జెట్ లాగ్ అంటే ఏంటి ? ఈ సమస్య నుంచి తప్పించుకోవడం ఎలా ? 10 Tips For Avoiding Jet Lag

షేర్ చేయండి

ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాల్లో జెట్‌లాగ్ ఒకటి. జెట్‌లాగ్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి (Avoiding Jet Lag). దీని కోసం మీరు ఫ్లైట్ ఎక్కే ముందు, యాత్రలో, ప్లైట్ దిగిన తరువాత ఇలా చేసి చూడండి

ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాల్లో జెట్‌లాగ్ ఒకటి. ఈ సమస్య వల్ల మీ డ్రీమ్ డెస్టినేషన్ (Dream Destination) అనేది సగం నిద్ర మత్తులోనే సాగుతుంది. అయితే జెట్‌లాగ్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి . పూర్తిగా జెట్‌లాగ్ నుంచి తప్పించుకోగలం అనడం లేదు. కానీ ప్రభావాన్ని గణనీయం తగ్గించుకోవచ్చు. దీని కోసం మీరు ఫ్లైట్ ఎక్కే ముందు, యాత్రలో, ప్లైట్ దిగిన తరువాత ఇలా చేసి చూడండి

జెట్ లాగ్ అంటే ఏంటి ? | What Is Jet Lag ?

మీరు డిఫరెంట్ టైమ్‌ జోన్స్‌లో (Time Zones) ప్రయాణిస్తున్నప్పుడు మీ శరీరం దానికి తగిన విధంగా అడ్టస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది. మన శరీరానికి ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. అంటే రాత్రి పది కాగనే మనకు నిద్ర వచ్చేయడం, పొద్దున్నే 7 గంటలకు మెలకువ, మధ్యాహ్నం 1 గంటకు లంచ్ కోసం శరరీరం సిద్ధం అవడం ఇవన్నీ బాడీ టైమ్ టేబుల్ లాంటివి. 

ఇవన్నీ మన రెగ్యురల్ అలవాట్ల ప్రకారం శరీరం (Biological Timing) టైమ్ టేబుల్ సెట్ చేసుకుని ఉంటుంది. కానీ మీరు వేరే టైమ్ జోన్ లేదా విదేశానికి వెళ్లినప్పుడు ఆ సిస్టమ్ మారిపోతుంది. కొన్ని గంటలు అటూ ఇటూ మారే అవకాశం ఉంటుంది. దీంతో బయట తెల్లారినా మీ శరీరం ఇంకా నిద్ర మత్తులో ఉండటం, బయట రాత్రి అవుతున్నా మీరు బాడీ యాక్టివ్‌గా ఉండటం జరుగుతుంటుంది. 

Avoiding Jet Lag
| మీ శరీరానికి కొత్త ప్రాంతాన్ని బట్టి తన టైమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సమయం పడుతుంది. దాని కోసం మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే ఇబ్బంది తగ్గుతుంది.

లోకల్ టైమ్‌కు మీ శరీరం అడ్జస్ట్ అయ్యేంత వరకు మీరు బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. శరీరానికి ఉన్న నేచురల్ రిథమ్ తప్పుతుంది. దీంతో మీరు రాత్రుల్లో నిద్రపోలేకపోతారు. మీ శరీరం కొత్త టైమ్‌జోన్‌కు అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇదంతా జెట్‌లాగ్‌లో భాగమే.

ఫ్లైట్ ఎక్కడానికి ముందు | Pre-Flight Preparation Avoiding Jet Lag

ఈ సమస్య నుంచి గట్టెక్కాలి అంటే (Avoiding Jet Lag) ఈ చిట్కాలు పాటించి చూడండి. 

  • సరైన నిద్ర : విమానం ఎక్కడానికి కొన్ని రోజుల ముందు మీ స్లీపింగ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోండి. రాత్రి సమయంలో గాఢంగా నిద్రపోండి.
  • టైమ్ మార్చుకోండి : మీరు వెళ్లబోయే ప్రాంతాన్ని బట్టి మీ నిద్రా సమయాన్ని మెల్లిమెల్లిగా అడ్జస్ట్ చేయడం ప్రారంభించండి. ట్యూన్ చేయడం లాంటిది అన్నమాట. భోజన సమయం, నిద్ర పోయే సమయం మీరు వెళ్లబోయే దేశం సమయాన్ని బట్టి మార్చుకోవడం మొదలు పెట్టండి. తూర్పు వైపు వెళ్తోంటే అరగంట ముందు నిద్రపోండి. పశ్చిమాన వెళ్తోంటే కొంచెం లేటుగా నిద్రపోండి.
  • ఇది కూడా చదవండి : విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ? 

ఫ్లైట్ లో ఉన్నప్పడు | In Flight Strategy

No Layovers:  లేయోవర్స్ వద్దు :  టైమ్ జోన్ మార్చే ప్రయాణాలు చేస్తున్నప్పుడు వీలైనంత వరకు నాన్ స్టాప్ విమానాల్లో (Non-Stop Flights) వెళ్లేలా ప్రయత్నించండి. ఒక వేళ తప్పడం లేదు అంటే మాత్రం మీకు ఫ్లైట్స్ ఛేంజ్ చేసేందుకు సరైన సమయం ఉండేలా ప్లాన్ చేసుకోండి.

