Hyderabad : బీచ్ కల నిజమవుతోంది.. రూ.225 కోట్ల భారీ ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌ను మార్చబోతున్న తెలంగాణ ప్రభుత్వం

Hyderabad : హైదరాబాద్‌కి సముద్రాన్ని తెప్పిస్తా అని ఆపరేషన్ దుర్యోదన సినిమాలో శ్రీకాంత్ చెప్పిన డైలాగ్ గుర్తుందా.. ఇకపై సెటైర్ కాదు, నిజం కాబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేందుకు ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో సముద్ర తీరం (Sea Coast) లేదనే లోటును భర్తీ చేసేందుకు, హైదరాబాద్ శివార్లలో అతిపెద్ద కృత్రిమ బీచ్‌ను (Artificial Beach) ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన పనులు డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. మరి ఈ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టు వివరాలు, లక్ష్యాలు ఏంటో చూద్దాం.

కొత్వాల్ గూడ వద్ద బీచ్ ప్లాన్
హైదరాబాద్ నగరానికి అద్భుతమైన వాతావరణం, అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కానీ, సముద్రం లేదు అనే లోటు ఎప్పుడూ ఉండేది. ఈ కారణంగానే చాలా మంది వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యలంక వంటి బీచ్‌ల వైపు వెళ్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ, ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న కొత్వాల్ గూడ ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద కృత్రిమ సరస్సును నిర్మించి, దాని చుట్టూ ఈ బీచ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.225 కోట్లతో పనులను డిసెంబర్ 2025 లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్‌ను పీపీపీ (ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యం) మోడల్ ద్వారా నిర్మించనుంది.

Prayanikudu

ఇది సాధ్యమేనా?
కొంతమందికి ఇది సాధ్యమయ్యే పనేనా అని అనిపించవచ్చు. కానీ, ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికే కృత్రిమ బీచ్‌లను విజయవంతంగా ఏర్పాటు చేశాయి. అలలు కూడా వచ్చేలా టెక్నాలజీని ఉపయోగించాయి. రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గతంలో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధమైందని, అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో పనులు ప్రారంభించిన తర్వాత వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి :  షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?

బీచ్‌లో ఉండే ప్రత్యేక సౌకర్యాలు
ఈ కృత్రిమ బీచ్ కేవలం సరస్సు మాత్రమే కాదు, అన్ని రకాల వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. వీకెండ్‌లో మొత్తం కుటుంబం వెళ్లి ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశారు. స్టార్ హోటళ్లు, వాటర్ స్పోర్ట్స్, వేవ్ పూల్, సెయిలింగ్ క్లబ్‌లు, ఫ్లోటింగ్ విల్లాస్. బంగీ జంప్, స్కేట్ బోర్డ్, సాహస కార్యకలాపాలు, శీతాకాల క్రీడల వేదికలు.పార్కులు, జాగింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ జోన్‌లు, అలంకార ఫౌంటైన్‌లు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు.

ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు

పర్యాటక రంగంపై ప్రభావం
ఈ కృత్రిమ బీచ్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా రూపొందుతుంది. హైదరాబాద్‌ను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణలో పర్యాటక రంగానికి అపార అవకాశాలు ఉన్నాయి, ఈ రంగం రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బీచ్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌కు ఒక గొప్ప పర్యాటక గమ్యస్థానంగా గుర్తింపు తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

✈️

 టూర్ ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ ధరలో మెరుగైన ప్యాకేజీ కావాలంటే వాట్సాప్‌లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి హిమాలయాల వరకు…కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పలు ఆప్షన్స్ అందిస్తాము. 

👇

💬 Chat on WhatsApp
🗣️

 తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.

⚠️

 Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.

 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!