కుంభ మేళాలో ఖాళీ కడుపుతో తిరగకండి – ఉచిత భోజనం దొరికే 8 ప్రదేశాలు | Free Food In Maha Kumbh Mela 2025

Share This Story
మీరు కుంభ మేళాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నా...లేక కుంభ మేళా జరిగే ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉచిత భోజనం ( Free Food In Maha Kumbh Mela 2025 ) ఎక్కడ లభిస్తుందో తెలుసుకోండి. 

Free Food in Maha kumbh Prayagraj : సనాతన ధర్మంలో మహాకుంభ మేళాకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. 2025 జనవరి 13 వ తేదీన ప్రారంభమైన మహా కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఒకవేళ మీరు కూడా కుంభ మేళాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నా…లేక కుంభ మేళా జరిగే ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉచిత భోజనం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోండి. అవకాశం ఉంటే ఈ ప్రసాదాన్ని స్వీకరించండి.

కుంభ మేళాలో ఉచిత భోజనం ఎక్కడ లభిస్తుంది ? | Free Food In Kumbh Mela 

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న కుంభ మేళాలో ఇప్సటి వరకు కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. ఇంకా కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తున్నారు. భక్తులకు సరిపడా టెంట్స్‌తో పాటు భోజన వసతి కల్పించే హోటల్లు అన్నీ ఉన్నా వీటికి డబ్బు చెల్లించాల్సి వస్తుంది. తమతో పాటు తెచ్చుకున్న డబ్బు సరిపోదు అనుకునేవాళ్లు, లేక డబ్బు ఆదా చేద్దాం అనుకునే వారు, అన్నదానంలో అందరితో కలిసి తినాలనుకునే భక్తులు ఈ కేంద్రాల్లో ఉచిత భోజనాన్ని పొందవచ్చు.

1. ఓం నమశ్శివాయ ఆశ్రమం, ప్రయాగ్‌రాజ్

Om Namah Shivay Ashram , Prayag Raj : కుంభ మేళాకు వచ్చే భక్తుల కోసం ఇక్కడ 24 గంటలూ అన్నదానం జరుగుతుంది. జాతి, మత కుల ఇలా ఎలాంటి వివక్షలు లేకుండా అందరికి భోజనం వడ్డిస్తారు. దీని కోసం భక్తులు లైన్లో నిలబడి తమ వంతు కోసం వేచి చూడాల్సి ఉంటుంది. 

48 ఏళ్ల క్రితం ఒక్క వంట పాత్రతో ప్రారంభమైన అన్నదాన సేవను నేడు కుంభమేళాలో 7 ప్రాంతాలకు విస్తరించారు. భక్తులకు వడ్డించే భోజనం క్వాలిటీ విషయంలో ఏనాడూ రాజీపడలేదు అని నిర్వహాకులు చెబుతున్నారు

ఎలా చేరుకోవాలి? | How to Reach Om Namah shivay Ashram Prayagraj

ఓం నమశ్శివాయ ఆశ్రమానికి చేరుకోవాలి అంటే ప్రయాగ్‌రాజ్‌లో కిలా చౌరాహా ( Kila Chauraha) అనే ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో మింటో పార్క్, సంకట్ మోచన్ ఆలయం సమీపంలో ఉంటుంది ఈ ఆశ్రమం.

2. నారాయణ సేవా సంస్థాన్ 

Narayan Seva Sansthan Free Food Seva in Prayagraj Kumbh Mela 2025
| Photo: Narayan Seva Sansthan

Narayana Seva Sansthan : రాజస్థాన్‌కు చెందిన నారాయణ సేవా సంస్థాన్ 1985 నుంచి సేవా కార్యక్రమాలు నిర్శహిస్తోంది. అందులో భాగంగా మహా కుంభ మేళాకు వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం అందిస్తోంది. ఈ మేళాలో లక్షలాది మందికి భోజనం అందించాలనే సంకల్పంతో ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు.

ఎలా చేరుకోవాలి ? | Narayan Seva Sansthan in Prayagraj Location

మీరు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ చేరుకున్నాక అక్కడి నుంచి సెక్టార్ 18 ప్రాంతానికి వెళ్లండి. అక్కడ అన్నపూర్ణమార్గ్‌లో నారాయణ సేవా సంస్థాన్ ఉంటుంది.

