ఇక్కడి గుండంలో మారేడు దళం వేస్తే , అది కాశి గంగలో తేలుతుందంట | Kadali Kapoteswara Swamy Temple

షేర్ చేయండి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న స్వయంభు శ్రీ కపోతేశ్వర ఆలయం (Kadali Kapoteswara Swamy Temple) అద్భుతమైన చరిత్రకు, ఆధ్యాత్మిక ప్రతీకగా నిలుస్తోంది. రెండు పావురాలు, ఒక బోయవాడు చేసిన త్యాగానికి పరమశివుడు కదలి కడిలికి వచ్చిన చరిత్ర, ఆలయం విశిష్టతలు ఈ పోస్టులో మీకోసం…

కపోతేశ్వర ఆలయం ఎక్కడుంది ? | How To Reach Kadali Kapoteswara Swamy Temple

Kadali Kapoteswara Swamy Temple
శ్రీ పార్వతీ కపోతేశ్వర స్వామి వారి ఆలయం

ఈ ఆలయం ఏపీలోని (Andhra Pradesh) అంబేద్కర్ కోనసీమ జాల్లాలోని రాజోలు మండలంలో ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయం అంటారు. ఈ ఆలయంలో కపోతేశ్వర స్వామివారితో పాటు, వినాయకుడు, దుర్గమ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. 

ఈ ఆలయానికి చేరుకోవడానికి మీరు కోనసీమ జిల్లాకు వచ్చి అక్కడి నుంచి రాజోలు తరువాత కడలికి చేరుకోవచ్చు. స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే : 

  • విమానంలో | Nearest Airport:  కడలికి సమీపంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంటుంది. మీరు అక్కడి నుంచి 40 కిమీ ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. 
  • ట్రైనులో | Nearest Railway Station:  ట్రైన్‌లో రావాలి అనుకుంటే దగ్గర్లోనే జగ్గయ్యపేట రైల్వే స్టేషన్‌కు వచ్చేలా ప్లాన్ చేసుకోండి. 
  • బస్సులో రావాలి అనుకునే ప్రయాణికులకు రాజమండ్రి, కాకినాడ నుంచి రెగ్యులర్‌ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
  • ఆలయ సమయాలు: ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు
  • Read Also : ద్వారపూడిలో 60 అడుగుల భారీ ఆదియోగి విహ్రం…10 ఆసక్తికరమైన విషయాలు

ఆలయం చరిత్ర | Kapoteswara Temple History

Kadali Kapoteswara Swamy Temple
శ్రీ కపోతేశ్వర ఆలయం

ప్రస్తుతం శ్రీ కపోతేశ్వరం ఆలయం ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేదట. ఒకనాడు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్న సమయంలో ఒక బోయవాడు (Hunter) చలికి వణుకుతూ, ఆకలితో అలమటిస్తూ ఒక చెట్టు కిందికి చేరాడట.

ఆ చెట్టుపై ఒక పావురాల జంట ఉండేది. ఆడ పావురం లేని సమయంలో ఆ వేటగాడిని గమనించింది మగ పావురం (Dove). వేటగాడు చలికి వణకడం చూసి దానికి జాలి వేసింది. అతనికి సాయం చేయాలని అనుకుని వెంటనే ఎగిరి వెళ్లి పక్కనే ఉన్న స్మశానంలో చితి మంటల్లోంచి ఒక కట్టెను తీసుకువచ్చి అతని ముందు వేసింది. దీంతో అతను చలికాచుకోవడం మొదలుపెట్టాడు.

Kadali Kapoteswara Swamy Temple
ఆలయ ప్రాంగణంలో పక్షి విగ్రహం

అయితే చలి బాధ తీరినా ఆకలి బాధ తీరకపోవడంతో అది గమనించిన మగపావురం అగ్నిలో ప్రవేశించి అతని ఆకలి బాధను తీర్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆడ పావురం తన జీవిత భాగస్వామి చేసిన త్యాగాన్ని గుర్తించి తను కూడా అదే మంటల్లో దూకింది. ఇదంతా గమనించిన వేటగాడు కూడా వెంటనే మంటల్లో దూకాడట.

పరమశివుడి సాక్ష్యాత్కారం | Lord Shiva Darshan

Kadali Kapoteswara Swamy Temple
ఆలయ ప్రాంగణం

ఈ పావురాల జంట త్యాగాన్ని గమనించిన పరమశివుడు (Mahadev) ప్రత్యక్షమై వాటికి శివానుగ్రహం అందిస్తాడు. అయితే తమతో పాటు బోయవాడు కూడా ప్రాణత్యాగం చేశాడని, అతడిని కూడా అనుగ్రహించాల్సిందిగా కోరతాయి కపోతాలు.

  • వాటి కోరికను మన్నించి వేటగాడిని కూడా అనుగ్రహిస్తాడు మహా శివుడు.
  • దీనికి నిదర్శనంగా నేటికీ ఆలయానికి సమీపంలోనే ఒక స్మశానం కూడా ఉండటాన్ని మీరు గమనించవచ్చు.

మహా శివుడు కొలువైన ప్రాంతం | Subrahmanya Swamy

Kadali Kapoteswara Swamy Temple
కపోతేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న పరమశివుడి లింగం

కపోతాలతో పాటు వేటగాడు కలిసి మహా శివుడిని ఈ ప్రాంతంలో శిలాకారంలో కొలువై ఉండమని కోరగా స్వామివారు తదాస్థు అని కపోతేశ్వరుడిగా కొలువుదీరారు. స్వామివారు లింగాకారంలో ఉద్భవించిన తరుణంలో ఆయనకు నిడనిచ్చేందుకు సుబ్రహ్మణ్య స్వామివారు పడగవిప్పారంటారు. 

