Oldest Hill Stations : భారతదేశం ఎన్నో అందమైన ప్రదేశాలకు నెలవు. ఇక్కడ దేశ వ్యాప్తంగా ఎన్నో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోండగా… మరికొన్ని హిల్ స్టేషన్స్ మాత్రం కొన్ని వందల శతాబ్దాల నుంచి పర్యాటకులను అలరిస్తున్నాయి.
అందులో టాప్ 10 హిల్ స్టేషన్స్ ఇవే
Table Of Contents
1.సిమ్లా | హిమాచల్ ప్రదేశ్ |

Shimla, Himachal Pradesh : హిల్ స్టేషన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లతో సిమ్లా తప్పకుండా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న సిమ్లా తన నేచురల్ బ్యూటీతో పాటు అందమైన నిర్మాణశైలి, మాల్ రోడ్ కోసం ఫేమస్. దీంతో పాటు ఇక్కడ రుచికరమైన భోజనం లభిస్తుంది.
2.ఊటి | తమిళనాడు

Ooty, Tamil Nadu: దక్షిణాది ప్రజలకు ఊటీ అంటే సిమ్లాకన్నా తక్కువేం కాదు. ఇక్కడి పచ్చదనం, కొండ మధ్యలో ఉన్న సరస్సులు, క్లియర్ స్కై ఇవన్నీ టూరిస్టులు ఊటీ వెళ్లేలా చేస్తున్నాయి. దీనిని క్వీన్ ఆఫ్ నీల్గిరిస్ అంటారు. అందమైన సీన్స్ చూస్తూ టాయ్ ట్రేన్‌లో ప్రయాణం చేయడం చాలా మందికి ఇష్టం.
3.చోప్టా | ఉత్తరాఖండ్

Chopta Uttarakhand : చోప్టాను మిని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ హిమాయాల సోయగాలు, అద్భుతమన్న సీన్స్ చూసి ప్రయాణికులు పరవశించిపోతుంటారు. చాలా మంది ఇక్కడికి విదేశాల నుంచి కూడా వస్తుంటారు. చోప్టా నుంచి చాలా మంది తుంగ్‌నాథ్ ట్రెక్ ప్రారంభించి తుంగ్‌నాథ్ ఆలయానికి వెళ్తుంటారు.
4. ముస్సోరి | ఉత్తరాఖండ్

Mussoorie, Uttarakhand: ముస్సోరిని క్వీన్ ఆఫ్ హిల్స్ అని కూడా అంటారు. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది చాలా పాపులర్ డెస్టినేషన్. ప్రకృతి మధ్యలో క్వాలిటీ సమయం గడపాలి అనుకుంటే ఇది చాలా మంది స్పాట్. ఇక్కడి నుంచి మీకు డెహ్రాడూన్, రిషికేష్, హరిద్వర్ దగ్గరే.
5.మహాబలేశ్వర్ | మహారాష్ట్ర

Mahabaleshwar, Maharashtra : పశ్చిమ కనుమల్లో ఉన్న అందమైన హిల్ స్టేషన్ మహాబలేశ్వర్. ఇక్కడి వ్యూస్‌తో చూడటానికే కాదు చాలా మంది ఇక్కడి స్ట్రాబెర్రీస్ టేస్ట్ చేయటానికి వస్తుంటారు. ఇక్కడి పచ్చదనం ప్రకృతి ప్రేమికులను పరవశించిపోయేలా చేస్తుంది.
6. నైనితాల్ |ఉత్తరాఖండ్ | Oldest Hill Stations

Nainital, Uttarakhand : నైనితాల్ అంటే ఇక్కడి సరస్సే గుర్తుకు వస్తుంది. ఈ సరస్సులో మీరు బోటింగ్ చేస్తుంటే మేఘాల మేధ్యలో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, అందమైన వ్యూస్ ప్రయాణికులను తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయి.
7. మున్నార్ | కేరళ | Oldest Hill Stations

Munnar, Kerala : దక్షిణాదిలో ఉన్న అందమైన హిల్ స్టేషన్స్‌లో మున్నార్ ఒకటి. ఇక్కడి రోలింగ్ టీగార్డెన్స్, అరుదైన జంతుసంపద, పొగమంచుతో నిండిన పర్వతాలు ఇవన్నీ కలిపి మున్నార్‌ను పేవరిట్‌గా మార్చాయి. ( Unsplash )
8.ఓలి, ఉత్తరాఖండ్

Auli, Chamoli, Uttarakhand : వింటర్లో స్వర్గంగా కనిపించే హిల్ స్టేషన్ ఓలి. నిజానికి ఇక్కడికి ఎండాకాలం కూడా వెళ్లవచ్చు. అయితే వింటర్లో ఓలికి చాలా మంది స్కోలో స్కీయింగ్ చేయడానికి వస్తుంటారు. సాహసాన్ని ఇష్టపడే వాళ్లకు ఇది మంచి డెస్టినేషన్ అవుతుంది.
9.లోనావాలా , మహారాష్ట్ర

Lonavala, Maharastra : మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా వెళ్లే ట్రావెల్ డెస్టినేషన్స్‌లో లోనావాలా తప్పకుండా ఉంటుంది. ఇది ముంబై, పూణెకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడి అందమైన నేచర్, వ్యూస్, గుహలు, టైగర్ పాయింట్ చూడటానికి చాలా మంది దూర దూరం నుంచి వస్తుంటారు.
10.మౌంట్ అబు, రాజస్థాన్

Mount Abu, Rajasthan. రాజస్థాన్‌లో ఉన్న ఒకే ఒక హిల్ స్టేషన్ వచ్చేసి మౌంట్ అబు. ఇక్కడ వాతావరణ చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి నక్కీ లేక్ చాలా పాపులర్. దీంతో పాటు ఇక్కడి దిల్వారా ఆలయానికి భక్తులు చాలా దూరం నుంచి వస్తుంటారు. చరిత్రతో పాటు ప్రకృతిని ఇష్టపడేవారికి ఇది మంచి ట్రావెల్ డెస్టినేషన్ అవుతుంది.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి