నవంబర్ నెలలో తిరుమల విశేష పర్వదినాలు ఇవే | Tirumala Events in November 2025
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateshwara) కొలువై ఉన్న పవిత్ర తిరుమలలో ప్రతీ నెల కొన్ని ప్రత్యేక ఆధ్మాత్మిక కార్యక్రమాలు జరుగడం భక్తులకు తెలిసిందే. స్వామి వారి భక్తుల కోసం 2025 నవంబర్ నెలలో జరిగే (Tirumala Events in November 2025) కార్యక్రమాలేంటో ఈ పోస్టులో అందిస్తున్నాము. నవంబర్ నెలలో ఏకాదశి కార్యక్రమాలతో పాటు ఆళ్వార్ ఉత్సవాలు…ఇలా ఎన్నో విశేష పర్వదినాలు ఇవే..
(Explore the official list of Tirumala November 2025 festivals and sevas as released by TTD (Tirumala Tirupati Devasthanams)
నవంబర్ నెలలో తిరుమల విశేషాలు | Tirumala Special Days in November 2025
నవంబర్ 1: ప్రబోధినీ ఏకాదశీ, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం…ఈ రోజు పరమ విశ్రాంతి అనంతరం శ్రీ మహావిష్ణువు (Lord Vishnu) మేల్కొనే పవిత్రమైన రోజు.
- ఇది కూడా చదవండి : వాట్సాప్‌లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback
నవంబర్ 2: కైశిక ద్వాదశి ఆస్థానం , చాతుర్మాస దీక్ష సమాప్తి సందర్భం. అంటే చాతుర్మాస వ్రతం ముగింపు సందర్భంగా జరిగే భక్తి ఉత్సవం అన్నమాట.
నవంబర్ 5: కార్తీక పౌర్ణమి గరుడ సేవ — భక్తులు ఎంతో భక్తితో ఆతృతగా ఎదురుచూసే ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటార. ఈ రోజన శ్రీ మలయప్ప స్వామివారు (Malayappa Swamy) గరుడ వాహనంపై ఊరేగుతారు.
నవంబర్ 9: కార్తీక వన భోజనం — భక్తులు అరణ్యంలో సత్సంగంగా భోజనం చేస్తూ, పవిత్రమైన మనసుతో ఆధ్యాత్మికతతో గడుపుతారు.
నవంబర్ 15: సర్వ ఏకాదశి — ఉపవాసం, విష్ణు పూజలతో జరుపుకునే పవిత్రమైన రోజు ఈ రోజు..
నవంబర్ 17: ధన్వంతరి జయంతి — దేవ వైద్యుడు ధన్వంతరిని స్మరించుకునే రోజు. ఆయుర్వేద జ్ఞానాన్ని ప్రపంచానికి అందించనందుకుగాను ఆయనకు కృతజ్ఞతగా ఈ వేడుక జరుపుతారు.
నవంబర్ 18: మాస శివరాత్రి — ఈ రోజున తిరుమల ఆలయాల్లో శివుడికి (Lord Shiva) ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. చాలా మంది భక్తులు పాల్గొంటారు..
నవంబర్ 25: తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం ఆరంభం — ఈ రోజుతో శ్రీ మహా విష్ణువు భక్తుడైన తిరుమంగై ఆళ్వార్ గారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
తిరుమల ప్రతీ రోజు ఆధ్యాత్మిక శోభతో విరభూస్తూ, దైవన్నామ స్మరణతో భక్త జనసందోహంతో కలకలలాడుతూ ఉంటుంది. అదే విధంగా నవంబర్ నెలలో కూడా తిరుమలలో కూడా అదే వైభవాన్ని భక్తులు వీక్షించవచ్చు. అదే దైవబలాన్ని అనుభూతి చెందవచ్చు . ఈ నెలలో తిరుమల దర్శనం (Tiruamal Darshan)చేసుకున్న భక్తులు కొండల మధ్య ప్రశాంతతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు. అనుభవించవచ్చు.
🛕 ఈ నవంబర్‌లో తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోండి — భక్తి, దైవానుభూతి లో మునిగిపోండి! తెలుగురాష్ట్రాలతో పాటు భారత దేశంలోని (Low Cost Travel Packages In Telugu ) ఇతర పవిత్ర క్షేత్రాల దర్శనం కోసం తక్కువ ధరలో ప్యాకేజీల కోసం ప్రయాణికుడు వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయండి.
🗣️ తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్‌లో పొందుపరిచిన వివరాలు సమాచార నిమిత్తమే. ట్రావెల్ ప్యాకేజీలు, ధరలు, బుకింగ్ సంబంధిత వ్యవహారాలు పూర్తిగా ట్రావెల్ ఏజెన్సీ సంస్థల ఆధీనంలో ఉంటాయి. గమించగలరు
⚠️ Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. We Earn Small commission on bookings. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
