Venu Gopala Swamy Statue : హైదరాబాద్‌లో అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీకృష్ణుడి విగ్రహం…అయోధ్యా బాలరాముడి విగ్రహం మలచిన శిల్పి ఇతనే !

షేర్ చేయండి

హైదారాబాద్‌లో శ్రీకృష్ణుడి భక్తులకు శుభవార్త. నగరంలోని సీతారాంబాగ్‌లో అరుదైన వేణుగోపాల స్వామి విగ్రహానికి ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగింది ( Venu Gopala Swamy Statue ). ఈ విగ్రహాన్ని మలచింది ఎవరో తెలుసా ?…అయోధ్యలో బాలరాముడి ప్రసన్నవదన శిల్పాన్ని మలచి,  కోట్లాది మంది భారతీయుల కలలకు ఒక రూపాన్ని తెచ్చిన అరుణ్ యోగిరాజ్.

Prayanikudu
📣| ప్రయాణికుడు వాట్సాప్ అప్డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీతారాంబాగ్‌ ప్రత్యేకతలు | Speciality Of Seetharambagh 

హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ రాజస్థానీ మార్వాడీ నిర్మించిన ఒక శ్రీరామ చంద్రుడి ఆలయం ఉంటుంది. ఇది చాలా అందంగా అత్యంత విశాలమైన ప్రాంగణంతో ఉంటుంది. అన్నమయ్య చిత్రంతో పాటు, ఈశ్వర్, ఆట, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలా ఎన్నో సినిమాల చిత్రీకరణ ఇక్కడ జరిగింది.

దీంతో పాటు దగ్గర్లోనే దత్తాత్రేయుడి ఆలయం ( Mallepally Dattatreya Swamy Temple ) కూడా ఉంటుంది. కొండపై ఉండే ఈ ఆలయం భక్తుల కోటి కోరికలను కూడా నెరవేర్చే పవిత్ర సన్నిధిగా కొలువుదీరుతోంది. నిత్యం ఆధ్మాత్మిక కార్యక్రమాలతో భక్తులలో చైతన్యాన్ని కలిగించే ఈ ప్రాంతంలో మరో అద్భుత ఘట్టం ఇటీవలే ఆవిష్కృతమైంది.

సీతారాంబాగ్‌లోని ఆంధ్రా గల్లీ అనే ప్రాంతంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అద్భుతమైన బాలకృష్ణుడి విగ్రహం ఫిబ్రవరి 7వ తేదీన ప్రాణప్రతిష్ట పూర్తి చేసుకుంది. ప్రాణప్రతిష్ట అనంతరం విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు వేణుగోపాల స్వామి దివ్యమైన రూపాన్ని చూసి తన్మయత్వానికి గురయ్యారు. 

నందగోపాలుడు తమనే చూస్తున్నట్టుగా ఉంది అని…అరుణ్ యోగిరాజ్ ( Arun Yogi Raj ) ఈ విగ్రహాన్ని అద్భుతంగా మలిచారని ప్రశంసలు కురిపించారు భక్తులు.

ఆలయ చరిత్ర, విశిష్టత | History and Temple Story

Venu Gopala Swamy Statue
Venu Gopala Swamy Temple Seetharambagh 2

సీతారాంబాగ్ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారు సుమారు 75 సంవత్సరాలుగా భక్తులకు దర్శనం ఇస్తూ కరుణిస్తున్నారు. సంతానం కలగాలని కోరుకునే వారు ఇక్కడ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించి, స్వామివారికి ముడుపు కాయ కడితే సంతాన భాగ్యం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం.

ఇంతటి విశిష్టమైన ఈ ఆలయ అభివృద్ధికి స్థానికులు అంతా ఏకమై తమవంతు సాయం చేస్తున్నారు. ఆలయ వైభవాన్ని దశదిశలా చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు ఆలయంలో యంత్ర విగ్రహ గోపుర శిఖర ప్రతిష్ట మహోత్సవం నిర్వహించాలని కొంత కాలం క్రితం భావించారు. 

అందులో భాగంగా ఆలయంలో వేణుగోపాల స్వామి విగ్రహాన్ని, అయోధ్యలో శ్రీరాముడి ఆలయంలో ఉన్న బాలరాముడి విగ్రహాన్ని మలచిన అరుణ్ యోగిరాజ్ చెక్కితే బాగుంటుంది అని భావించారు. దీని కోసం అరుణ్ యోగిరాజ్‌ను తమ మనసులో ఉన్న కోరిక, ఆలయ విశిష్టత తెలపగా ఆయన దీనికి అంగీకరించారు. నిర్ణీత గడువులోనే చక్కని, పవిత్రత ఉట్టిపడేలా, నందగోపాలుడు ప్రసన్న వదనంతో ఉన్న విగ్రహాన్ని చెక్కారు అరుణ్ యోగిరాజ్ ( Lord Krishna Statue By Arjun Yogi Raj In Hyderabad )

ఈ ఆలయ ప్రాంగణంలోనే వినాయకుడి ఆలయంతో పాటు, అందమైన శివలింగాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు.

ఈ ఆలయానికి ఎలా చేరకోవాలి ? | How To Reach 

ఈ ఆలయం సీతారాంబాగ్‌లోని ఆంధ్రా గల్లీలో ఉంటుంది. మీరు మెహిదీపట్నం, అత్తాపూర్, గోషామహల్, మోజాంజాహి మార్కెట్, అఫ్జల్‌గంజ్ లేదా మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి చేరుకోవచ్చు. అడ్రెస్ లింకు కోసం మీరు ఈ ఇమేజ్‌పై స్కాన్ కూడా చేయవచ్చు.

Venu Gopala Swamy Temple Seetharambagh 2

సీతారాంబాగ్ అనే ప్రాంతం పాతబస్తిలోని అజీజ్ బాగ్, మల్లేపల్లికి సమీపంలో ఉంటుంది. ధూల్‌పేట్ నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. పైన వివరించిన ప్రదేశాల నుంచి ఆటోలు కూడా లభిస్తాయి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!