Metro EV ZIP Vehicles : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఇక సొంత వాహనాలతో పనిలేదు

షేర్ చేయండి

Metro EV ZIP Vehicles : ఎవరైనా ఢిల్లీ మెట్రో ( Delhi Metro ) ఎక్కి ఉంటే ఒక విషయాన్ని మీరు గమనించి ఉండవచ్చు. స్టేషన్ నుంచి బయటికి రాగానే బయట ఎన్నో ఈ రిక్షాలు అందుబాటులో ఉంటాయి.

ఈ ఈ-రిక్షాలు ( Electric Rickshaws in Delhi )ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేరవేరుస్తుంటాయి. షేరింగ్ లేదా ఇండివిజువల్ బేసిస్‌లో ప్రయాణికులను చార్జీలు వసూలు చేస్తుంటారు.

ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత లైట్ వెయిట్ అంటే వీటిని సులభంగా ఎవరైనా నడపవచ్చు. అందుకే చాలా మంది మహిళలు ఎలక్ట్రిక్ ఆటోలను నడుపుతుంటారు. వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. అయితే ఇలాంటి సేవలే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ప్రారంభించింది.
హైదరాబాద్ మెట్రో రైలులో ( Hyderabad Metro Rail ) ప్రయాణించే ప్రయాణికుల్లో చాలా మంది తమ సొంత వాహనాల్లో ఇంటి నుంచి బయల్దేరి మెట్రో స్టేషన్ వద్ద తమ బండిని పార్క్ చేసి బయల్దేరుతుంటారు.
ఇక నుంచి అలా చేసే అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, క్యాబ్‌లు మీకు అందుబాటులో ఉంటాయి.
ఫస్ట్,లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఈ వాహనాలను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ( NVS Reddy ) జెండా ఊపి ప్రారంభించారు.
ఇటీవలే లాంచ్ చేసిన ఈవీ జిప్‌తో ( EV Zip Hyderabad ) పాటు ప్రస్తుతం 9 సంస్థలు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి అని తెలిపారు. ఈ వాహనాల వల్ల మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి లేదా ఆఫిస్ , కాలేజ్, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సొంత వాహనాలను వాడే అవసరం ఉండదని మెట్రో అధికారులు తెలిపారు.
ఇక మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకం ఈవీ జిప్ ఇషా ( EV Zip Eesha ) పేరుతో ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వెహికల్స్ పేరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్ నుంచి మల్కాజ్‌గిరి, సైనిక్ పురి, ఈసీఎల్ వంటి ప్రాంతాల మధ్య సేవలు అందిస్తుున్నాయి. త్వరలో వీటిని ఇతర ప్రాంతాలకు , మరిన్ని స్టేషన్లకు విస్తరిస్తామని తెలిపారు.
ఎలక్ట్రిక వెహికల్స్ నడిపేందుకు మహిళలకు సయోధ్య ఫౌండేన్‌ ఆధ్వర్యంలో డ్రైవింగ్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారు. వారికి రద్దీ ప్రాంతాలో వాహనాలు నడిపే మెళకువలు నేర్పించారు.
ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల మెట్రో నుంచి ఇంటికి, ఆఫీసులు, వ్యాపారాల కేంద్రాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు పడే ఇబ్బందికి ఒక సమాధానం లభిస్తుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ నేర్చుకునే మహిళలకు ఉపాధి లభిస్తుంది.
ఇప్పటి వరకు 5 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చామని, భవిష్యత్తులో 100 మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తామని సయోధ్య ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యురాలు మృధులత వివరించారు.
Metro Fact : ఢిల్లీ మెట్రో తరువాత దేశంలో అతి పెద్ద మెట్రో హైదరాబాద్ మెట్రోనే.
ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Prayanikudu whatsapp

| ప్రయాణికుడు ఛానెల్‌ను ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!