నాగోబా జాతర అంటే ఏంటి ? ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది ? ఎలా వెళ్లాలి ? | Nagoba Jatara 2025

షేర్ చేయండి

ఏడాది మొత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలను ఒక్కచోటికి  చేర్చుతుంది ఈ జాతర ( Nagoba Jatara 2025 ). వారిని ఐక్యంగా ఉంచుతుంది. ఈ జాతరను పుష్య మాసంలోని అమావాస్య నాడు అర్థరాత్రి నాగశేషుడికి గంగాజలంతో అభిషేకం చేసి ప్రారంభిస్తారు.

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో నాగోబా జాతర ఒకటి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర ( Second Largest Tribal Festival in Asia ) కూడా ఇదే అవడం విశేషం. ( మొదటిది మేడారం జాతర ) . ఆదివాసీ ప్రజల అద్భుతమైన సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలంగాణలో ప్రతీ ఏడాది ఈ జాతరను నిర్వహిస్తారు. 

ఈ జాతర ప్రత్యేకత ఏంటి అంటే ఏడాది మొత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలను ఒక్కచోటికి  చేర్చుతుంది ఈ జాతర. వారికి ఐక్యంగా ఉంచుతుంది. ఈ జాతరను పుష్య మాసంలోని అమావాస్య నాడు అర్థరాత్రి నాగశేషుడికి గంగాజలంతో అభిషేకం చేసి ప్రారంభిస్తారు.

ఈ జాతరలో ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన శేషనారాయణ మూర్తి ( నాగోబా ) కు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయన ఈ రోజున పడగవిప్పి నాట్యం చేస్తారని ఆదివాసీ ప్రజల విశ్వాసం. 

ఆదివాసి ప్రజల జీవనాడి | Nagoba Jatara 2025

Nagoba Jatara Overview : ఈ జాతరకు ఈ ప్రాంతం నుంచే కాకుండా వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. అతి ప్రాచీన కాలం నుంచి నిర్వహించే ఈ జాతర కేవలం ఆధ్యాత్మికంగానే విశేషమైనది కాదు. ఇది ఆదివాసీల ఆచారాలు, వారి ప్రత్యేకతగా నిలిచే కళలు, వారి జీవన శైలిని చూపించే వేదిక కూడా ఇది. 

Tribal Traditions : అద్భుతమైన వీరి ఆచారాలు, ఆకట్టుకునే రంగురంగుల అలంకరణలు, ఉత్సాహాన్ని రెట్టింపు చేసే డప్పుల చప్పుళ్లు, అదిరిపోయే ఊరేగింపుల వల్ల జాతర అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటుంది. ఒకరికి ఒకరు అండగా ఉన్నాం అనే భావనను కలగిస్తుంది ఈ జాతర. ఈ జాతర ఆదివాసీల వారసత్వానికి జీవనాడిగా, ప్రతీకగా నిలుస్తోంది.

నాగోబా జాతర అంటే ఏంటి ? | what is Nagoba Jatara ?

nagoba jatara 2025
| నాగోబా ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Photo: X )

నాగోబా జాతర అనేది గోండు ప్రజలు నివసించే గోండ్వానా ( Gondwana ) ప్రాంతంలోని కేస్లాపూర్‌ గ్రామంలో జరుగుతుంది. మేస్త్రం వంశీయులు ( Mestram Clan ) నిర్వహించే ఆధ్యాత్మిక వేడుక ఇది. ఆదివాసీ ప్రజల ఆచారాలు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఇది తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాలో ప్రతీ ఏటా జరుగుతుంది.

ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్ నుంచి ఆదివాసీ ప్రజలు, నాగోబా భక్తులు తరలి వస్తుంటారు. నాగోబా జాతర సమయంలో అదివాసీ ప్రజలు కళా ప్రదర్శనలు చూడాల్సిందే, వారి వైవిభ్యభరితమైన జీవినశైలి, కట్టుబాట్లను గురించి తెలసుకోవాల్సిందే.

తేదీలు | Nagoba Jatara 2025 Important Dates

అదిలాబాద్ (( Adilabad ) జిల్లాలో పుష్యమాసాన్ని జాతరల నెలగా, అత్యంత ముఖ్యమైన మాసంగా భావిస్తారు. అందుకే ఇదే నెలలో నాగోబా జాతర కూడా జరుగుతుంది. ఇక తేదీల విషయానికి వస్తే 2025 జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జాతర జరుగుతుంది.

