ప్రపంచంలో స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో జపాన్ (japan) కూడా ఒకటి. ఇక్కడ పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే ప్రతీ ఒక్కరూ తమ ఇల్లు మాత్రమే కాదు తమ ఇంటి ముందు వెనకా, వీధులను శుభ్రం చేస్తుంటారు.
- అలాగే ఏదైనా పబ్లిక్ ప్లేసులోకి వెళ్తే అక్కడ ఎలాంటి చెత్త పడేయరు. వీలైతే క్లీన్ చేస్తుంటారు.
ఇవన్నీ మనం టీవీల్లో సోషల్ మీడియాలో చూసినవి, వార్తల్లో చదివినవే కదా. మరి నిజంగా జపాన్ అంత నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుందా ఏంటి అనే డౌట్ సిమ్రన్ జైన్ (simran jain) అనే ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు వచ్చింది.
Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఎలాగూ జపాన్‌లోనే ఉన్నాను కదా అని టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది సిమ్రన్. ఆ టెస్టులో జపాన్ పాసయింది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా ప్రజలు అవాక్కవుతున్నారు.
ఈ టెస్టుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ముందుగా ఒక స్టోర్ నుంచి కొత్త తెల్లని సాక్సులు కొనింది సిమ్రన్. వాటిని ధరించి రోడ్డుపై ఫుట్‌పాత్‌పై నడవడాన్ని (Japan hygienist test ) వీడియోలో చూడొవచ్చు.
కొద్ది సేపు నడిచిన తరువాత ఒక చోటు కూర్చుని తన సాక్సులు నిజంగా మురికిగా మారాయో లేదో అనేది కెమెరాకు చూపించింది.
చూస్తూ అప్పుడే ఉతికిన సాక్సులా ఏ మాత్రం మురిగి లేకుండా సాక్సులు కనిపించాయి. ఇది చూసి చాలా మంది వావ్ అని జపాన్ దేశాన్ని తెగ పొగిడేస్తున్నారు.
Read Also: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
25 ఏళ్ల నుంచి జపాన్‌లో ( Japan )ఉంటున్నాను…
కానీ కొంత మంది మాత్రం ఇది నమ్మశక్యంగా లేదు అంటున్నారు.
మరికొంత మంది అయితే ఇది పూర్తి వీడియో కాదు…మధ్యలో ఏం జరిగిందో మాకు ఎలా తెలుసు అంటున్నారు
మరో యూజర్ అయితే “ నేను 25 ఏళ్ల నుంచి జపాన్‌లో ఉంటున్నాను. జపాన్ పరిశుభ్రంగా ఉంటుంది అని చెప్పగలను. కానీ తెల్ల సాక్సుపై ఒక్క నల్లని గుర్తు పడకుండా ఉండేంతగా ఉంది అంటే ఈ వీడియో ఫేక్ అని చెప్పగలను. జపాన్ మరీ అంత క్లీన్ అని నేను అనుకోను” అని కామెంట్ చేశాడు.
ఒకసారి ఇండియాలో నల్ల సాక్సు వేసుకుని ప్రయత్నించు అని సిమ్రన్‌కు మరో యూజర్ సలహా ఇచ్చాడు. జపాన్ వాసులు జీవన విధానం, వారి సమయపాలన గురించి ప్రపంచానికి బాగా తెలుసు.
అయితే ఈ టెస్టు ఫలితాలు మాత్రం నిజంగా వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పాలి అని నెటిజెన్లు అంటున్నారు.
ఇంతకి ఈ వీడియో చూసిన తరువాత మీకు ఏమనిపిస్తోందో చెప్పండి. ఈ టెస్టులో సిమ్రన్ ఏమైనా దాచి పెట్టింద అంటారా ?
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.