NAREDCO Property Expo: రామప్ప నుంచి లక్నవరం దాకా.. రియల్ ఎస్టేట్ షోలో మెరిసిన తెలంగాణ టూరిజం
NAREDCO Property Expo: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన 15వ NAREDCO తెలంగాణ ప్రాపర్టీ షోలో తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉండే ఈ ప్రదర్శనలో, పర్యాటక శాఖ స్టాల్ పెట్టడం వెనుక ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన లక్ష్యం ఉంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేవారిని, పర్యాటక రంగంలో కూడా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమే ఈ లక్ష్యం.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు కలిసి ఈ మూడు రోజుల షోను ప్రారంభించారు. అనంతరం వారు టూరిజం స్టాల్‌ను సందర్శించి, రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పర్యాటక రంగం ద్వారానే రాష్ట్ర ఆర్థిక వృద్ధి పెరుగుతుందని స్పష్టం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ పర్యాటక విధానం 2025-2030 ప్రకారం, రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని, తద్వారా 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం గట్టి లక్ష్యంతో ఉందని వారు తెలిపారు.

ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్, రాష్ట్రంలోని చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించింది. ఈ స్టాల్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాల అందమైన ఫోటోలను ప్రదర్శించారు. వాటిలో యునెస్కో రామప్ప దేవాలయం, ద్వీపాలతో కూడిన లక్నవరం సరస్సు, బౌద్ధ చరిత్రను తెలిపే నాగార్జున సాగర్ బుద్ధవనం, చారిత్రక భువనగిరి కోట, సోమశిల, అలాగే కవ్వాల్, అమ్రాబాద్ వంటి పులుల అభయారణ్యాల ఫోటోలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన ద్వారా అడ్వెంచర్ టూరిజం, ఆధ్యాత్మిక, ఎకో-టూరిజం వంటి రంగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని స్పష్టమైంది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పెట్టుబడిదారులు అందరూ తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి ఈ స్టాల్ ఒక మంచి వేదికగా నిలిచింది.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు

ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.