Hyderabad : హైదరాబాద్‌కు 2-3 గంటల్లో చేరుకునే 5 అద్భుతమైన పర్యాటక స్థలాలు ఇవే
Hyderabad : సెలవుల వేళ లేదా వారాంతంలో హైదరాబాద్ నగరంలోనే ఉండిపోయిన వారికి అద్భుతమైన వన్-డే ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. నగరానికి కేవలం 150 కి.మీ. దూరంలో, 2-3 గంటల ప్రయాణంలో చేరుకోగలిగే ఐదు ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. చల్లని వాతావరణంలో ప్రకృతి అందాలను, చారిత్రక కట్టడాలను ఆస్వాదించడానికి ఇవి సరైన ప్రదేశాలు.
కోయిల్‌సాగర్ (Koilsagar) – మహబూబ్‌నగర్ జిల్లా (140 కి.మీ.)
మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కోయిల్ సాగర్ కు వెళ్లేందుకు ప్రయాణ సమయం సుమారు 3 గంటలు. చల్లని గాలులు, కొండలు, పచ్చని పొలాల మధ్య ప్రయాణిస్తూ చేరుకోగలిగే ఈ కోయిల్‌సాగర్ రిజర్వాయర్ చలికాలంలో ఒక మంచి పర్యాటక కేంద్రం. పిక్నిక్లు, ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటి వాటికి ప్రసిద్ధి. ఇక్కడి ప్రశాంత వాతావరణంలో కొంత సమయం గడపవచ్చు.

రాచకొండ కోట (Rachakonda Fort) – యాదాద్రి భువనగిరి జిల్లా (70 కి.మీ.)
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాచకొండ కోటకు వెళ్లేందుకు సుమారు సుమారు 1.5 నుండి 2 గంటలు పడుతుంది. 14వ శతాబ్దానికి చెందిన ఈ కొండపై కోట చరిత్ర ప్రేమికులకు ఒక స్వర్గం. ఒక రోజులో వెళ్లి తిరిగి వచ్చేందుకు ఇది ఉత్తమమైన ప్రదేశం. శతాబ్దాల నాటి శిధిలాలను అన్వేషించవచ్చు. చుట్టూ ఉన్న సహజ దృశ్యాలను వీక్షించి ఆనందించవచ్చు.
ఇది కూడా చదవండి : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
అనంతగిరి కొండలు (Ananthagiri Hills) – వికారాబాద్ జిల్లా (80 కి.మీ.)
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు చాలా ఫేమస్. ఇక్కడికి వెళ్లేందుకు సుమారు 2గంటలు పడుతుంది.హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న ఈ కొండలు వీకెండ్ విహారయాత్రలకు చాలా అనుకూలం. వేసవి, వర్షాకాలం, చలికాలం ఏదైనా ఈ ప్రదేశం ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటుంది. పచ్చని అడవుల్లో ట్రెక్కింగ్ చేయడం ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. ప్రశాంతత కోరుకునేవారికి ఇది సరైన ప్లేస్.

పోచారం వన్యప్రాణుల అభయారణ్యం (Pocharam Wildlife Sanctuary) – మెదక్ జిల్లా (110 కి.మీ.)
ఇక్కడికి వెళ్లాలంటే సుమారు 2.5 గంటలు సమయం పడుతుంది. మెదక్‌లో ఉన్న ఈ అభయారణ్యం చలికాలంలో మరింత ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. చల్లని వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలను అన్వేషించవచ్చు. వలస పక్షులను చూసే అవకాశం కూడా ఉంది.
ఇది కూడా చదవండి : సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
ఖిల్లా ఘనపూర్ (Qilla Ghanpur) – మహబూబ్‌నగర్ జిల్లా (116 కి.మీ.)
హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఖిల్లా ఘనపూర్ సుమారు 116కిమీ దూరంలో ఉంటుంది. వెళ్లడానికి కనీసం సుమారు 2.5 నుండి 3 గంటలు పడుతుంది. మహబూబ్‌నగర్‌కు సమీపంలో ఉన్న ఖిల్లా ఘనపూర్ తెలంగాణలోని అత్యంత రహస్యమైన ప్రదేశాలలో ఒకటి. ఇది కాకతీయులు నిర్మించిన 13వ శతాబ్దపు కొండ కోట. ఇక్కడ రాతి శిల్పాలు, పాత ఫిరంగులు మరియు ప్యాలెస్‌ల శిథిలాలను చూడవచ్చు. కోట పైకి వెళ్లడానికి సుమారు 2 గంటలు పడుతుంది. ఘనపూర్ సరస్సును కూడా వీక్షించవచ్చు. రాక్ క్లైంబింగ్ మరియు రాపెల్లింగ్ వంటి సాహస కార్యకలాపాలు ఇక్కడ చేయవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