3.  లాల్ మహేంద్ర శివ శక్తి సేవా సమితి 

Lal Mahendra Shiv Shakti Seva Samithi : ప్రయాగ్రాజ్‌లో కుంభ మేళాకు వచ్చే భక్తుల కోసం నిత్య అన్నదానంతో పాటు టీ సదుపాయం కల్పిస్తోంది లాల్ మహేంద్ర శివ శక్తి సేవా సమితి. ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవుకు చెందిన ఈ సేవా సంస్థ నిర్వహించే అన్నదాన కేంద్రంలో నిత్యం భక్తులు క్యూలో నిలబడి తమ వంతు కోసం వేచి చూస్తుంటారు. 

Free Food At Prayagraj Kumbh Mela 2025 :ఈ కేంద్రానికి సమీపంలో కొంత మంది కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ్, బిస్కెట్, టోస్ట్, బ్రెడ్ కూడా అందిస్తుంటారు. ఈ  సంస్థ మొత్తం 7 ప్రాంతాల్లో అన్నదానం చేస్తోంది. మొదటి పాయింట్లో ప్రస్తావించిన అన్నదాన కేంద్రం కూడా ఇందులో ఒకటి.

సమయం : ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు.

ఎలా వెళ్లాలి ? 

ఈ అన్నదాన కేంద్రం వచ్చేసి నైనీ బ్రిడ్జి నుంచి పరేడ్ గ్రౌడ్ వెళ్లే దారిలో  ఉంటుంది. ఇక్కడ మీకు సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ అనే ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది. 

4. ఇస్కాన్ -అదానీ అన్నదానం

Iskcon-Adani Mahaprasad annadan at kumbh mela Prayagraj
| Photo : ISKCON

Iskcon -Adani Vishal Bhandara in Mahakumbh : మహాకుంభ మేళాకు వచ్చే భక్తుల కోసం ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్, వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ కలిసి మహా అన్నదాన కేంద్రాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ మహా ప్రసాద సేవా ( Mahaprasad Seva ) కేంద్రం ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 50 లక్షల మంది వరకు భక్తులకు అన్నదాన ప్రసాదం అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ అన్నదాన కేంద్రానికి వెళ్తే ఇస్కాన్‌‌కు సంబంధించిన ఆధ్మాత్మిక పుస్తకాలను ఉచితంగా ఇస్తారు.

ఎలా వెళ్లాలి ? Iskcon Adani Bandara Location in Prayagraj

ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 19 లో గంగోలి శివాలయ మార్గంలో ఇస్కాన్ అదాని అన్నదాన కేంద్రం ఉంటుంది.

సమయం : ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గం. వరకు

5. సంత్ ఆశ్రమ్ గోశాల నహర్ వాలి బధని కళా మోగా ( పంజాబ్ )

ప్రతి గురుద్వారలో ఉచిత అన్న ప్రసాదం అందిస్తారు అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాలో కూడా పంజాబ్‌కు చెందిన ఒక ఆధ్మాత్మిక సంస్థ ( Sant Ashram Goshaa Nahar Vali Badhani Kala Mogha ) లంగర్ ( అన్నదానం ) ఏర్పాటు చేసింది. ఇక్కడికి వెళ్లినప్పుడు తలను కర్చీప్ లేదా ఖండువాతో కవర్ చేసుకోవడం మర్చిపోకండి. గురుద్వారలో ఉన్నప్పుడు, తినేటప్పుడు తలను కవర్ చేసుకోవడం వీరి ఆచారం. 

