ఊబర్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌లోని ఆటో సర్వీసెస్‌లో (Uber Auto) కేవలం నగదు ద్వారా మాత్రమే పేమెంట్ తీసుకోవాలని నిర్ణయించింది. దీని వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరగనుంది. పూర్తి వివరాలు..
ఊబర్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌లోని ఆటో సర్వీసెస్‌లో (Uber Auto) కేవలం నగదు ద్వారా మాత్రమే పేమెంట్ తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఒక కారణం కూడా ఉంది. ఊబర్ అనేది సాప్ట్‌వేర్ ఆజ్ ఏ సర్వీస్ (Software as a Service) గా మాత్రమే కొనసాగాలని భావిస్తోంది.
అంటే బుకింగ్ (Uber Auto Booking) వంటి సేవలు మాత్రమే అందించాలని అనుకుంటోంది. డ్రైవర్లు, ప్రయాణికుల మధ్య వివాదాలకు తావులేకుండా ఉండేందుకు ఇలా చేస్తోంది అని తెలుస్తోంది. దీంతో పాటు అపరేషన్స్ నిర్వహణలో కూడా ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తోంది ఊబర్.
ముఖ్యాంశాలు
ఊబర్ పాత్ర ఏంటి ? | Uber App New Changes In India
ఈ మార్పు వల్ల ఊబర్ అనేది ఇకపై ఆటో డ్రైవర్లు, ప్రయాణికులను కలిపే ఒక వేదికగా మాత్రమే మిగలనుంది. అంటే ఇకపై ప్రయాణికులు డైరక్టుగా డ్రైవర్లకు క్యాష్ ఇవ్వాలి లేదంటే డ్రైవర్ యూపీఐ ఐడీ వినియోగించి యూపీఐ (UPI) పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
ఇలా కుదరదు ఇక | Mode Of Uber Auto Payment
ఊబర్ తెచ్చిన మార్పు వల్ల ఇకపై ప్రయాణికులు ఊబర్ యాప్ ద్వారా పేమెంట్ చేయలేరు. ఊబర్ క్రెడిట్ అనేది అసలు కుదరదు. ఒక ట్రిప్‌కు కావాల్సిన సమాచారంతో పాటు ఫేర్ (Uber Fare) మాత్రమే నిర్ణయిస్తుంది.నిర్ణయిస్తుంది అనడం కన్నా సూచిస్తుంది అని చెప్పవచ్చు. ట్రిప్పు ముగిశాక పేమెంట్ విషయం డ్రైవర్ అండ్ రైడర్ మధ్య విషయంగా మాత్రమే మిగిలిపోనుంది. ఇందులో బేరసారాలకు కూడా అవకాశం ఉంటుంది.
పేమెంట్ విషయంలో ఊబర్ ఇన్వాల్వ్ అవ్వదు కానీ ఏమైనా సమస్య…అంటే సేఫ్టీ సంబంధిత అంశాలు ఉంటే మాత్రం ఊబర్ సపోర్టు (Uber Support) సహాయం తీసుకోవచ్చు. దీంతో పాటు రైడ్ కేన్సిల్ అయితే ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇలా ఎందుకు చేసింది ?
Uber New Changes Effects On Auto Riders : ఊబర్ తీసుకున్న ఈ నిర్ణయం అనేది డ్రైవర్లకు కలిసి వచ్చే విషయం. ఇకపై వారు సంపాదించే డబ్బు అంతా వారికే సొంతం అవనుంది. తమ యాప్ వినియోగించినందుకు ఇకపై ఊబర్ ఇక ఒక్కపైసా కూడా చార్జ్ చేయదు. దీని వల్ల డ్రైవర్ల ఆదాయం పెరుగనుంది.
ఊబర్ తీసుకున్న నిర్ణయాల్లో హైలైట్స్ ఇవే
- ఇకపై ఊబర్ సేవలు వినియోగించే వారు ఉబర్ యాప్ (Uber App) ద్వారా కాకుండా డైరక్టుగా క్యాష్ లేదా డ్రైవర్ యూపీఐ యాప్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
- ఇకపై ఊబర్ కేవలం డ్రైవర్లను, రైడర్లను కలుపుతుంది అంతే.
- ఊబర్ క్రెడిట్స్, ప్రమోషనల్ ఆఫర్లు ఉండవు.
- ఊబర్ ఒక ట్రిప్‌నకు ఎంత ఫేర్ ఉంటుందో సూచిస్తుంది. అయితే బేరసారాలు మాత్రం ప్రయాణికుడు, ఆటోడ్రైవర్ చేయాల్సిందే.
- ఇకపై రైడ్ బుక్ చేసుకుని కేన్సిల్ చేస్తే చార్జీలు చెల్లించే అవసరం లేదు.
ఊబర్ తీసుకువచ్చిన ఈ మార్పు వల్ల ఆటో డ్రైవర్లకు (Auto Drivers) ప్రయోజనం కలగనుంది అని చెప్పవచ్చు. అయితే ప్రయాణికులకు ఎలాంటి లాభాలు కలగనున్నాయి…లేదా ఎలాంటి ఇబ్బందులు కలగనున్నాయో కొంత కాలం ఆగితే తెలుస్తుంది. ఇక ఊబర్ ఆటో ఎక్కడానికి ముందే మీ జేబుల్లో క్యాష్ లేదా యూపీఐ ఉందో లేదో చెక్ చేసుకోండి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.