తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం (Sri Raja Rajeswara Swamy Temple) మహాశివరాత్రికి సిద్ధమైంది. మహాశివుడికి ఇష్టమైన రోజున భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు తగిన సౌకర్యాలు ఏర్పాట్లు చేసింది దేవస్థానం. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దామా…
ముఖ్యాంశాలు
భక్తుల సౌకర్యం కోసం | Comfortable Accommodations

మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక షెల్టర్లతో పాటు ఆలయ ప్రాంగణంలో అనేక ప్రాంతాల్లో ఎండ నుంచి ఉపశమనం కలిగించేలా షేడెడ్ ఏరియాలను నిర్మించారు.
అద్భుతమైన లైటింగ్ | Dazzling Lighting

వేములవాడ ఆలయాన్ని అందమైన లైటింగ్‌తో ముస్తాబు చేశారు. ఆలయ గోపురాలు, మండపాలు, వేములవాడ బ్రిడ్జిని కూడా రంగురంగుల బల్పులతో అలంకరించారు. పండగ వాతావరణం (Maha Shivaratri 2025) కనిపించేలా ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మంచినీటి సౌకర్యం | Drinking Water Facility

ఎండాకాలం అనధికారంగా మొదలైంది. ఇలాంటి సమయంలో భక్తులకు మంచినీటి కొరత ఉండకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో (Vemulawada’s Mahashivratri Jatra 2025) మీకు అనేక చోట్ల మంచినీటి సదుపాయం కల్పించారు.
అప్‌గ్రేడింగ్ | Temple Upgrading

భక్తులకు తగిన సదుపాయాలు కల్పించేందుకు, సౌకర్యవంతమైన దర్శనం అనుభూతి కోసం రూ.2.39 కోట్లతో అప్‌గ్రేడింగ్ పనులు చేపట్టారు.
లడ్డూల పంపిణి | Vemulawada Temple Laddu

మహా శివరాత్రి సందర్భంగా దర్శనానికి వచ్చేె భక్తులకు (Vemulawada Sri Rajarajeswara Temple) లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నారు. దీని కోసం 4,00,000 (4 లక్షలు ) లడ్డూలను సిద్ధం చేశారు.
రిఫ్రెష్‌మెంట్ | Sri Raja Rajeswara Swamy

దర్శనం కోసం క్యూలైన్లో నిలబడిన భక్తులకు మజ్జిగ ప్యాకెట్లతో పాటు పండ్లను అందించడం జరుగుతుంది. ఆధ్యాత్మికత (Spiritual) మాత్రమే కాదు భక్తుల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వారికి రిఫ్రెష్మెంట్స్ అందించనున్నారు.
సాంస్కృతి కార్యక్రమాలు

మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ భాషా , సాంస్కృతిక శాఖ (Telangana Department of Language and Culture) నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో సుమారు 700 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
ప్రజా రవాణా సులభతరం | TSRTC Busses To Vemulawada

వేములవాడ ఆలయానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుమారు 800 ప్రత్యే బస్సులను వేములవాడకు వెళ్లే ప్రయాణికుల కోసం అరేంజ్ చేసింది.
తితితే నుంచి | Tirumala Tirupati Devasthanam

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను (Pattu Vastralu) సమర్పిస్తారు.
ప్రత్యేక పూజలు | Sacred Rituals At Temples

మహా శివరాత్రి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు మహా లింగార్చన పూజలు (Maha Lingarchana ceremony ) జరుగుతాయి. అనంతరం లింగోద్భవం సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం (Rudrabhishekam) నిర్వహిస్తారు.
మహా శివరాత్రి సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పర్యాటక శాఖ (Telangana Tourism) కూడా ప్రత్యేక టూరిస్టు ప్యాకేజీలు ప్రకటించింది.
ఆ ప్యాకేజీ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.