Railway Rules : రైలు ప్రయాణంలో సమస్యలా? మీ టికెట్ డబ్బులు వెనక్కి పొందండిలా!

షేర్ చేయండి

Railway Rules : రైలు ప్రయాణాలు చాలామందికి సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఏసీలు పనిచేయకపోవడం, రైలు ఆలస్యంగా నడవడం, లేదంటే రైలు దారి మళ్లించడం వంటివి. ఇలాంటి సందర్భాల్లో చాలామందికి తమ టికెట్ డబ్బులు తిరిగి వస్తాయో రావో, వస్తే ఎలా పొందాలి అని తెలియదు. రీసెంటుగా దర్శిల్ మిశ్రా అనే వ్యక్తి వారణాసి-ఢిల్లీ వందే భారత్ రైలులో ఏసీలు పనిచేయక, పైకప్పు నుంచి నీళ్లు కారడంతో చాలా ఇబ్బంది పడ్డారు. చివరికి మొత్తం ప్రయాణం నిలబడే చేయాల్సి వచ్చిందని, టికెట్ డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వాలని కోరుతూ ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎదురవ్వచ్చు. మరి అప్పుడు ఏం చేయాలి? మీ టికెట్ డబ్బులు తిరిగి పొందడానికి టీడీఆర్ ఎలా ఫైల్ చేయాలో, ఏ సందర్భాల్లో మీకు రీఫండ్ వస్తుందో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

టీడీఆర్ అంటే ఏమిటి?
రైలు ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం కలిగితే, దానికి రీఫండ్ పొందడానికి రైల్వేకు తెలియజేసే ప్రక్రియే టీడీఆర్ (Ticket Deposit Receipt). మీరు సరైన సమయంలో టీడీఆర్ ఫైల్ చేస్తే, మీ టికెట్ డబ్బులు మొత్తం లేదా కొంత భాగం తిరిగి వస్తాయి. ఈ టీడీఆర్ ప్రక్రియను ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా పూర్తి చేయవచ్చు. మీరు టీడీఆర్ ఫైల్ చేసిన తర్వాత, మీ విజ్ఞప్తి సంబంధిత రైల్వే జోనల్ ఆఫీస్‌కు వెళ్తుంది. వారు పరిశీలించిన తర్వాత, మీకు రావాల్సిన డబ్బును ఐఆర్‌సీటీసీ మీ అకౌంట్‌లో జమ చేస్తుంది.

Prayanikudu
  • ఏయే సందర్భాల్లో మీరు రీఫండ్ పొందవచ్చు?
  • ఈ కింది పరిస్థితుల్లో టీడీఆర్ ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు.
  • మీరు ప్రయాణించాల్సిన రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తుందని తెలిస్తే, ఆ రైలులో ప్రయాణించలేకపోతే, రీఫండ్ కోసం అప్లై చేయవచ్చు. టికెట్ డబ్బులు మొత్తం రావాలంటే రైలు బయలుదేరే సమయానికి ముందే టీడీఆర్ ఫైల్ చేయాలి.

ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు

  • ఏసీ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకుని, ప్రయాణంలో ఏసీ పని చేయకపోతే మీరు రీఫండ్ కోరవచ్చు. గమ్యస్థానానికి చేరుకున్న 20 గంటల్లోపు టీడీఆర్ ఫైల్ చేయాలి.
  • మీరు బుక్ చేసుకున్న క్లాస్ (ఉదాహరణకు, ఏసీ) కాకుండా తక్కువ క్లాస్‌లో (ఉదాహరణకు, స్లీపర్) ప్రయాణించాల్సి వస్తే, ఆ ప్రయాణం పూర్తయిన రెండు రోజుల్లోపు టీడీఆర్ ఫైల్ చేయాలి.
  • మీరు ప్రయాణించాల్సిన రైలు దారి మళ్లించడం వల్ల మీరు రైలు ఎక్కలేకపోతే, లేదా మీరు దిగాల్సిన స్టేషన్‌కు రైలు చేరకపోతే, 72 గంటల్లోపు టీడీఆర్ ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు.

ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్ 

టీడీఆర్ ఎలా ఫైల్ చేయాలి?

  • మీరు మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్/యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
  • ‘My Account’ సెక్షన్‌లోకి వెళ్లి, అక్కడ ‘My Transactions’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. అందులో మీకు ‘File TDR’ ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీరు టీడీఆర్ ఫైల్ చేయాలనుకుంటున్న పీఎన్ఆర్ నంబర్, టికెట్‌పై ఉన్న పేరును సెలక్ట్ చేసుకోవాలి.
  • ‘File TDR’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని, టీడీఆర్ ఫైల్ చేయడానికి గల కారణాన్ని ఎంచుకోండి.
  • అవసరమైన వివరాలు నింపి, ప్రక్రియను పూర్తి చేయండి.

రీఫండ్ ఎప్పుడు వస్తుంది?
మీ రీఫండ్ ఎంత త్వరగా వస్తుందనేది మీరు టీడీఆర్ ఫైల్ చేసిన కారణంపై ఆధారపడి ఉంటుంది. రైలు రద్దు లేదా ఆలస్యం వంటి స్పష్టమైన కారణాల కోసం, రీఫండ్ సాధారణంగా 5-7 రోజుల్లో మీ ఖాతాలో జమ అవుతుంది. ఇతర కారణాల కోసం, రైల్వే అధికారులు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, రీఫండ్ రావడానికి 30-60 రోజులు పట్టవచ్చు.

 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!