అమెరికా, యూఏఈ, చైనా, థాయ్‌లాండ్, వివిధ దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుగుతాయి అంటే.. | New Year 2025 Celebrations
కొత్త సంవత్సరం అంటే ఎన్నో ఆశలు ఉంటాయి. పాత సంవత్సరంలో జరగని విషయాలు, పనులు ఈ సంవత్సరం జరుగుతాయి అని చాలా మంది ఆశపడతారు. ఇలాంటి ఆశలతోనే ప్రపంచంలోని ప్రతీ దేశం కొత్త సంవత్సరాన్ని వేడుకగా , వారి ఆచారాలు, విధానాల ప్రకారం సెలబ్రేట్ చేస్తుంది. ఏ దేశం ఎలా సెలబ్రేట్ ( New Year 2025 Celebrations ) చేస్తుందో ఈ స్టోరీలో చదవండి.

అమెరికా | New Year Celebrations In USA
అమెరికాలో న్యూ ఇయర్ కోలాహలం మొత్తం న్యూయార్కులోనే ( New Year In New York ) ఉంటుంది. ముఖ్యంగా అక్కడి టైమ్ స్క్వేర్ వద్ద ప్రజలు భారీ ఎత్తున గుమిగూడుతారు. అర్థరాత్రి ఒక పెద్ద స్పార్కిలింగ్ బాల్ ( మెరిసే బంతి ) జారవిడుస్తారు. పార్టీలు, ఫైర్ వర్క్స్, కాన్సెర్టులు దేశం మొత్తం జరుగుతాయి. ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సెలబ్రేట్ చేస్తారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వివిధ అసోసియేషన్స్ ప్రత్యేక కాక్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాయి.
చైనా | New Year Celebrations In China
చైనీస్ న్యూఇయర్‌ను లూనార్ న్యూ ఇయర్ ( Lunar New Year ) అని కూడా అంటారు. ఇది జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో వస్తుంది. ఇక్కడ కొత్త సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలుస్తారు. టేస్టీ ఫుడ్ తయారు చేస్తారు. భాణసంచా కాలుస్తారు. దీంతో పాటే చైనాలోని వివిధ ప్రాంతాల్లో డ్రాగన్ డ్యాన్సులు, రెడ్ ఎన్వెలప్‌లు ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం చేస్తుంటారు. దీని వల్ల వారికి శుభం కలుగుతుంది అని నమ్ముతారు.ప్రతీ సంవత్సరం ఒక 12 రాశుల్లోని ఏదోక ఒక జంతువుకు అంకితం చేస్తారు.
బ్రెజిల్ | New Year Celebrations In Brazil
బ్రెజిల్‌లో ముఖ్యంగా రియో డి జెనీరోలో ( rio de janeiro) కొత్త సంవత్సరం భారీ బీచ్ పార్టీలతో సెలబ్రేట్ చేస్తారు. దీంతో పాటు బాణసంచా కాల్చడం, లైవ్ మ్యూజిక్ వంటివి సాధారణం. కొత్త సంవత్సరం తొలి రోజు, సంవత్సరం చివరి రోజు తెల్లని దుస్తువులు ధరిస్తారు. దీనిని వారు శుభంగా భావిస్తారు. దీంతో పాటు వారి సముద్ర దేవత అయిన యెమంజా ( Yemanja ) కోసం ఏడుసార్లు అలలపైకి దూకుతారు.
యూఏఈ | New Year Celebrations United Arab Emirates

