ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం అచరిస్తున్నారు. అయితే చాలా మంది భక్తుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే “నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు “ ( Next Kumbh Mela ) అని…ఈ ప్రశ్నకు సమాధానమే ఈ పోస్టు.
కుంభ మేళా, ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న, అత్యంత పెద్దదైన ఆధ్యాత్మిక వేడుక. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న2025 మహా కుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 2025 జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ మేళా ( Maha Kumbh Mela 2025 ) ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రోజు ముగుస్తుంది.
ముఖ్యాంశాలు
ఈ సమయంలో ప్రతీ రోజు మిలియన్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో ( Triveni Sangam ) పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర స్నానం తమ జీవితంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు.
ముఖ్యమైన తేదీలు | key Dates in Maha Kumbh Mela 2025
మహాకుంభ మేళాలో ప్రతీ రోజు పవిత్రమైనదే అయినా అందులో ఆరు రోజులను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇందులో మూడు రోజులు పుణ్య స్నానం ( Shahi Snan ) ఆచరించడానికి విశేషమైనవి కాగా, మరో మూడు రోజులు ఆధ్యాత్మికంగా విశిష్టమైనవి.
ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజులు
జనవరి 13, 2025- పౌష్ పౌర్ణమి ( మేళా ప్రారంభమైన తేది)
ఫిబ్రవరి12,2025- మాఘ పౌర్ణమి
ఫిబ్రవరి 26,2025 – మహా శివరాత్రి ( అంతిమ స్నానం )
పుణ్య స్నానాలు జరిగే రోజులు | Shahi Snan Dates
జనవరి 14, 2025 – మకర సంక్రాంతి ( మొదటి పుణ్య స్నానం )
జనవరి 29, 2025 : మౌని అమవాస్య ( 2వ పుణ్య స్నానం )
ఫిబ్రవరి 3వ తేదీ, 2025 – వసంత పంచమి ( 3వ పుణ్య స్నానం )
కుంభ మేళా ప్రాధాన్యత | Significance of Kumbh Mela
కుంభమేళా అనేది ఒక పర్వం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మి సంగమం. కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు హిందూ మతంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో పవిత్ర నదీ స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలుగుతాయి అని, మోక్షం లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు.
కుంభ మేళాకు భారత దేశం నుంచే కాకుండా 150 దేశాల నుంచి భక్తులు వస్తారు. ఇది భారతదేశ కీర్తిని దశదిశాల చాటే ఆధ్యాత్మిక వేడుక. భరతజాతి సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఆచారాలను చూసేందుకు దూరదూరం నుంచి భక్తులు వస్తుంటారు. హిందు మతం ఔన్నత్యం గురించి తెలుసుకునేందుకు ఇది ఒక మంది వేదిక.
నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు ? | Next Kumbh Mela After Prayagraj

ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా తరువాత ( Next Kumbh Mela ) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సింహాస్త మహాపర్వం ( Simhastha Mahaparv Ujjain ) జరగనుంది. ఇది 2028 మార్చి 27వ తేదీ నుంచి మే 27 వరకు నెల రోజుల వరకు జరగనుంది. ఈ మేళాలో కూడా రాజస్నానాలు జరగనున్నాయి. కుంభమేళా వారసత్వాన్ని కొనసాగించే ఈ మేళాకు సమారు 14 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.
అరుదైన మహా కుంభ మేళా | Why Maha Kumbh Mela 2025 Is important
కుంభ మేళా అనేది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా చెప్పవచ్చు. ప్రయాగ్‌రాజ్‌లో ( Prayagraj ) జరుగుతున్న మహా కుంభమేళా 2025 అనేది సాధారణ కుంభ మేళా కాదు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభ మేళా ఇది. మీరు భక్తులు అయినా, లేక పర్యాటకులు అయినా, లేక ప్రయాణికులు అయినా ఒక విషయం మీరు తెలుసుకోవాలి. మహా కుంభ మేళాలో స్నానం ఆచరించే అవకాశం చాలా మందికి జీవితంలో ఒక్కసారి కూడా లభించకపోవచ్చు. అందుకే వీలైతే ప్రయాగ్‌రాజ్ వెళ్లిరండి.
ఎలా వెళ్లాలి? ఎక్కడ ఉండాలి? ఏం చూడాలి ? ఏం తినాలి వంటి సందేహాలు ఉంటే మాత్రం …
మీ కోసం కుంభమేళాకు సంబంధించి ఎన్నో ఆర్టికల్స్ ప్రయాణికుడులో ( Prayanikudu.com ) పోస్ట్ చేశాము. వాటి లింక్స్ ఇక్కడ అందిస్తున్నాం. ఈ సమాచారం మీకు తప్పుకుండా ఉపయగపడతాయి అని ఆశిస్తున్నాం. మీకు ఇంకా ఏమైనా సందేమాలు ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా సమాధానం చెబుతాం. థ్యాంక్యూ
మహా కుంభ మేళాకు సంబంధించిన పోస్టులు
- కుంభ మేళాలో చేయకూడని 8 పనులు | Maha Kumbh Mela 2025
- ప్రయాగ్రాజ్లో 22 సందర్శనీయ ప్రదేశాలు | 22 Places To Visit In Prayagraj
- IRCTC Maha Kumbh Gram : లక్ష మంది కోసం లగ్జరీ టెంట్స్ ఏర్పాటు చేసిన ఐఆర్సీటిసి…మహా కుంభ గ్రామం విశేషాలు
- Kashi Travel Guide : కాశీ నగరం విశేషాలు…కాశీలో దర్శిచుకోవాల్సిన ఆలయాలు..కాశీ చరిత్ర, కాశీ ట్రావెల్ గైడ్
- వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు 9 స్పెషల్ ట్రైన్స్ | Maha Kumbh Mela Trains
- మహాకుంభ మేళ పవిత్ర స్నానాల ప్రాధాన్యత ఏంటి ?
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
