Indian Railways : రైలులో లగేజ్ తీసుకెళ్తున్నారా? అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే భారీ జరిమానా!
Indian Railways : రైలులో ఇష్టం వచ్చినట్లుగా లగేజీలను తీసుకెళ్లే రోజులకు త్వరలో ముగింపు పలకనున్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో రైల్వేలు కూడా లగేజీ నిబంధనలను తీసుకురాబోతున్నాయి. రైలు ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి, రైల్వే శాఖకు ఆదాయాన్ని పెంచడానికి ఈ కొత్త నియమాలను అమలు చేయనున్నారు. పెద్ద లగేజీలపై అదనపు ఛార్జీలు లేదా జరిమానాలు విధించనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది.
రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు?
భారతీయ రైల్వేస్ చేసిన ప్రతిపాదన ప్రకారం, వివిధ రైలు క్లాస్‌లలో తీసుకెళ్లగల లగేజీ పరిమితులు ఇలా ఉన్నాయి:
ఫస్ట్ క్లాస్ ఏసీ: 70 కిలోల వరకు లగేజీ.
ఏసీ టూ టైర్: 50 కిలోల వరకు.
ఏసీ త్రీ టైర్: 40 కిలోల వరకు.
స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు.
జనరల్ క్లాస్: 35 కిలోల వరకు.

ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
రైల్వే స్టేషన్లలో ఉండే ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మెషిన్లలో ప్రయాణికులు తమ లగేజీ బరువును తనిఖీ చేయించుకోవాలి. నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ లగేజీ ఉంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లగేజీ బరువు తక్కువ ఉన్నా, పరిమాణం పెద్దగా ఉంటే కూడా జరిమానా విధించవచ్చు. అయితే, పరిమాణానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు.
విమానాశ్రయాల్లో లగేజీల పరిమాణం (పొడవు, వెడల్పు, మందం) 158 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఒక వ్యక్తి ఒక హ్యాండ్‌బ్యాగ్, పర్సు, ల్యాప్‌టాప్ వంటి వ్యక్తిగత వస్తువులను అదనపు ఛార్జీలు లేకుండా తీసుకెళ్లవచ్చు. ఇలాంటి నిబంధనలను రైల్వేలు కూడా తీసుకురావచ్చని సమాచారం.
ప్రస్తుత నిబంధనల ప్రకారం కూడా మీరు ఎక్కువ బరువున్న లగేజీని తీసుకెళ్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా రాబోయే నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
రైల్వే స్టేషన్లలో ప్రీమియం ఔట్లెట్లు..
మాల్స్‌లో కనిపించే ప్రీమియం బ్రాండ్ ఔట్లెట్లు ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా అందుబాటులోకి రానున్నాయి. బట్టలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువుల కోసం ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రయాణికులకు ఎక్కువ ఎంపికలు ఇవ్వడానికి, రైల్వేస్‌కు అదనపు ఆదాయం సృష్టించడానికి, రైల్వే స్టేషన్లు మరింత ఆధునికంగా కనిపించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.