Harry Potter In Prayagraj : కుంభ మేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వీడియోలో ఒక విదేశీ సందర్శకుడు అన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదం ఆరగిస్తూ కనిపిస్తాడు.
ఇందులో విశేషం ఏముంది 2025 జరుగుతున్న కుంభ మేళాకు చాలా మంది విదేశీయులు వస్తుంటారు అంటారా ..వీడియోలో ఉన్న వ్యక్తి అచ్చం హ్యారీ పోటర్ ( Harry Potter ) మూవీ నటుడు డానియల్ ర్యాడ్‌క్లిప్‌లా కనిపిస్తున్నాడు. దీనిని ” కుంభ మేళాలో ప్రసాదం ఎంజాయ్ చేస్తున్న ఆంగ్లేయుడు ” అనే టైటిల్‌తో షేర్ చేయగా నెటిజెన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
ముఖ్యాంశాలు
- ఇది కూడా చదవండి : కుంభ మేళాలో ఖాళీ కడుపుతో తిరగకండి – ఉచిత భోజనం దొరికే 8 ప్రదేశాలు
ఎవరీ హ్యారీ పోటర్ | Harry Potter Kumbh Mela
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో అంత వ్యూస్ రాకున్నా బాగా పాపులర్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి అన్నదాన కేంద్రంలో ప్రసాదాన్ని ఎంజాయ్ చేస్తూ, రుచిని ఆస్వాదిస్తూ కనిపిస్తాడు. అతను అచ్చం హ్యారీ పోటర్ మూవీలో నటుడిలా ఉండటంతో చాలా మంది అతను నిజంగానే ప్రయాగ్‌రాజ్ ( Prayagraj ) వచ్చాడా ఏంటి అని కామెంట్ చేశారు.
హ్యారీ పోటర్ పుస్తకాలు అంతర్జాతీయంగా ఎంత పెద్ద సంచలనం సాధించాయో…ఆ పుస్తకం సినిమా రూపంలో విడుదలై అంతే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఫ్రాంచైజీలో డానియల్ రాడ్‌క్లిఫ్ ( Daniel Radcliffe ) కథానాయకుడి పాత్రను పోషంచాడు.
నెటిజెన్ల ప్రశంసలు
ఈ వీడియోను చూసిన నెటిజెన్లు కేవలం లైక్ కొట్టి వెళ్లడం లేదు. పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇందులో ఒక యూజర్ వచ్చేసి ” హ్యారీ పాటర్ ప్రసాదాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ( Harry Potter In Prayagraj ) ” అని కామెంట్ చేయగా మరో యూజర్…ఈ మిత్రుడు అచ్చం హ్యారీ పోటర్‌లా ఉన్నాడు అని కామెంట్ చేశాడు.
వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పోలికల విషయం మాత్రమే కాదు అతను భోజనాన్ని తినే తీరును కూడా నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.అందులో కొంత మంది కామెంట్స్..
- అతను అన్నాన్ని అస్సలు వేస్ట్ చేయలేదు అని ఒక వ్యక్తి ప్రశంసించాడు
- భారత్‌కు వస్తే అన్నాన్ని వేస్ట్ చేయవద్దు అని విదేశీయులకు కూడా తెలిసిపోయింది. వాళ్లు మన సంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు మనం కూడా వారిని గౌరవించాలి అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
- Maha Kumbh 2025 : కుంభ మేళాలో మీ వాళ్లు ఎవరైనా తప్పిపోతే ఏం చేయాలి ?

కుంభమేళాలో విదేశీయుల సందడి | Foreigners in Maha kumbh 2025
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, సింగాపూర్, రష్యా, కెనడా, యూకే, శ్రీలంకా, యూఏఈ, అమెరికా వంటి అనేక దేశాల నుంచి టూరిస్టులు వచ్చారు అని కుంభ మేళా పోలీసులు తెలిపారు. ఇటీవలే యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి కూడా వచ్చి కుంభమేళాలో పూజలు చేశారు. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, ట్రావెల్ వ్లాగర్స్ ( Travel Vloggers ), ఫుడ్ వ్లాగర్స్ కూడా ప్రయాగ్‌రాజ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు.
2025 జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభ మేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. తీవ్రమైన చలి ఉన్నా, పొగ మంచు ఉన్నా భక్తుల సంఖ్యలో మార్పు లేకుండా సంఖ్య పెరుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వచ్చేసి 11 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతోంది. అయినా కానీ భారీ సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వచ్చి పవిత్ర నదీ స్నానం ఆచరిస్తున్నారు.
ఇలా ఇప్పటి వరకు కోట్లాది మంది భక్తులు నదీస్నానం ఆచరించారు. చాలా మంది ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం చేరుకుని నదీ స్నానం చేయడానికి ప్రాధన్యత ఇస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!