24 గంటల్లో 108 గణపతుల దర్శనం…ఛాలెంజ్ పూర్తి చేసిన PRAYANIKUDU
తెలుగు ట్రావెల్ వ్లాగ్స్‌తో వీక్షకులను ఆకట్టుకుంటున్న ప్రయాణికుడు (PRAYANIKDU) ప్రేక్షకుల కోసం ఒక ఆధ్మాత్మిక ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. 24 గంటల్లో 108 వరసిద్ధి వినాయకుల దర్శించుకుని తన ఛాజెంట్ను పూర్తి చేశాడు.
హైదరాబాద్‌లోని బేగంబజార్ (begum bazar ganesh), గోషామహల్, చందన్ వాడి, దత్తాత్రేయ కాలనీ, విజయ్ నగర్ కాలని, ఆఫ్జల్ గంజ్, ఛత్రి, రామ్ నగర్, కాచిగూడ, గౌలిగూడ, కోఠి, ఎంజే మార్కెట్లోని మండపాలను విజిట్ చేసి ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు.
24 గంటలు…రెండు సాయంత్రాలు
నిజానికి 24 గంటల్లో ఈ ఛాలెంజ్(108 ganesh in 24 hours) పూర్తి చేయాల్సి ఉన్నా..కేవలం సాయంత్రం సమయంలో మాత్రమే వినాయకుడి మండపాలు పూర్తి అలంకరణతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే ఈ 24 గంటల సమయంలో రెండు రాత్రులు కవర్ అయ్యేలా…ఉన్న 5-5 గంటల్లోనే ఈ 108 మండపాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని దండం పెట్టి, విగ్రహం విశేషాలు చెబుతూ వీడియోను రికార్డు చేసి అందించాడు.
సంఖ్యా పరంగా చూసుకుంటే ప్రతీ వినాయకుడిని విగ్రహాన్ని 10 సెకన్లలో రికార్డు చేసి ముందుకు వెళ్లి 6 గంటల్లో పూర్తి చేసేయవచ్చు. కానీ ప్రతీ మండపానికి వెళ్లి అక్కడి నిర్వాహకులతో మాట్లాడి, విగ్రహం విశేషాలు తెలుసుకుని, పౌరాణికంగా విశేషాలు తెలుసుకుని అందించే ప్రయత్నం చేయడంతో అంత టైమ్ పట్టింది.
ఈ వీడియోను మీరు కూడా చూసి ప్రయాణికుడి కష్టాన్ని గుర్తించి నలుగురికి షేర్ చేయాలని కోరుకుంటున్నాము.
వీడియోను చూడండి : 24 గంటల్లో 108 వినాయకుడి విగ్రహాల దర్శనం
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.