్పుకోనివ్వవు. బెస్ట్ టైమ్: అక్టోబర్ నుంచి మార్చి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