యూఏఈలో ( UAE ) మరీ ముఖ్యంగా దుబాయ్‌లో కొత్త సంవత్సరం వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. భారీ ఫైర్ వర్క్స్, సంగీత కచేరీలు అనేవి బూర్జ్ ఖలీఫా ( Burj Khalfa ) దగ్గర జరగుతాయి. ఇక్కడి విలాసవంతమైన హోటల్స్, రిసార్టులలో అత్యంత ఖరీదైన పార్టీలు జరుగుతాయి.
థాయ్‌లాండ్ | New Year Celebrations In Thailand
థాయ్‌లాండ్‌లో న్యూ ఇయర్ రెండు సార్లు సెలబ్రేట్ చేస్తారు. వారి సంప్రదాయ కొత్త సంవత్సరం వచ్చేసి ఏప్రిల్‌లో ఉంటుంది. ఇది కూడా మన ఉగాదిలాగే అన్నమాట. దీని పేరు సోంగ్‌క్రాన్ ( Songkran ). దీంతో పాటు మిగితా ప్రపంచంతో కలిసి డిసెంబర్ 31 న వేడుకగా కొత్త సంవత్సరాన్ని ( New Year 2025 Celebrations ) స్వాగతిస్తారు. సోంగ్‌క్రాన్ పండగ రోజు భారీ వాటర్ ఫైట్స్, పరేడ్స్ జరుగుతాయి. స్థానిక ఆలయాలకు ప్రజలు తరలి వెళ్తారు. అదే డిసెంబర్ 31వ తేదీన భారీ ఫైర్ వర్క్స్, పార్టీలు జరుగుతాయి. మరీ ముఖ్యంగా బ్యాంకాక్‌లో వేడుకలు అదిరిపోతాయి.
యూరోప్ | New Year Celebrations In Europe
ఐరోపాలోని వివిధ దేశాల్లో కొత్త సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారో చదవండి
జర్మనీ | New Year Celebrations In Germany:
జర్మనీలో కొత్త సంవత్సరం సందర్భంగా జరిగే ఫైర్ వర్క్స్ హైలైట్‌గా నిలుస్తాయి. దీంతో పాటు స్థానికులు అంతా కలిసి పార్టీలు చేసుకుంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒక కామెడీ కార్యక్రమం ఉంటుంది. దీనిని డిన్నర్ ఫర్ వన్ ( Dinner For One ) అని పిలుస్తారు.
ఐర్లాండ్ | New Year Celebrations In Ireland
ఇక్కడ బాణసంచా కాల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. దీంతో పాటు సంగీత కచేరీలు నిర్వహించి డ్యాన్స్ కూడా చేస్తారు. డబ్లిన్ వంటి ప్రాంతాల్లో భారీ ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తారు.
స్కాట్లాండ్ | New Year Celebrations In Scotland
ప్రపంచంలో అత్యంత అందమైన దేశాల్లో స్కాట్లాండ్ ఒకటి. ఇక్కడ కొత్త సంవత్సరాన్ని హోగ్‌మనే ( Hogmanay ) అని పిలుస్తారు. ఈ సందర్భంగా స్ట్రీట్ పార్టీలు, ఫైర్ వర్క్స్ షో ఉంటుంది. దీంతో పాటు ఫస్ట్ ఫుటింగ్ ( First Footing ) అనే ఒక ఆచారం పాటిస్తారు. ఈ ఆచారం ప్రకారం ఇంట్లో కొత్త సంవత్సరం సందర్భంగాయ ఇంట్లోకి తొలి అడుగు వేసే వ్యక్తి తనతో పాటు అదృష్టాన్ని తీసుకు వస్తారని నమ్ముతారు.
ఆస్ట్రేలియా | New Year Celebrations In Scotland

ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ వద్ద భారీ ఎత్తున ఫైర్ వర్క్స్ షో జరుగుతుంది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థానికులు, టూరిస్టులు కలిసి పార్టీలు చేసుకుంటారు.
రష్యా | New Year Celebrations In Russia
రష్యాలో కొత్త సంవత్సరం సందర్భంగా సెలవు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరాన్ని వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు. రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. అర్థరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు కలిసి ఒకరికి ఒకరు కానుకలు అందించుకుంటారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయి.
జపాన్ | New Year Celebrations in Japan

