IRCTC : ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతో మలేషియా-సింగపూర్ టూర్ ప్యాకేజీ
IRCTC : విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) హైదరాబాద్ ప్రయాణికుల కోసం ఒక అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. ఆగ్నేయాసియాలోని రెండు అందమైన దేశాలైన మలేషియా (Malaysia), సింగపూర్ (Singapore)లలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
టూర్ వివరాలు: తేదీ, ధర
ఈ విదేశీ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 11న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలవుతుంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. తిరిగి డిసెంబర్ 17న హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ విమానయానం ద్వారా ప్రయాణించే టూర్ ప్యాకేజీ ధర సుమారు ₹1.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మలేషియా పర్యటన (మొదటి 3 రోజులు)
మొదటి రోజు (Day 1): హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకుంటారు. మధ్యాహ్నం విశ్రాంతి తర్వాత, ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్, ప్రసిద్ధ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు.
రెండవ రోజు (Day 2): ఉదయం బటు గుహలు (Batu Caves) సందర్శించి, మధ్యాహ్నం చల్లని వాతావరణం ఉండే గెంటింగ్ హైలాండ్స్ (Genting Highlands) కు వెళ్తారు.
మూడవ రోజు (Day 3): ఉదయం పుత్రజయ (Putrajaya) లోని అందమైన ప్రదేశాలు చూసి, మధ్యాహ్నం భోజనం తర్వాత రోడ్డు మార్గంలో సింగపూర్‌కు బయలుదేరతారు.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
సింగపూర్ పర్యటన (చివరి 3 రోజులు)
నాలుగవ రోజు (Day 4): ఉదయం ఆర్చిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్ (Merlion Park), సింగపూర్ ఫ్లైయర్ రైడ్ తీసుకుంటారు. మధ్యాహ్నం కేబుల్ కార్ ద్వారా సెంటోసా ద్వీపం (Sentosa) చేరుకుంటారు. అక్కడ మేడమ్ టుస్సాడ్స్, ప్రసిద్ధ వింగ్స్ ఆఫ్ టైమ్ షోలను చూస్తారు.
ఐదవ రోజు (Day 5): పూర్తి రోజును ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) లో గడుపుతారు. ఆ తరువాత, అందమైన గార్డెన్స్ బై ది బే (Gardens by the Bay) లోని డోమ్స్ ను సందర్శిస్తారు.
ఆరవ రోజు (Day 6): ఉదయం బర్డ్ ప్యారడైజ్ చూసి, మధ్యాహ్నం షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాత్రి 8 గంటలకు సింగపూర్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి అదే రోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ముఖ్య గమనిక
ఈ విదేశీ టూర్‌కు వెళ్లాలనుకునేవారికి తప్పనిసరిగా వ్యాలిడ్ పాస్‌పోర్ట్ ఉండాలి. అలాగే వీసా ప్రాసెసింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
