IRCTC :రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక తత్కాల్ టికెట్ కన్ఫాం కాకుంటే 3 రెట్లు డబ్బు వాపస్

షేర్ చేయండి

IRCTC : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్యలలో తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే టెన్షనే ప్రధానమైనది. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, తత్కాల్ టికెట్ల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియక చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఐఆర్‌సీటీసీ (IRCTC) ఆమోదించిన ప్లాట్‌ఫారమ్ రెడ్‌రైల్ (redRail) ఒక కొత్త సర్వీసును ప్రారంభించింది. అదే ‘సీట్ గ్యారెంటీ’ (Seat Guarantee) పథకం. దీని ప్రకారం, ఒకవేళ మీ తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, మీరు కట్టిన డబ్బుకు మూడు రెట్లు ఎక్కువ తిరిగి చెల్లిస్తారు! రైలు టికెటింగ్ రంగంలో ఇది ఒక కొత్త రికార్డు సృష్టించింది.

‘సీట్ గ్యారెంటీ’ ఎలా పని చేస్తుంది? వాపసు ఎలా వస్తుంది?
రెడ్‌రైల్ అందించే ఈ ‘సీట్ గ్యారెంటీ’ పథకం ప్రకారం.. మీ తత్కాల్ టికెట్ వెయిట్‌లిస్ట్‌లో (Waitlisted) ఉండి, చివరికి కన్ఫర్మ్ కాకపోతే మీకు రెండు రకాలుగా డబ్బులు తిరిగి వస్తాయి. మీరు టికెట్ కోసం చెల్లించిన మొత్తం డబ్బు తిరిగి ఇస్తారు. టికెట్ ధరలో రెట్టింపు మొత్తాన్ని వోచర్ల రూపంలో ఇస్తారు. ఈ వోచర్లను రెడ్‌రైల్ లేదా రెడ్‌బస్ (redBus) ప్లాట్‌ఫారమ్‌లలో వాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts

ఈ పథకం ఎంపిక చేసిన రైళ్లలో వెయిట్‌లిస్టెడ్ తత్కాల్ టికెట్లు బుక్ చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి ఐఆర్‌సీటీసీ సాధారణ తత్కాల్ ధర కంటే కొంత అదనపు ఛార్జ్ (extra charge) ఉంటుంది.

Prayanikudu

తత్కాల్ బుకింగ్‌ల రద్దీ – ఎందుకు ఈ కొత్త ఫీచర్?
తత్కాల్ టికెటింగ్ అనేది భారతీయ రైలు ప్రయాణికులకు చాలా ఒత్తిడితో కూడుకున్న పని. డిమాండ్ ఎక్కువగా ఉండటం, టికెట్ల సరఫరా తక్కువగా ఉండటం వల్ల కన్ఫర్మ్ అయిన టికెట్లు దొరకడం చాలా కష్టం. ఐఆర్‌సీటీసీ గణాంకాల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక గంటలో అత్యధికంగా 1,85,513 తత్కాల్ టికెట్లు బుక్ అయ్యాయి. ఇది తత్కాల్ బుకింగ్‌ల సంఖ్యను, వాటిపై ఉన్న పోటీని స్పష్టం చేస్తుంది.

ప్రయాణికులు వెయిట్‌లిస్ట్ సమస్యల వల్ల ప్రయాణం సాధ్యం కాకపోతే, వారికి ఒక ప్రత్యామ్నాయంగా ఈ రెడ్‌రైల్ కొత్త ఫీచర్ రూపొందించబడింది. ఈ ఫీచర్ దక్షిణాది రాష్ట్రాల్లో (South India) మంచి ఆదరణ పొందిందని, ఆ తర్వాత పశ్చిమ ప్రాంతాల్లో (Western regions) కూడా దీనికి మంచి స్పందన లభించిందని రెడ్‌రైల్ తెలిపింది. ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన రైలు మార్గాల్లో (select routes) మాత్రమే అందుబాటులో ఉంది. ఇది సాధారణ కోటా బుకింగ్‌లకు ఇప్పటికే ఉన్న ‘సీట్ గ్యారెంటీ’కి అదనంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts

నమ్మకాన్ని పెంచడమే లక్ష్యం
రెడ్‌బస్ సీఈఓ (CEO) ప్రకాష్ సంగం (Prakash Sangam) మాట్లాడుతూ.. “భారతీయ రైలు ప్రయాణికుల ప్రయాణంలో తత్కాల్ బుకింగ్ అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న క్షణం. తక్కువ సమయం ఉంటుంది. టికెట్లు తక్కువ ఉంటాయి. వెయిట్‌లిస్టెడ్ తత్కాల్ టికెట్లకు కన్ఫర్మేషన్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. వినియోగదారులు టికెట్లు బుక్ చేయాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు అభద్రతాభావం వల్ల వెనుకాడుతుంటారు. అందుకే ‘తత్కాల్ టికెట్ల కోసం సీట్ గ్యారెంటీ’ని రూపొందించాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ఇది చివరి నిమిషం రైలు ప్రయాణంలో నమ్మకాన్ని పెంచడానికి రూపొందించబడిన ఒక సాంకేతిక పరిష్కారం” అని అన్నారు.

ఈ ఫీచర్‌ను ఎంచుకున్న చాలా మంది వినియోగదారులు చివరికి కన్ఫర్మ్ అయిన టికెట్లతో ప్రయాణించారని కంపెనీ తెలిపింది. కన్ఫర్మ్ కాని వారికి, తిరిగి వచ్చిన డబ్బులు, వోచర్లు త్వరగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి సహాయపడ్డాయని వెల్లడించింది.

 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!