TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి కొత్త రూల్స్.. నేటి నుంచే అమలు
TTD : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని స్వామి దర్శనానికి భక్తులు రోజుల తరబడి వేచి ఉండటం సర్వసాధారణం. అయితే, ఈ సుదీర్ఘ నిరీక్షణను తగ్గించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు శ్రీవారి ఆఫ్‌లైన్ దర్శన్ టికెట్ల కోసం కొత్త టైమింగ్స్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మార్పుల వల్ల భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది.
ప్రయోగాత్మకంగా, శ్రీవారి ఆఫ్‌లైన్ టికెట్లు కొనుగోలు చేసే భక్తులు ఇప్పుడు సాయంత్రం 4:30 గంటల స్లాట్‌లో స్వామి దర్శనం చేసుకోవచ్చు. గతంలో టికెట్లు పొందిన వారికి ఉదయం 10:00 గంటలకు దర్శన సమయం ఉండేది. ఈ కొత్త టైమింగ్స్ ఆగస్టు 1 నుండి 15 వరకు అమలులో ఉంటాయి. ఈ సమయంలో వచ్చిన అభిప్రాయాలు, ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో శాశ్వత మార్పులు చేసే అవకాశం ఉంది. శ్రీవారి ట్రస్ట్‌కు రూ.10,000 విరాళం ఇచ్చి, అదనంగా రూ.500 చెల్లించి ఆఫ్‌లైన్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ పొందే వారికి ఈ కొత్త టైమింగ్స్ వర్తిస్తాయి.

ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
తిరుమలలోని కౌంటర్లలో రోజూ ఉదయం 10:00 గంటల నుండి శ్రీవారి ఆఫ్‌లైన్ టికెట్లు ఇస్తారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే పద్ధతిలో టికెట్లు లభిస్తాయి. టికెట్లు పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద చేరుకోవాల్సి ఉంటుంది. విమాన ప్రయాణికుల కోసం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 7:00 గంటల నుండి శ్రీవాణి టికెట్లు లభిస్తాయి. ఎయిర్‌పోర్ట్‌లో 200 టికెట్లు, తిరుమలలో 800 టికెట్ల కోటా యథావిధిగా కొనసాగుతుంది.
ఇది కూడా చదవండి : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
అక్టోబర్ 31, 2025 వరకు శ్రీవాణి ఆఫ్‌లైన్ దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారికి పాత నిబంధనల ప్రకారమే ఉదయం 10:00 గంటల స్లాట్ ఉంటుంది. వారు తమ పాత సమయానికే వెళ్లవచ్చు. నవంబర్ 1, 2025 నుండి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకునేవారు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త మార్పుల ద్వారా, శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గి, భక్తులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం లభిస్తుందని టీటీడీ ఆశిస్తోంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.