కొత్త సంవత్సరాన్ని జపాన్‌లో షోగాసు (Shōgatsu) అని కూడా పిలస్తారు. దీనిని జనవరి 1 నుంచి 3వ తేదీల మధ్య సెలబ్రేట్ చేస్తారు. ఇది పాత కొత్త సంప్రదాయాల కలయికతో జరుగుతుంది. చాలా మంది ఆలయాలకు వెళ్తారు. ఈ సందర్భంగా జపాన్ సంప్రదాయ వంటకాలైన సోబా నూడిల్స్ ( Soba Noodles ), మోచీ అనే రైస్ కేక్స్‌ను వండి ఆరగిస్తారు. ఒకరికి ఒకరు శుభకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్ కార్డులు అందించుకుంటారు.
Niagara Falls, మాన్యుమెంట్ వ్యాలీ.. అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్
దక్షిణ కొరియా | New Year Celebrations In South Korea
దక్షిణ కొరియాలో కొత్త సంవత్సరాన్ని సంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేస్తారు. బంధుమిత్రులు ఇంటికి వెళ్లడం, తమ పూర్వికులను గుర్తు చేసుకోవడం, కొత్త సంవత్సరం తొలి సూర్యోదయాన్ని చూడంటం వంటివి చేస్తుంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా రైస్ కేక్స్‌తో చేసిన టియోగుక్ ( tteokguk) అనే రెసెపీని ఆరగిస్తారు. కొత్త సంవత్సరం వల్ల తమ వయసు మరో సంవత్సరం పెరిగింది అనడానికి ఈ రెసెపీని ప్రతీకగా భావిస్తారు.
సింగాపూర్ | New Year Celebrations In Singapore
కొత్త సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేయాలో సింగాపూర్‌ను చూసి నేర్చుకోవచ్చు. అదిరిపోయే కొత్త సంవత్సరం పార్టీలు జరుగుతాయి. ఇక్కడ మెరీనా బీచులో జరిగే కౌండ్‌డౌన్ ఈవెంట్‌కు చాలా మంది వివిధ దేశాల నుంచి తరలి వస్తారు. ఇక్కడ అద్భుతమైన ఫైర్ వర్క్స్ ప్రదర్శన జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్, వీధి ప్రదర్శనలు, లైవ్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి కొత్త సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించేలా చేస్తాయి.
మలేషియా | New Year Celebrations In Malaysia
మలేసియాలో కొత్త సంవత్సరం ( New Year 2025 Celebrations )సందర్భంగా రాజధాని కౌలాలంపూర్‌లో ( Kuala Lumpur) అనేక ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. మరీ ముఖ్యంగా పెట్రోనాట్స్ టవర్స్ వద్ద సెలబ్రేషన్స్ అదిరిపోతాయి. ఇక్కడ భారతీయ, చైనీస్, మలే ( Malay ) సంప్రదాయ కార్యక్రమాలు జరుగుతాయి.
ఫిలిప్పిన్స్ | New Year Celebrations In Philippines
ఇక్కడ భారీ మోతలతో చెవులకు పట్టిన తుప్పు వదిలించే శబ్దాలు, బాణసంచా కాల్చి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. శుభసూచకంగా భావంచే భోజనాన్ని ఆరిగిస్తారు. దీంతో పాటు 12 నెలలకు ప్రతీకగా భావించి 12 పండ్లను ఆరగిస్తారు.
ఇటలి | New Year Celebrations In Italy

ఇటలీ ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా అక్కడి కొత్త సంవత్సరం వేడుకలు ఉంటాయి . ఫైర్‌వర్క్స నుంచి పార్టీలు, వేడుకలు, అన్ని అదిరిపోతాయి. ఇక్కడ ద్రాక్ష పండ్లను తమ ఆచారంలో, వేడుకల్లో భాగం చేస్తారు. దీని వల్ల వారికి శుభం కలుగుతంది అని భావిస్తారు. విచిత్రంగా కొత్త సంవత్సరం రోజు ఎర్ర రంగు అండర్ వేర్ వేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అని భావిస్తారు ఇక్కడి వాళ్లు.
స్పెయిన్ | New Year Celebrations In Spain
కొత్త సంవత్సరం సందర్భంగా ( New Year 2025 Celebrations ) అర్థరాత్రి సమయంలో ఇక్కడ 12 ద్రాక్షా పండ్లను తింటారు స్పెయిన్ వాసులు. ఇలా చేయడం వల్ల 12 నెలల్లో ప్రతీ నెల వారికి శుభం కలుగుతుంది అని ఆశిస్తారు.
కొత్త సంవత్సరం ఎవరు చేసుకున్నా, ఎలా చేసుకున్నా వారి మనసులో కోరిక ఒకటే అదే పాత సంవత్సరం వెళ్లిపోయింది. కనీసం కొత్త సంవత్సరం అయినా నాకు, నావాళ్లకు బాగుండాలి అని. ఇంతకి మీరు కొత్త సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ? ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి.
గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
Watch More Vlogs On : Prayanikudu
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Most Popular Stories
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
- హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
- Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
- Sabarimala Facts : 1902 లో కర్పూరం వల్ల అగ్నికి ఆహూతి అయిన శబరిమల ఆలయం… శమరిమలై ఆలయం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
- వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
ప్రపంచ యాత్ర గైడ్
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది