హరిద్వార్‌లోని అతి పవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

షేర్ చేయండి

నమస్కారం, ప్రయాణికుడు ట్రావెల్ బ్లాగ్‌కు స్వాగతం. ఈ రోజు హరిద్వార్‌లోని అతి పవిత్రమైన మా చండీదేవి ఆలయం (Maa Chandi Devi Temple) గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. శివాలిక్ పర్వత శ్రేణుల్లో నీల్ పర్వత్‌పై కొలువై ఉన్న ఈ ఆలయం ఆధ్మాత్మికంగానే కాదు…చారీత్రత్మకంగా, పౌరాణికంగా కూడా అతి విశిష్టమైనది.

ఈ బ్లాగ్‌లో ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ? అమ్మవారికి దర్శనానికి ముందు ఉండే ప్రొసీజర్ ఏంటి ? అమ్మవారి కథ ఏంటి వంటి అనేక విషయాలను తెలుసుకుందాం.

చండి దేవీ ఆలయం ఎక్కడుంది ? | How To Reach

మా చండి దేవి ఆలయం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది. 

Haridwar
హరిద్వార్‌లో ప్రయాణికుడు
  • హారతి : ఉదయం 5.30 నిమిషాలకు హారతి ప్రారంభం అవుతుంది. 
  • ఉత్తమ సమయం : ఫిబ్రవరి నుంచి మార్చి వరకు, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు వాతావరణం బాగుంటుంది. ఎండాకాలం వెళ్లకపోవడం ఉత్తమం. 
  • ఎలా చేరుకోవాలి ? :  చండి దేవి ఆలయానికి వెళ్లాలి అంటే ముందుగా మీరు హరిద్వార్ చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయం సుమారు 4 కిమీ దూరంలోఉంటుంది.
  • విమానం ద్వారా చేరుకోవాలి అనుకుటే ఈ ఆలయానికి 37 కిమీ దూరంలో డెహ్రడూన్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టు (Jolly Grant Airport) ఉంటుంది. 
  • ఇది కూడా చదవండి : Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ 

చండి దేవి ఆలయానికి చాలా మంది దేవీ ఉపాసకులు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులు కూడా వెళ్తుంటారు. మీరు అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చినా లేదా నేచర్‌ను ఎంజాయ్ చేయాలి అనుకున్నా ఈ బ్లాగ్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.

  • ఈ ఆలయానికి వెళ్లినప్పుడు స్థానిక ఆచారాలు, భాషను, వారి విధానాలను గౌరవించండి.
  • లెదర్‌తో తయారు చేసిన వస్తువులను, మాంసాహార పదార్థాలు, ఆల్కహాల్‌ అనేవి ఇక్కడ నిషేదం.

మోక్షానికి మార్గం అయిన హరిద్వార్‌లో (Haridwar) ఎన్నో అద్భుతమైన ఆధ్మాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. అందులో చండి దేవీ ఆలయానికి మనం వెళ్తున్నాం. దీని కోసం నేను హరిద్వార్‌లోని తేజ్‌రామ్ ధరమ్ పాల్ అనే చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఒక హోటల్ నుంచి బయటికి వచ్చాను.

Hotel In Haridwar
హోటల్ రూమ్‌

ఈ ట్రస్టు నిర్వహిస్తున్న హోటల్ చాలా సౌకర్యవంతంగా ఉంది. ఫుల్లీ ఫర్నిష్డ్ ఏసీ రూమ్ నాకు షేరింగ్‌లో పర్ డే రూ.1000 మాత్రమే పడిండి. 

ట్రస్టు నిర్వహించే క్యాంటీన్‌లోనే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని చండీ దేవి ఆలయం కోసం ఆటోలో బయల్దేరాం. సుమారు 15 నిమిషాల్లో చండి దేవీ ఆలయం వద్దకు చేరుకున్నాం.

చండి దేవి దర్శనానికి వెళ్లే విధానం | Maa Chandi Devi Temple

Haridwar To Chandi Devi Temple Vehicle
షేరింగ్, ప్రైవేట్ ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి.

హరిద్వార్‌లో మీరు ఎక్కడ ఉన్నా చండి దేవి ఆలయానికి చేరుకునేందుకు మీరు ఆటోలు, క్యాబ్స్, రిక్షాలు అందుబాటులో ఉంటాయి. హరికి పౌరీ (Har Ki Pauri) నుంచి అయితే మీకు రూ.40-50 మాత్రమే చార్జ్ చేస్తారు. ఇక్కడి నుంచి మీరు అమ్మవారి దర్శనానికి నడచుకుంటూ కూడా వెళ్లవచ్చు. దీనికి 60 నుంచి 90 నిమిషాల సమయం పడుతుంది. 

