సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తున్నారా? పార్కింగ్, ఎంట్రీ ఇదే రైట్ సైడ్! | Secunderabad Railway Station Parking Entry Guide
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవెలెప్మెంట్ వర్క్స్ వల్ల పార్కింగ్. ఎంట్రీ, పికప్ డ్రాప్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందా ? (secunderabad Railway Station Parking & Entry Guide) ఫ్యామిలీస్ అండ్ సీనియర్ సిటిజన్ కోసం సింపుల్ ట్రావెల్ గైడ్ ఇదే
Secunderabad Railway Station Parking & Entry Guide : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవెలెప్మెంట్ వర్క్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్లాట్‌ఫామ్ నెం.1 క్లోజ్ అయింది ప్లాట్ ఫామ్ నెం.10 బెస్ట్ అని తెలుసుకోండి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇప్పుడు రీడెవలప్మెంట్ (Redevelopment Works) పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ వర్క్స్ వల్ల పార్కింగ్ (Parking), పికప్–డ్రాప్ (Pickup & Drop), ఎంట్రీ సైడ్ (Entry Side) గురించి కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది.
మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో (Families), సీనియర్ సిటిజెన్లతో (Senior Citizens) వెళ్లేవారికి ఈ విషయంలో కొన్ని సందేహాలు ఉండవచ్చు. ఈ షార్ట్ గైడ్ (Short Travel Guide) మీ ప్రయాణాన్ని స్మూత్‌గా ఉంచేందుకు, డౌట్స్ క్లియర్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
- ఇది కూడా చదవండి : సంక్రాంతికి ట్రైన్ టికెట్ల గురించి వర్రీ అవుతున్నారా ? అదనపు స్పెషల్ ట్రైన్లు ప్రకటించిన South Central Railway
ముఖ్యాంశాలు
పార్కింగ్ గురించి | Parking Reality Check
మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Railway Station) వెళ్లే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.
ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై అధికారులు తాజాగా అందించిన అప్డేట్స్ ఇవి.
- ప్లాట్‌ఫామ్ నెం.1 సైడ్ పార్కింగ్ అనేది తాత్కలికంగా (Temporary) మూసివేశారు.
- అక్కడ పికప్ & డ్రాప్ (Pickup and Drop) మాత్రమే జరుగుతాయి. అది కూడా చాలా తక్కువ టైమ్ (Very Short Duration) లో.
- వెహికల్ని ఎక్కువ సేపు పార్క్ చేస్తే ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
- ఇది కూడా చదవండి :రైల్వే ప్రయాణికులకు అలెర్ట్… ఈ లిమిట్ దాటితే లగేజీని కోచులోకి తీసుకెళ్లనివ్వరు |
దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ | Practical Solution
- ప్లాట్‌ఫామ్ నెం.10 వైపు ఉన్న పార్కింగ్ వినియోగించండి.
- ప్రస్తుతం అదే మెయిన్ పార్కింగ్ జోన్ (Main Parking Zone) గా పని చేస్తోంది.
స్టేషన్లో ఎంట్రీ ఎక్కడ బెటర్? | Station Entry – Which Side is Better?

ముందుగా మీరు ఏ పర్పస్ (Purpose) తో రైల్వే స్టేషన్ వెళ్తున్నారో డిసైడ్ అవ్వండి:
- ట్రైన్ ఎక్కడానికి లేదా దిగడానికి (Boarding / De-boarding)
- కుటుంబ సభ్యులను డ్రాప్ చేయడానికి (Family Drop)
- లగేజ్‌తో ప్రయాణిస్తే (With Heavy Luggage)
👉 ప్లాట్‌ఫామ్ నెం.10 సైడ్ ఎంట్రీ సులభం, సౌకర్యవంతంగా (Convenient) ఉంటుంది.
- ఇక్కడ క్లియర్ డైరెక్షన్ బోర్డులు (Clear Signage) ఉంటాయి.
- పబ్లిక్ అనౌన్స్మెంట్స్ (Public Announcements) కూడా రెగ్యులర్‌గా జరుగుతుంటాయి.
- ఇది కూడా చదవండి : టికెట్ Confirm లేదా Waiting అనేది 10 గంటల ముందే తెలుస్తుంది | Railway Ticket Chart
ఫ్యామిలీస్ సీనియర్ సిటిజెన్లకు టిప్స్ | Families & Senior Citizens Tips
- ఇక్కడే కాదు, ఏ రైల్వే స్టేషన్‌కు అయినా లాస్ట్ మినిట్ రష్ (Last-minute Rush) అవాయిడ్ చేయండి.
- లిఫ్ట్ / ర్యాంప్ (Lift / Ramp) అవసరమైతే స్టేషన్ సిబ్బందిని అడగండి.
- క్యాబ్ లేదా ఆటో డ్రైవర్‌కి క్లియర్‌గా
“ప్లాట్‌ఫామ్ నెం.10 సైడ్ డ్రాప్” అని చెప్పండి. - పది నిమిషాల్లో వెళ్లాలి అని డ్రైవర్‌ను హర్రీ చేయడం ప్రమాదకరం (Risky) కావచ్చు.
📍దూరం సమాచారం | Distance Guide (Approx) –
- Secunderabad Bus Station → Platform 10 side: ~1.5 km
- Paradise Circle → Platform 10 side: ~2 km
- Begumpet → Secunderabad Station: ~5 km
(Traffic & redevelopment works బట్టి టైమ్ మారవచ్చు )
ప్రయాణికుడు ట్రావెల్ టిప్స్ | Prayanikudu Travel Tip
సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పుడు ఒక పునర్నిర్మాణంలో ఉన్న ట్రావెల్ హబ్ (Redevelopment Phase Travel Hub). కాబట్టి…
- ముందుగా ప్లాన్ చేసుకుంటే మీకు స్ట్రెస్ ఉండదు
- రైట్ సైడ్ ఎంట్రీ (Right Entry Side) ఎంచుకుంటే స్మూత్‌గా రైలు ఎక్కేయవచ్చు
ఈ డెవలప్మెంట్ పనులు (Station Redevelopment) పూర్తయ్యాక స్టేషన్ ఇంకా బెటర్ అవుతుంది.
అప్పటి వరకు, ఈ చిన్న చిన్న మార్పులు గుర్తుపెట్టుకుంటే మీ జర్నీ ఈజీగా (Easy & Hassle-free) ఉంటుంది.👉 మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
