US Visa : అమెరికా వీసా కావాలా ? అయితే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ గురించి చెప్పాల్సిందే
US Visa : అమెరికా వెళ్లాలని కలలు కనేవారికి ముఖ్యంగా చదువుకోవడానికి (ఎఫ్ వీసా), వృత్తి విద్య నేర్చుకోవడానికి (ఎం వీసా), లేదా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ (జే వీసా) కోసం వెళ్లేవారికి ఇప్పుడు ఒక కొత్త నిబంధన వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ మధ్యే ఒక కొత్త రూల్‌ను అమలులోకి తెచ్చింది. అదేంటంటే, అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇకపై తమ సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలు తప్పకుండా ఇవ్వాలి.
ఇప్పుడు, అమెరికా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి, మీ సోషల్ మీడియా ఖాతాలను ‘ప్రైవసీ నుంచి పబ్లిక్’గా మార్చాలని చెబుతోంది. అంటే, మీరు పెట్టే పోస్టులు, కామెంట్లు, లైక్‌లు.. అన్నీ అందరికీ కనిపించేలా ఉంచాలన్న మాట. తమ చట్టాల ప్రకారం ఈ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తామని అమెరికా స్పష్టం చేసింది. భారత్‌లోని అమెరికా ఎంబసీ కూడా ఈ మార్పులు చేయాలని స్పష్టంగా చెప్పింది.

ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఎందుకు ఈ కొత్త నిబంధన?
అమెరికా ప్రభుత్వం ఈ కొత్త రూల్‌ను తమ దేశ భద్రతను పెంచడానికి తీసుకొచ్చింది. వీసాకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఎవరు, వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్లకి ఏమైనా అనుమానాస్పద సంబంధాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ సోషల్ మీడియా వివరాలను చూస్తామని చెబుతోంది.
2019 నుంచే వీసా దరఖాస్తు ఫారమ్‌లలో సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలు అడుగుతున్నారు. అయితే, ఇప్పుడు అంతకు మించి, ఆ అకౌంట్స్‌కి పూర్తిగా యాక్సెస్ ఇవ్వాలని, అంటే అవి పబ్లిక్‌గా ఉండాలని కోరుతున్నారు. మీ ఆన్లైన్ కార్యకలాపాలను పూర్తిగా పరిశీలించడం ద్వారా, అమెరికాలోకి ఎవరెవరు వస్తున్నారో, వాళ్ళు దేశానికి ఎలాంటి ముప్పు కాకుండా ఉన్నారో నిర్ధారించుకోవాలని చూస్తున్నారు.
ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్? ఏం చూస్తారు?
పోలీసులు లేదా వీసా ఆఫీసర్లు మీ ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన్, టిక్‌టాక్ లాంటి అన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మీ యాక్టివిటీని చూస్తారు. మీ పోస్టులు, కామెంట్లు, షేర్లు, లైక్‌లు, ఫాలో అయ్యే పేజీలు.. ఇలా అన్నీ పరిశీలిస్తారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
వీసా అధికారులు మీ గుర్తింపును సరిచూస్తారు. మీరు అమెరికా చట్టాలకు అనుకూలంగా ఉన్నారా లేదా అని చూస్తారు. అమెరికా ప్రభుత్వం, సంస్థలు, సంస్కృతిపై మీకు వ్యతిరేక భావాలు ఉన్నాయా అని పరిశీలిస్తారు. ఏమైనా దేశ భద్రతకు సంబంధించిన ఆందోళనలు ఉన్నాయా అని చూస్తారు. ఒకవేళ ఎవరైనా తమ సోషల్ మీడియా వివరాలను దాచడానికి ప్రయత్నిస్తే లేదా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చి యాక్సెస్ ఇవ్వకపోతే, అది వారి వీసా దరఖాస్తుపై నెగిటివ్ ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంటే, వీసా దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది.
భారతీయులకు ప్రాబ్లమా ?
లక్షల మంది భారతీయ విద్యార్థులు, వర్కర్లు ప్రతి సంవత్సరం అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఈ కొత్త నిబంధన వల్ల వీసా ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, సోషల్ మీడియా అకౌంట్స్‌ను పరిశీలించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే, అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు తమ ప్రయాణ లేదా చదువుల ప్లాన్స్‌లో ఈ ఆలస్యాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కొత్త రూల్ ప్రైవసీకి భంగం కలిగించేదే అయినప్పటికీ, దేశ భద్రతకు ఇది అవసరమని అమెరికా అధికారులు వాదిస్తున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.