IRCTC : అరకు అందాలను కేవలం రూ.2 వేలతో చూసేయండి.. ఐఆర్సీటీసీ అద్భుతమైన వన్డే టూర్ ప్యాకేజ్!
IRCTC : కొత్త ప్రదేశాలను చూడాలని ఎప్పుడూ అనుకుంటున్నారా? ప్రకృతిని ఆస్వాదించాలని ఉందా..అది కూడా రైలులో వెళ్లాలని అనిపిస్తుందా.. అలాంటి వాళ్ల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పుడూ పర్యాటకుల కోసం సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు, ప్రకృతి అందాలకు నెలవైన అరకు లోయను చూసేందుకు ఒక అద్భుతమైన, తక్కువ బడ్జెట్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా మీరు కేవలం రూ.2000ల బడ్జెట్‌తోనే అరకు ట్రిప్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇది విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది.
వైజాగ్-అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజ్
IRCTC అందించే ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ పేరు విశాఖపట్నం – అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజ్. దీని కోడ్ SCBR09. ఈ ప్యాకేజీ ప్రతిరోజూ వైజాగ్ నుండి అందుబాటులో ఉంటుంది. అంటే, మీరు మీ వీలును బట్టి ఏ రోజుకైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఒక రోజు ప్యాకేజీలో అరకు లోయలోని ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తారు. టూర్ షెడ్యూల్ ఇలా ఉంటుంది.

ఉదయం 6:45 గంటలకు: విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి మీ అరకు ప్రయాణం మొదలవుతుంది. మీరు ట్రైన్ నంబర్ 58501లో ప్రయాణిస్తారు. ఈ రైలు దారిలో 52 సొరంగాలను దాటుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా, 44వ సొరంగం దాటిన తర్వాత బొర్రా గుహల స్టేషన్ వస్తుంది. ఈ రైలు ప్రయాణం మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.
ఉదయం 10:55 గంటలకు: మీరు అరకు లోయకు చేరుకుంటారు. అక్కడ నుండి బస్సులో మిమ్మల్ని ట్రైబల్ మ్యూజియం , పద్మాపురం గార్డెన్స్‌కు తీసుకెళ్తారు.
మధ్యాహ్నం: భోజనం చేసిన తర్వాత, వైజాగ్ తిరిగి ప్రయాణం మొదలవుతుంది.
తిరిగి వెళ్లే దారిలో: మీరు అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్, గాలికొండ వ్యూ పాయింట్లను సందర్శిస్తారు. గాలికొండ అనేది అరకు లోయలో ఉన్న ఎత్తైన ప్రదేశాలలో ఒకటి. దీని ఎత్తు దాదాపు 4320 అడుగులు. ఆ తర్వాత, దేశంలోనే లోతైన సున్నపురాయి గుహలైన బొర్రా గుహలను సందర్శిస్తారు. ఇవి మిలియన్ల సంవత్సరాల నాటివిగా చెబుతారు.
సాయంత్రం: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు తిరిగి చేరుకోవడంతో మీ ఒక రోజు అరకు టూర్ పూర్తవుతుంది.
ప్యాకేజీలో ఉండేవి
రైలు టికెట్లు, అరకులో తిరగడానికి నాన్-ఏసీ బస్సు, ఒక ప్యాక్ చేసిన అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్), అరకులో భోజనం, సాయంత్రం టీ/స్నాక్స్. బొర్రా గుహల ప్రవేశ టికెట్ , ప్రయాణ బీమా కూడా ప్యాకేజీలో కలిసే ఉంటాయి.
ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
అరకు టూర్ ప్యాకేజీ ధరలు
IRCTC ఈ ప్యాకేజీని మూడు రకాల క్లాసులలో అందిస్తోంది. కాబట్టి మీ బడ్జెట్‌కు తగ్గట్టు సెలక్ట్ చేసుకోవచ్చు.
ఈవీ క్లాస్ (ఏసీ కోచ్):
పెద్దలకు: రూ.3010
పిల్లలకు: రూ.2615
స్టాండర్డ్ క్లాస్ (స్లీపర్ క్లాస్):
పెద్దలకు: రూ.2125
పిల్లలకు: రూ.1730
2S క్లాస్ (సెకండ్ సిట్టింగ్):
పెద్దలకు: రూ.2055
పిల్లలకు: రూ.1655
బుక్ చేసుకోండి ఇలా:
ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి లేదా బుక్ చేసుకోవడానికి IRCTC టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ ను సందర్శించవచ్చు. నేరుగా ప్యాకేజీ వివరాలున్న లింక్ https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBR09 పై క్లిక్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. సందేహాలు ఉంటే, మీరు 9281030748 లేదా 9281495847 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.