Handicrafts Exhibition : బోనాల ఉత్సవాలు మొదలయ్యాయంటే హైదరాబాద్‌లో సందడే సందడి. ఈ పండుగ వేళ, తెలంగాణ ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై బీసీ చేతి వృత్తుల ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది.
ఈ ప్రదర్శనలో బీసీ కళాకారులు తమ చేతులతో తయారు చేసిన అద్భుతమైన వస్తువులను ప్రదర్శనకు, అమ్మకానికి ఉంచారు.
ఉదయం 10 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని చూసి ఆనందించవచ్చు. ఈ బోనాల వేడుకలకు తిలకించడానికి వచ్చే వాళ్లు ట్యాంక్‌బండ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్ వద్ద జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి ఎంజాయ్ చేయవచ్చు.
- ఇది కూడా చూడండి : దక్షిణ భారతదేశంలో 8 సూపర్ వాటర్‌ఫాల్స్ | Waterfalls In South India
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.