Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. విదేశీయులు భారతీయ సంస్కృతిని, వేషధారణను, ఆహారాన్ని, స్టైల్‌ను తెగ ఇష్టపడుతున్నారు. అంతేకాదు, వాటిని గర్వంగా ప్రదర్శిస్తూ నెట్టింట్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇటీవల, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్రాండ్ ‘ప్రాడా’ మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన కొల్హాపురి చెప్పులను తమ ఫ్యాషన్ షోలో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కొందరు విదేశీయులు స్థానిక పాన్ షాపుల్లో సర్వసాధారణంగా దొరికే, మనం కూరగాయలు లేదా ఇతర వస్తువులను తీసుకువెళ్లడానికి ఉపయోగించే ‘విమల్’ బ్రాండ్ బ్యాగులను ధరించి అందరినీ ఆకర్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
రొసల్బా పెరెజ్, జాక్వెలిన్ మోరల్స్ అనే ఇద్దరు విదేశీ మహిళలు భారతదేశ వీధుల్లో రెడ్ బ్లూ కలర్ విమల్ బ్యాగులను చేతుల్లో పట్టుకొని నడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వారి వీడియోపై “No Gucci, no Prada, no LV—only Vimal” అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. మరో క్లిప్‌లో ఈ ఇద్దరు మహిళలు మెట్రో స్టేషన్ ముందు ఈ విమల్ బ్యాగులను చూపిస్తూ, “Next station… chai & colours” అనే క్యాప్షన్‌తో కనిపించారు.

ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
ఈ వీడియోలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఒక నెటిజన్.. ఇది ఎంతో బాగుంది అని కామెంట్ చేశారు. మరొక నెటిజన్.. వారు మాత్రమే విమల్ బ్యాగులను ఇంత స్టైల్‌గా తీసుకెళ్లగలరు అని మెచ్చుకున్నారు. ఇంకొకరు అద్భుతం..మీరు బాటా చెప్పులు కూడా వేసుకున్నారని అనుకుంటున్నాను అని జోక్ చేశారు. భారతదేశంలో అతిపెద్ద బ్రాండ్ ఇదే అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు.
ఇదే విధంగా మహారాష్ట్ర పాపులర్ కొల్హాపురి చెప్పులు కూడా అంతర్జాతీయ వేదికపైకి వచ్చాయి. ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించాయి. ఈ సాంప్రదాయ తోలు చెప్పులు భారతీయ కుటుంబాలలో లోతుగా పాతుకుపోయాయి. భారతదేశం అంతటా ప్రజలు వీటిని ధరిస్తారు. ఇప్పుడు ఈ చెప్పులు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. కొల్హాపురి చెప్పులు ప్రాడా SS26 మెన్స్‌వేర్ షోలో ప్రదర్శించబడడంతో ఆన్‌లైన్‌లో నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.