  • బుకింగ్ : వీలైతే మీరు నిద్ర లేచే సమయానికి మీ డెస్టినేషన్ చేరుకునేలా ఫ్లైట్ (Flight) టికెట్ బుక్ చేసుకునేలా ప్లాన్ చేయండి.
  • ఇవి ట్రై చేయండి : విమానంలో ఉన్నప్పుడు నిద్రపోవడానికి ఐ మాస్క్ (Accessories For Flights) , ఇయర్ ప్లగ్స్ మంచి ట్రావెల్ పిల్లో (Travel Pillow) తీసుకోండి. ఉదయాన్నే మీ విమానం ల్యాండ్ అయినప్పుడు లేచేలా చూసుకోండి. 
  • హైడ్రేట్ అవ్వండి :  విమానంలోఉన్నప్పుడు మంచినీరు బాగా తీసుకోండి. ప్రతీ గంటకు 8 ఔన్సుల నీరు ( లీటర్ నీటిలో 23 శాతం) తాగమని ఏరోస్పేస్ మెడికల్ అసోసియేషన్ (Aerospace Medical Association) సూచిస్తోంది.
  • ఇవి తీసుకోకండి | On air Drinks: విమానంలో ఉన్నప్పుడు కెఫైన్, ఆల్కహాల్ తీసుకోకండి. ఇవి మీ నిద్రను డిస్టర్బ్ చేయడంతో పాటు మిమ్మల్ని డిహైడ్రేట్ చేస్తాయి.
  • యాక్టివ్‌గా ఉండండి : On Air Stretching: అవకాశం ఉన్నప్పుడల్లా సీటు నుంచి లేచి కొంచెం వాక్ చేయండి, స్ట్రెచింగ్ చేయండి. దీనివల్ల శరీరం బిగుతుగా మారదు.
  • చిన్న మీల్స్ | On Air Food : కడుపులో తిప్పకుండా ఉండేందుకు, ఇతర సమస్యల నుంచి తప్పించుకునేందుకు ఒకేసారి ఎక్కువ తినకుండా కొంచెం కొంచెం తినడం అలవాటు చేసుకోండి.
  • ఫ్లైట్ టికెట్స్ చవకగా బుక్ చేసుకోవడానికి 14 సీక్రెట్ టిప్స్..ఎవ్వరికీ చెప్పకండి ! Flight Ticket Booking Hacks

విమానం దిగాక | Post Arrival Recovery

Avoiding Jet Lag
| మీరు వెళ్లని ప్రాంతాన్ని బట్టి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ముందు కొన్ని రోజులు ఇబ్బందిగా అనిపించవచ్చు.

విమానం దిగిన తరువాత స్థానికంగా ఉన్న సమయం ప్రకారం మీరు రెగ్యులర్‌గా నిద్రపోయే సమయానికి పడుకోండి. నిద్ర వస్తోంది కదా అని పడుకోకుండా అప్పటి వరకు ఆగండి. ఉదాహరణకు మీకు రోజు రాత్రి 10 గంటలకు నిద్రపోయే అలవాటు ఉంటే, మీరు వెళ్లిన ప్రదేశంలో కూడా రాత్రి 10 వరకు ఆగండి (Avoiding Jet Lag). హైదరాబాద్‌లో రాత్రి పది అవుతోంది నేను పడుకోవాలి అనుకోండి. 

  • వెంటనే అడ్జస్ట్ అవ్వండి :  మీ వాచులో సమయాన్ని వెంటనే స్థానిక సమయానికి తగిన విధంగా మార్చుకోండి. మీరు రోజూ ఏ సమయంలో నిద్రపోతారో అదే సమయానికి నిద్రపోయేలా ప్రయత్నించండి.
  • సూర్యరశ్మితో స్నేహం : మీ శరీర సమయాన్ని రీసెట్ చేసుకోవడంలో సూర్యరశ్మి కీలక పాత్ర పోషిస్తుంది. మీరు తూర్పున వెళ్తుంటే (East Asia) మీరు సాధారణంగా నిద్ర లేచే సమయం వరకు సూర్యుడిని ఎవాయిడ్ చేయండి. అవసరం అనిపిస్తే నల్ల కళ్లద్దాలు ధరించండి. ఒక రోజు తరువాత ఉదయానే సూర్యుడి ముందుకు వెళ్తే మీ శరీరం అడ్జస్ట్ అవ్వడం మొదలు పెడుతుంది.
  • చిన్న కునుకులు : డే టైమ్‌లో మీకు నిద్ర వస్తోంది అనిపిస్తే చిన్న నాప్ (Nap) తీసుకోండి. అయితే 30 నిమిషాల కన్నా ఎక్కువగా పడుకోకండి. లేదంటే మీకు రాత్రి నిద్రపోవడంలో ఇబ్బంది అవుతుంది.
  • కాస్త ఆగండి : రోటీన్ : ప్రతీ రోజు వ్యాయామం చేయండి. మీ శరీరాన్ని అడ్జస్ట్ అవనివ్వండి.
  • సింపుల్ డే :  మీరు కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు మొదటి రోజు ఎక్కువ ఈవెంట్స్ పెట్టుకోకండి. నిద్రకు, మీ శరీరం అక్కడి సమయాన్ని, వాతావరణాన్ని అడ్జస్ట్ అవ్వడానికి సమయం ఇవ్వండి.
  • ఇక ఫ్లైట్‌లోకి ఒకే బ్యాగు ..కొత్త 7 రూల్స్ గురించి తెలుసా? | New Hand Baggage Rules By BCAS & CISF

మీ ప్రయాణం ప్రారంభం అవ్వడానికి ముందు, స్టార్ట్ అయ్యాక, పూర్తి అయ్యాక ఈ చిట్కాలను  పాటిస్తే జెట్ లాగ్ (Jet Lag Effects) ప్రభావం అంతగా ఉండదు. మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. మీ శరీరాన్ని కొత్త ప్రాంతాన్ని బట్టి అడ్జస్ట్ అయ్యే అవకాశం ఇవ్వండి. అప్పుడే మీరు మీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయగలరు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!