Flight Ticket Cancellation : ఫ్లైట్ టిక్కెట్ క్యాన్సిలేషన్ చేస్తున్నారా అయితే గుడ్ న్యూస్.. ఇక హిడెన్ చార్జీలకు చెక్
Flight Ticket Cancellation : విమాన ప్రయాణం కోసం టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) శుభవార్త అందించింది. టిక్కెట్ల రద్దు(Cancellation), రీఫండ్(Refund) ప్రక్రియలను మరింత సులభతరం, వేగవంతం, పారదర్శకంగా చేయడానికి కొత్త నిబంధనలను తీసుకురావాలని డీజీసీఏ యోచిస్తోంది. ముఖ్యంగా విమాన టిక్కెట్ బుక్ చేసిన తర్వాత 48 గంటల్లో ఉచితంగా రద్దు చేసుకునే వెసులుబాటు, రీఫండ్ ఆలస్యాన్ని తగ్గించడం ఈ కొత్త నిబంధనల(CAR – Civil Aviation Requirements) ప్రధాన లక్ష్యాలు. ఈ మార్పులు అమలులోకి వస్తే, ప్రయాణికులు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.
48 గంటల్లో ఉచిత క్యాన్సిలేషన్ లేదా మార్పు
డీజీసీఏ ప్రతిపాదించిన కొత్త సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్‌లో ప్రయాణికులకు అత్యంత ప్రయోజనం కలిగించే అంశం ఉచిత రద్దు సదుపాయం. ఫ్లైట్ టిక్కెట్‌ను బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లోపు రద్దు చేసుకుంటే లేదా మార్పు చేసుకుంటే, ఎయిర్‌లైన్స్ ఎటువంటి అదనపు రుసుము (Additional Charge) వసూలు చేయకూడదు. ఒకవేళ ప్రయాణికుడు కొత్త ఫ్లైట్‌ను ఎంచుకుంటే, ఆ టిక్కెట్ ధర మాత్రమే ఎక్కువగా ఉంటే అదనపు చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, డొమెస్టిక్ ఫ్లైట్‌ను బయలుదేరడానికి 5 రోజుల్లోపు లేదా అంతర్జాతీయ ఫ్లైట్‌ను 15 రోజుల్లోపు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ ఉచిత రద్దు నిబంధన వర్తించదు. 48 గంటల తర్వాత సాధారణ క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి.

ఫాస్ట్ రీఫండ్, ఛార్జీల తొలగింపు
కొత్త నిబంధనల ప్రకారం, రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ఎయిర్‌లైన్స్ హిడెన్ ఛార్జీలు వసూలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలి. టిక్కెట్ రద్దు అయిన తర్వాత లేదా నో-షో అయిన తర్వాత కూడా, రీఫండ్ ప్రక్రియను 21 పని దినాలలోపు (21 Working Days) పూర్తి చేయాలని డీజీసీఏ ప్రతిపాదించింది.
విమానం రద్దు అయినా లేదా ప్రయాణికుడు నో-షో అయినా, ఎయిర్‌లైన్స్ తప్పనిసరిగా చట్టబద్ధమైన పన్నులు (Statutory Taxes), ఎయిర్పోర్ట్ ఫీజులు మొత్తాన్ని ప్రయాణికుడికి రీఫండ్ చేయాలి. వీటిలో ఎటువంటి కోతలు ఉండకూడదు. టిక్కెట్ బుక్ చేసిన 24 గంటలలోపు చిన్నపాటి పేరు మార్పు (Name Correction) అవసరమైతే, ఎయిర్‌లైన్స్ అదనపు రుసుము విధించకూడదు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ఏజెంట్లు, మెడికల్ క్యాన్సిలేషన్‌పై న్యాయమైన రూల్స్
ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసిన టిక్కెట్ల రీఫండ్ బాధ్యత, మెడికల్ ఎమర్జెన్సీలో రద్దుపై కూడా కొత్త, న్యాయమైన నియమాలు రూపొందించారు. ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసిన టిక్కెట్లకు సంబంధించిన రీఫండ్ మొత్తాన్ని ప్రయాణికుడికి చేర్చడానికి ఎయిర్‌లైన్స్ పూర్తి బాధ్యత వహించాలి. వైద్య అత్యవసర పరిస్థితి (Medical Emergency) కారణంగా టిక్కెట్‌ను రద్దు చేస్తే, ప్రయాణికుడు అంగీకరిస్తేనే క్రెడిట్ షెల్ (Credit Shell) ను ఇవ్వాలి. క్రెడిట్ షెల్ తీసుకోవాలని ప్రయాణికుడిపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడి తీసుకురాకూడదు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
డీజీసీఏ ప్రస్తుతం ఈ కొత్త CAR (సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్) పై అభిప్రాయాలను కోరుతోంది. నవంబర్ 30 వరకు వాటాదారులు (Stakeholders) తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఈ నియమాలు త్వరలో అమలులోకి వస్తే, టిక్కెట్ రద్దు సమస్యలు, ఆలస్యం, అదనపు ఛార్జీలు వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.

టూర్ ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ ధరలో మెరుగైన ప్యాకేజీ కావాలంటే వాట్సాప్‌లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి హిమాలయాల వరకు…కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పలు ఆప్షన్స్ అందిస్తాము.


తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.

Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