కేబుల్ కార్ | Chandi Devi Temple Cable Car

చంటిపిల్లలు, పెద్దవాళ్లు ఉన్నా, లేదా మీకు కేబుల్ కార్‌లో ప్రయాణించాలి అని ఉన్నా మీరు ఇక్కడ టికెట్లు తీసుకోవచ్చు.

Maa Chandi Devi Temple Haridwar Cable Car Prices
కేబుర్ కారు చార్జీలు

మీరు కేవలం చండి దేవి ఆలయానికి రాను పోను టికెట్ తీసుకోవాలి అనుకుంటే రూ. 220 టికెట్ తీసుకోవాలి. చండిదేవీ ఆలయంతో పాటు మానసా దేవీ ఆలయం ( Mansa Devi Temple Haridwar) కాంబో టికెట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం దానికి మీరు రూ.419 చెల్లించాలి. 

నేను మానసా దేవి ఆలయానికి ఇంతకు ముందే వెళ్లాను కాబట్టి చండి దేవి ఆలయానికి మాత్రమే టికెట్ తీసుకున్నాను.

Maa Chandi Devi Temple Haridwar Prasad Counter
ప్రసాదం అమ్ముతున్న సెక్యూరిటీ గార్డు.

ఇక్కడ టికెట్ తీసుకున్న తరువాత మీరు కనీసం గంట వరకు టికెట్‌పై ఉన్న టోకెన్ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెయిటింగ్ హాల్‌ దగ్గరే మీరు అమ్మవారి ప్రసాదం (chandi devi prasad) కూడా తీసుకెళ్లవచ్చు. 

ఈ వెయింటింగ్ హాల్ దగ్గర షాపింగ్ చేయడానికి, ఆకలేస్తే ఏమైనా తినడానికి స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. 

సుమారు 45 నిమిషాల తరువాత మా టోకెన్ నెంబర్ డిస్‌ప్లే అవడంతో కేబుల్ కారు ఎక్కేందుకు ముందుకు బయల్దేరాం. సుమారు 100-200 మీటర్లు ఇలా గ్రిల్స్ మధ్య నడిచిన తరువాత మీ టికెట్‌ను మళ్లీ చెక్ చేస్తారు. తరువాత మెట్ల దారిలో మీరు కేబుక్ కార్ ఉన్న చోటికి వెళ్తారు.

ఈ కేబుల్ కార్లను హిందీలో ఉడన్ కఠోలా (Udan Katola) అంటారు. తెలుగులో చెప్పాలి అంటే ఎగిరే పల్లెం (UFO) అని అర్థం వస్తుంది. ఈ కేబుల్ కార్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 6 వరకు అందుబాటులో ఉంటుంది. 

Maa Chandi Devi Temple Haridwar
కేబుల్ కారు నుంచి పచ్చగా కనిపిస్తున్న హరిద్వార్ నగరం, గంగా నది సోయగం

చుట్టు పచ్చదనంతో నిండిపోయిన నీల్ పర్వతం (Neel Parbat) పైకి వెళ్తోంటే ఇక్కడి ప్రకృతి రమణీయత చూసి మనసు పులకరించి పోతుంది.

ఛార్‌ధామ్‌ యాత్రలో (Char Dham Yatra) ఒకటైన కేథార్‌నాథ్‌కు కూడా కేబుల్ కార్ ఏర్పాటు చేస్తున్నారట. త్వరలో ఈ ప్రాజెక్టు కూడా ప్రారంభం అవ్వనుంది. ఇది నిజంగా గుడ్‌న్యూస్ కదా ?

కేబుల్ కార్ దిగిన వెంటనే మీకు 100 మీటర్ల దూరంలోనే ఆలయం ఉంటుంది. 

పరిశుభ్రతను పాటించండి | Tips For Travelers

Maa Chandi Devi Temple పరిసరాల్లో కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాటికి అరటిపండ్లు, కొబ్బరికాయలు పెట్టరాదు అని అధికారులు సూచించారు. కేబుల్‌కార్‌లో వచ్చినా కొండ ఎక్కి వచ్చినా ఎలా వచ్చినా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ ఇంటికి ఎంత పవిత్రంగా చూసుకుంటారో…మీరు వెళ్లే ప్రతీ ప్రదేశాన్ని కూడా అంతే పవిత్రంగా చూసుకోండి. 

