Tirumala Temple : రేపటి నుంచి ఆలయాలు బంద్.. మళ్లీ దర్శనం ఎప్పుడంటే?
Tirumala Temple : భక్తులకు అలర్ట్. సెప్టెంబర్ 7న సంభవించే చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలైన తిరుమల శ్రీవారి ఆలయం, యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు మూతబడనున్నాయి. ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ సమయంలో భక్తులకు స్వామి వార్ల దర్శనాలు ఉండవు. కాబట్టి ఆయా ఆలయాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న భక్తులు ఈ మార్పులను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి.
ఖగోళ శాస్త్రం ప్రకారం, చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, ఆదివారం రాత్రి 9:50 గంటలకు ప్రారంభమై, సోమవారం తెల్లవారుజామున 1:31 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం సుమారు 12 గంటల పాటు కొనసాగుతుంది. హిందూ సంప్రదాయాల ప్రకారం, గ్రహణం సమయంలో ఆలయాల ద్వారాలను మూసివేయడం ఆచారం.సెప్టెంబర్ 6, శనివారం రాత్రి 12:00 గంటల నుంచి.. సెప్టెంబర్ 8, సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆలయాలు మూసివేస్తారు.

ఆలయాన్ని తిరిగి తెరిచిన తర్వాత, సుప్రభాతం, పుణ్యాహవచనం వంటి ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే, తోమాల సేవ, అర్చన వంటి కార్యక్రమాలను భక్తులను అనుమతించకుండా ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులకు దర్శనం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. భక్తులకు శ్రీవారి దర్శనం సోమవారం ఉదయం 6:00 గంటల నుంచి పునరుద్ధరించబడుతుంది.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడుతుంది. ఈ ఆలయాన్ని సెప్టెంబర్ 7, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసి, మరుసటి రోజు ఉదయం 3:30 గంటలకు తిరిగి తెరుస్తారు. గ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9:56కి ప్రారంభమై రాత్రి 1:26కి ముగుస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయాన్ని తిరిగి తెరిచిన తర్వాత, సంప్రోక్షణం కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత యథావిధిగా నిత్య కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఈ రెండు ఆలయాలలో కూడా చంద్రగ్రహణం కారణంగా కొన్ని సేవలు రద్దు చేయబడ్డాయి. తిరుమలలో ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటివి రద్దు చేయబడ్డాయి. అదేవిధంగా, అన్న ప్రసాద పంపిణీ కేంద్రాలు కూడా సెప్టెంబర్ 6 సాయంత్రం 3:00 గంటల నుంచి మూసివేయబడతాయి. అన్న ప్రసాద పంపిణీ తిరిగి సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
యాదగిరి గుట్టలో కూడా సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12 గంటల తర్వాత దర్శనం, నిత్య కైంకర్యాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, వాహన పూజలు నిలిపివేయబడతాయి. భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శనం ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
