World Police Games లో దేశానికి బంగారు, కాంస్య పతకాలు సాధించిన TTD అధికారులు
World Police Games: ప్రపంచ పోలిస్ గేమ్స్ మీట్లో టీటీడి అధికారులు అదరగొట్టారు. దేశానికి బంగారు, కాంస్య పథకాలు సాధించి దేశానికి గర్వకారణం అయ్యారు తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు.
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో వరల్డ్ పోలిస్ గేమ్ మీట్ జరగగా (World Police and Fire Games 2025 ) ఇందులో టిటిడికి చెందిన అధికారులు తమ సత్తా చాటారు. అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు…
బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీలో 45 ఏళ్లు పైబడిన విభాగంలో సింగిల్ టెన్నిస్ పోటీలు జరగగా అందులో టిటిడి వీజీఓ ఎ సురేంద్ర గోల్డ్ మెడల్ సాధించారు.

- ఇది కూడా చదవండి : వాట్సాప్‌లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback
ఇక 55 ఏళ్లు పైబడిన విభాగంగా సింగిల్ టెన్నిస్ పోటీల్లో ఏజీశో ఏన్టీవీ రామ్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించారు.

9000 మంది అథ్లెట్లు…| World Police Games 2025
తిరుమల తిరుపతి అధికారులు సాధించిన ఈ ఘనత సాధారణమైదేమీ కాదు. మొత్తం 80 దేశాల నుంచి పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అభ్యర్థలతో ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి వర్డ్ పోలిస్ అండ్ ఫైర్ గేమ్స్ నిర్వహిస్తారు. ఈ సారి నిర్వహించిన పోటీల్లో ప్రపంచ స్థాయిలో సుమారు 9000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు.
అయితే ఈ సారి నిర్వహించిన పోటీల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanams) సిబ్బంది పతకాలు సాధించి దేశానికి గర్వకారణం అయ్యారు. ఈ సందర్భంగా టీటీడి చైర్మన్ బీర్ నాయుడు, ఈవీో జే శ్యామలరావు విజేతలను అభినందించారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.