చెత్తను ఎక్కడంటే అక్కడే పడేయకండి. యాజె ట్రావెల్ వ్లాగర్‌గా చాలా మందిని ఒక ప్రాంతానికి వెళ్లేందుకు మోటివేట్ చేసే నాలాంటి ట్రావెల్ వ్లాగర్స్‌పై (Travel Vloggers) ఎన్నో బాధ్యతలు ఉంటాయి. చదివే వారిని లేదా నా ట్రావెల్ చానెల్‌లో ఒక డెస్టినేషన్‌కు గురించి గైడ్ చేయడంతో పాటు పరిశుభ్రత గురించి కూడా అవగాహన పెంచే అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. ప్రతీ ట్రావెల్ వ్లాగర్ ఇది పాటించాలని కోరుకుంటున్నాను. 

Maa Chandi Devi Temple Haridwar (6)
బలవంతంగా మిమ్మల్ని వాళ్ల షాపులో ప్రసాదం కొనమాంటారు

ఆలయంలోపలికి వెళ్లే ముందు మీకు చాలా స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టేందుకు ప్రసాదం కూడా తీసుకోవచ్చు. చాలా మంది షాపువాళ్లు మిమ్మల్ని వాళ్ల షాపులో ప్రసాదం కొని చెప్పలు ఫ్రీగా కొనమని అడుగుతారు. ఇలా దారి మధ్యలో వచ్చి అడగడం అనేది నేను ఎక్కడా చూడలేదు. నా ముందే ఒక వ్యక్తిని నడుంపై చేయి వేసి తీసుకెళ్లాడు ఒక వ్యక్తి.

Maa Chandi Devi Temple Haridwar (7)
ఇలా దారి మధ్యలో వచ్చి అడగడం అనేది నేను ఎక్కడా చూడలేదు. నా ముందే ఒక వ్యక్తిని నడుంపై చేయి వేసి తీసుకెళ్లాడు ఒక వ్యక్తి. నేను వాళ్లను ఇగ్నోర్ చేసి వెళ్లాను.

నేను కేబుల్ కార్ టికెట్ టికెట్ తీసుకునే చోటే ప్రసాదం తీసుకున్నాను. సో ఆలయానికి ముందున్న ఒక చెప్పుల స్టాండ్‌లో నా చెప్పులు పెట్టాను. నేను వెళ్లే సమయానికి ఆలయంలో భక్తుల సందడి అంతగా కనిపించలేదు. సో చాలా వేగంగా క్యూలైన్స్‌ క్లియర్ చేశాను.

Maa Chandi Devi Temple
ఆలయంలో ప్రతీ చోట భక్తులు కట్టిన చున్నీలు కనిపిస్తాయి

అమ్మవారికి మొక్కలు కోరే భక్తులు ఇక్కడ ఇలా చున్నీలు కడతారు అనుకుంటా. అమ్మవారి ఆలయం గర్భగుడిలో ఫోటోలు తీసేందుకు అనుమతి లేదు. సో ఆలయ పరిసరాలను మాత్రమే మీ కోసం వీడియో తీశాను.

చండి దేవి కథ | Story Of Maa Chandi Devi

హిందూ పౌరాణికంలో (Hindu Mythology) ఈ ఆలయానికి అత్యంత విశిష్టత ఉంది. శుంభ, నిశుంభ అనే రాక్షస రాజులను అంతం చేసిన తరువాత  అమ్మవారు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారంటారు. 

ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని 8వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్యులు (Adi Shankaracharya) ప్రతిష్టించారంటారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని కాశ్మీరుకు చెందిన సుచత్ సింగ్ అనే రాజు 1929 లో నిర్మించారట.

Maa Chandi Devi Temple Haridwar (4)
అన్నపూర్ణాదేవి ఆలయం

చండి దేవీ అమ్మవారి ఆలయం బయటికి రాగానే మీకు అనేక ఆలయాలు కనిపిస్తాయి. మా అన్నపూర్ణా దేవి ఆలయం (annapurna devi)…భద్రకాళీ అమ్మవారి ఆలయం…కాళ భైరవుడి ఆలయం (kala bhairava temple)…సంకట్ మోచన్ హనుమాన్ ఆలయం కూాడా ఉంటాయి. 