కపోతగుండం విశిష్టతలు | Kapota Gundam

Kadali Kapoteswara Swamy Temple
కపోతేశ్వరాలయం గోపురాలు

ఆలయానికి సమీపంలో కపోతగుండం అనే గుండం ఉంటుంది. ఈ గుండం అత్యంత విశిష్టమైనది అని ఆలయ పురోహితులు తెలిపారు. స్వామివారు ఉద్భవించినప్పుడు అక్కడి అగ్నిభాగం అంతా జలమయం అయిందట. 

  • ఆ జలమే అంతర్వాహినిగా మారి కపోతగుండంగా మారింది అంటారు. 
  • ఈ  కపోతగుండంలో మామూలు సమయంలో మారేడు దళాన్ని వేస్తే అది తేలుతూ ఉంటుంది. 
  • అదే  మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజు మారేడు దళాన్ని నీటిలో వేస్తే అది మునిగిపోతుంది. 
  • ఇలా మునిగిన మారేడు ఆకు కాశీలో గంగానదిలో (Ganga River) తేలుతుంది అని భక్తుల విశ్వాసం.
  • ఇది కూడా చదవండి : Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం

అందుకే మాఘమాసంలో చాలా మంది భక్తులు శ్రీ కపోతేశ్వర ఆలయ దర్శనానికి వస్తుంటారు. ముఖ్యంగా మాఘ ఆదివారం రోజు గుండంలో స్నానం ఆచరిస్తుంటారు. ఈ రోజున ఇక్కడి గుండంలో స్నానం చేస్తే కాశీలో స్నానం చేస్తే ఎంత పవిత్ర కలుగుతుందో అంతే పవిత్రత కలుగుతుంది అంటారు.

ఈ ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు 

పడగ రూపంలో కొబ్బరికాయ

Kadali Kapoteswara Swamy Temple
పడగవిప్పిన కొబ్బరికాయ

ఈ ఆలయానికి ఉన్న మరొక విశిష్టత వచ్చి ఇక్కడ ఉండే ఒక కొబ్బరికాయ (Sacred Coconut). దాదాపు 60 సంత్సరాల నుంచి పడగ రూపంలో ఈ కొబ్బరికాయ ఇక్కడే ఉంది అని చెబుతారు.

ఆదిశంకరాచార్యలు ప్రతిష్టించిన శక్తి పీఠం

Kadali Kapoteswara Swamy Temple
ఆలయం ప్రాంగణంలో …

హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగద్గురు ఆదిశంకరాచార్యులు (Jagadguru Adi Shankaracharya) దేశ వ్యాప్తంగా శక్తి పీఠాలు ప్రతిష్టించిన విషయం తెలిసిందే. అలా ఆయన ప్రతిష్టించిన 108 శక్తి పీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి అని చెబుతారు. శిలా అంటే రాతిపై చెక్కిన శ్రీ చక్రంతో ఆయన ఇక్కడ బాలా త్రిపుర సుందరి (Bala Tripura Sundari ) అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. 

సమీపంలో ఉండే ఆలయాలు | Temple Near Kapoteswara Temple

Kadali Kapoteswara Swamy Temple
ఆలయ ప్రవేశ ద్వారం వద్ద

శ్రీ కపోతేశ్వర ఆలయ దర్శనం తరువాత సమీపంలో ఉన్న ఆలయాలను సందర్శించాలి అనుకునే వారి కోసం: 

  • అప్పనపల్లి శ్రీ బాలబాలజీ ఆలయం – 12 కిమీ (Appanapalli Sri Balabalaji Temple)
  • పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం -27 కిమీ (Palakollu Ksheera Ramalingeswara Swamy Temple) 
  • అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయం – 30 కిమీ (Antarvedi Sri Lakshmi Narasimha Swamy)
  • ఆచంట రామలింగేశ్వర స్వామి ఆలయం – 48 కిమీ (Achanta Ramalingeswara Swamy Temple)

ఆధ్యాత్మిక చైతన్యం కోసం | Kadali Kapoteswara Swamy Temple

Kadali Kapoteswara Swamy Temple
ఆలయ ధ్వజస్తంభం

శ్రీ కపోతేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం వల్ల ఆధ్మాత్మిక అనుభూతి (Spiritual Experience) మాత్రమే కాదు, ఇక్కడి చరిత్ర, సంప్రదాయం, ఆచారాల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. త్యాగం భక్తి కరుణల అద్భుతమైన సంగమమే ఈ ఆలయం. 

మీరు ఆధ్యాత్మిక చైతన్యం కోసం వెతుకుతున్నా, లేక ప్రయాణ అనుభూతి కోసం ఆంధ్రప్రదేశ్ వారసత్వం (Andhra Pradesh Heritage), సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకున్నా శ్రీ కపోతేశ్వర ఆలయాన్ని మీరు తప్పకుండా సందర్శించాల్సిందే.

ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్లాన్ చేసుకుని (Travel Plan) బ్యాగులు సర్ధుకుని మంచి టైమ్ చూసుకుని బయబల్దేరండి. మరో విషయం మీ ప్లాన్‌లో స్థానిక ఆహారపదార్ధాలు, పానీయాలను టేస్ట్ చేయడాన్ని కూడా చేర్చండి. ఎందుకంటే ఏపీ ఫుడ్ అంటే దేశం (Andhra Pradesh Food) మొత్తం ఫేమస్సు.


- కాశి విశ్వనాథ్ తాత, ఉభయ గోదావరి జిల్లా ప్రతినిధి | Prayanikudu.com

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!