ఎలా వెళ్లాలి ? : ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 22 లో ప్రేమ్ ప్రకాశ్ అన్నక్షేత్రానికి సమీపంలో ఉంటుంది

6. శ్రీ రామ్ రామయ్యా బాఫానీ నగర్ ఖాల్సా

Free Food In Maha Kumbh Mela 2025
| Photo : Narayan Seva Sansthan5

జమ్మూ అండ్ కశ్మీర్‌కు చెందిన ఈ అన్నదాన కేంద్రం ప్రయాగ్‌రాజ్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉంది.ఈ సంస్థ ( Sri Ram Ramayya Bafani Nagar Khalsa) నిర్వాహకులు దేశ వ్యాప్తంగా అనేక తీర్థక్షేత్రాల్లో అన్నదానం చేస్తుంటారు. అమర్నాథ్ యాత్ర ( Amarnath Yatra ) సమయంలో నెల పాటు అన్నదాన కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మీకు 24 గంటలు భోజనం లభిస్తుంది. ఇందులో అన్నం, పప్పు, కూర, పచ్చడి, ఛాయ్ సమోసా, కచోరి, పూరి, జిలేబీ లభిస్తాయి.

ఎలా వెళ్లాలి ?

ఈ అన్నదాన కేంద్రానికి వెళ్లేందుకు మీరు ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 19 లో ఉన్న సంగం లోవర్ మార్గ్‌కు చేరుకోవాలి.అక్కడే ఉంటుంది ఈ అన్న ప్రసాద కేంద్రం

7. పరమార్థ‌ నికేతన్ ఆశ్రం 

Parmarth Niketan Ashram In Prayagraj : రిషికేష వెళ్లిన వారికి పరమార్థ్ నికేతన్ ఆశ్రమం గురించి తెలిసే ఉంటుంది. యోగా, ఆధ్మాత్మిక సాధన, మెడిటేషన్ కోసం దేశ విదేశాల నుంచి చాలా మంది పరమార్థ నికేతన్ వస్తుంటారు. మహా కుంభ మేళాకు వచ్చే భక్తుల కోసం ఈ ఆశ్రమం నిర్వాహకులు అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కార్యకర్తలే అన్నం వండి, వడ్డిస్తారని రిషికేష్‌లో ఉన్న పరమార్థ్ నికేతన్ ఆశ్రమం ( Parmarth Niketan Ashram free food prayagraj ) అధ్యక్షులు స్వామి చిదానంద సరస్వతి తెలిపారు.

ఎలా వెళ్లాలి ?

ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ రోడ్డులో అరైల్ ఘాట్ వద్ద ఉంటుంది ఈ అన్నదాన కేంద్రం

8. నిరంజనీ అఖారా | Niranjani Akhara In Prayagraj

7 వ శతాబ్దంలో ప్రారంభించిన నిరంజనీ అఖారా నేటికీ హిందూ మత ఔన్యత్యాన్ని కాపాడుతూ, ధర్మాన్ని పరిరక్షిస్తోంది. ఈ అఖారాలో సామాన్యుల నుంచి ధనవంతులు, ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించిన వారు, పెద్ద పెద్ద సంస్థల యజమానులు, సీఈఓలు, ఐఐటీ గ్రాడ్యువేట్ల వరకు ఆధ్మాత్మిక సాధన కోసం చేరుతుంటారు.

ఈ అఖారా ప్రయాగ్‌రాజ్‌లో భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తోంది. ఇందులో రాంరస్, లంకా చట్నీ ( Lanka Chutney ) అనే రెండు వెరైటీ ఆహార పదార్థాలు ఈ అన్నదానం కేంద్రంలో హైలైట్ అని భక్తులు చెబుతున్నారు.  ఈ అఖరా వచ్చేసి త్రివేణి సంగమానికి చేరువలో ఉంటుంది. 

కుంభమేళాలో ఆకలితో బాధపడే అవసరమే లేదు

Free Food In Maha Kumbh Mela 2025 : దీంతో పాటు హరె కృష్ణా మూమెంట్ వంటి 200 ఆధ్యాత్మిక సంస్థలు, మరో 500 సేవా, ఇతర సంస్థలు కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 )  వచ్చ భక్తులకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నాయి. అంతే కాకుండా ఒక నెలా అంతకు మించి కుంభ మేళాలో ఉండి, అక్కడే వంట చేసుకునే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం 160 ఫేయిర్ ప్రైస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Prayanikudu WhatsApp2
| ప్రయాణికుడు వాట్సాప్ గ్రూపులో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Share This Story

Leave a Comment

error: Content is protected !!