షాపింగ్ అనుభవం | Shopping Experience

చండి దేవీ ఆలయం ప్రాంగణంలో మీకు షాపింగ్ కోసం కొన్ని వందల స్టాల్స్ కనిపిస్తాయి. ప్రతీ స్టాల్‌లో  మీకు ప్రసాదం, విగ్రహాలు, పూజా సామాన్లు, కుంకుమ వంటివి లభిస్తాయి.

Maa Chandi Devi Temple Haridwar (3)
శీలాజిత్ ప్యాకెట్

ఇక్కడ మాకు కొండ ప్రాంతాల్లో లభించే ఇంగువ, శీలాజిత్ (Shilajit) దొరికింది. ఇది ప్యూర్ షీలా జిత్ అన్నారు. కానీ నాకు మాత్రం అది ప్యూర్ అనిపించడం లేదు. ఎందుకంటే ప్యూర్ శిలాజిత్ ఇలా ప్యాకెట్లలో పెట్టి అమ్మేంత చవకగా లభించదు. దీనిపై మీ ఒపీనియన్ చెప్పండి. 

సిద్ధం పీఠం | Siddha Pitam

చండి దేవీ ఆలయం అనేది హరిద్వార్‌లో (Haridwar) ఉన్న సిద్ధం పీఠాల్లో ఒకటి. ఇక్కడికి వచ్చే భక్తులు తమ మనసులో ఉన్న కోరికను అమ్మారికి నివేదించి అది నెరవేరిన తరువాత మొక్కులు చెల్లించేందుకు మళ్లీ వస్తుంటారు. 

Maa Chandi Devi Temple Haridwar (1)
అంజన్న అమ్మగారు అంజనాదేవీ ఆలయానికి వెళ్లే దారి

ఈ ఆలయానికి సమీపంలోనే అంజన్న అమ్మగారు అంజనా దేవి ఆలయంతో (Anjana Devi Temple) పాటు నీలేశ్వర్ ఆలయం (Neeleshwar Temple) కూాడా ఉంటుంది. వీలైతే వెళ్లిరండి. నవరాత్రి, చండీ చౌడాస్, కుంభ మేళా సమయంలో భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఆ సమయంలో ఈ ఆలయ వైభవం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు అంటారు.

పక్కా కమర్షియల్ స్టంట్

Maa Chandi Devi Temple Haridwar (2)
పక్కా కమర్షియల్ స్టంట్

కేబుల్‌కారుకు వెళ్లే దారిలో ఒక చోట అందూ ఫోటోలు దిగుతూ కనిపించారు. నాకు కొంచెం వింతగా అనిపించింది. ఇలా ఏ ఆలయంలో చూడలేదు. సెక్యూరిటీ కోసం ఇంత మంది భక్తుల ఫోటోలు తీసుకుంటున్నారా ఏంటి ? అనుకున్నాను. కాని అసలు విషయం వేరే ఉంది.

ఇది పక్కా కమర్షియల్ ఫోటోగ్రఫీ స్టంట్. భక్తుల భయాన్ని ఇలా వాడుకుంటున్నారు. వచ్చేయండి వచ్చేయండి అని పిలిచి ఫోటోలు తీస్తున్నారు. ఎందుకు తీశారు అని అడిగితే మీరు కిందికి వెళ్లాక మా వాళ్లు ఫోటోలు చూపిస్తారు. 

ఎడిట్ చేసిన ఫోటోలు మీకు నచ్చితే క్యాష్ ఇచ్చి ప్రింట్ తీసుకోవచ్చు అన్నారు. నాకు అంత టైమ్‌లేదు. కానీ నాతో పాటు వచ్చిన మోహన్‌‌గారు మాత్రం దిగడానికి, కింద వెళ్లి చూడటానికి డబ్బులు తీసుకోరు కదా అని ట్రై చేశారు.

Maa Chandi Devi Temple Haridwar (13)
కేబుల్ కారు …

కేబుల్ కార దిగి ఎగ్జిట్ వైపు వెళ్తోంటే కొన్ని ఫుడ్ స్టాల్స్ కనిపించాయి. అక్కడే లంచ్ చేస్తూ ఆలోచిస్తూ దక్ష ప్రజాపతి ఆలయానికి (daksha prajapati temple) బయల్దేరాను. ఇంకా

ఈ బ్లాగ్ నచ్చితే నలుగురితో షేర్ చేయండి. అలాగే నేను చేసిన ఈ ట్రావెల్ వ్లాగ్‌ను కూడా చూడండి. అమ్మవారి ఆలయం ఎలా ఉంటుందో దర్శనం చేసుకోండి.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!