8 రోజులు పాటు సాగే ఈ జాతరకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. అందుకు తగిన విధంగా ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేస్తుంది. సుమారు 600 మంది పోలీసులతో బందోబస్తుతో పాటు సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు.

కేస్లాపూర్ ఎలా చేరుకోవాలి ? | How To Reach Keslapur ?

  • రోడ్డు మార్గంలో | Nagoba By Road: హైదరాబాద్ నుంచి కేస్లాపూర్ ( Hyd to Keslapur Distance ) 326 కిమీ దూరంలో ఉంటుంది. మీరు 44వ జాతీయ రహాదారిలో అదిలాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మీరు జిల్లా రహాదారుల్లో 32 కిమీ ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.
  • రైలు మార్గంలో | Keslapur By Train : కేస్లాపూర్‌ దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి అదిలాబాద్ రేల్వే స్టేషన్. మీరు అక్కడికి చేరుకుని టాక్సీ, ఆటో మాట్లాడుకుని కెస్లాపూర్ చేరుకోవచ్చు.
  • బస్సు లో | Keslapur Busses : అదిలాబాద్ జిల్లాకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ ( TGSRTC ) బస్సులు నడుపుతోంది.

ఆచారాలు , సంప్రదాయాలు | Rituals & Tradition At Nagoba

నాగోబా జాతర అనేది కేవళం ఆధ్యాత్మిక మేళా మాత్రమే కాదు..ఇది ఆది వాసీ ప్రజల విశిష్టమైన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. నాగోబా జాతర ( Nagoba Jatara ) సమయంలో నిర్వహించే ఆచారాల్లో, కార్యక్రమాల్లో ప్రధానమైనవి…

  • ఆచారాలు | Nagoba Rituals : నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించడంతో అంటే గంగాజలంతో అభిషేకం చేయడంతో జాతర మొదలవుతుంది. దీని కోసం గోదావరి నదీ నుంచి పవిత్ర జలాన్ని ఆలయానికి తీసుకు వస్తారు.
  • పవిత్ర స్నానం : ఈ జాతరలో మరో ప్రత్యేక ఏంటంటే కొతగా పెళ్లైన అమ్మాయిని నాగోబా దర్శనం చేయిస్తారు. ఇలా చేసిన తరువాతే తమ వంశంలో పెళ్లి కూతరు సభ్యురాలిగా చేరినట్టు భావిస్తారు. 
  • ఇది కూడా చదవండి : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
  • సాంస్కృతిక కార్యక్రమాలు : ఈ జాతరలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అందులో ముఖ్యమైనది “ గుస్సాడీ నృత్యం” ( Gussadi Dance ). గోండ్వానా ప్రజలు చేసే ఈ నృత్యం జాతరలో హైలైట్‌గా నిలుస్తుంది. గుస్సాడీ సంప్రదాయ వేషధారణలో ఉన్న వారిని దేవతలుగా కొలుస్తారు ఆదివాసీలు.
  • అదివాసీల ప్రజల కలయిక : నాగోబా జాతర అనేది అదివాసి ప్రజలను ఐక్యం చేస్తుంది. ఆదివాసీలు తమ వారసత్వాన్ని ముందు తరాలకు అందించేందుకు , తమ ఆచారాలను, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఈ జాతర ఒక చక్కని అవకాశం అందిస్తుంది.

నాగోబా జాతర అనేది ఒక వేడుక మాత్రమే కాదు. ఇది ఆదివాసీ ప్రజల జీవన విధానాన్ని, వారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి వేదిక .ఈ జాతరకు వేళ్లే భక్తులు భారత దేశంలో మారుమూలల్లో ఉన్న అరుదైన తెగల ప్రజల ( Indigenous Tribes Of India ) ఆచారాలు, వారసత్వం గురించి తెలుసుకోవచ్చు. 

ఒక వేళ మీరు నాగోబా జాతర వెళ్లాలి అనుకుంటే ఆలస్యం చేయకండి. వెంటనే కరెక్టుగా ప్లాన్ చేసుకుని బయల్దేరండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!