గాలిలో పతంగులు, ప్లేటులో పిండివంటలు | 7 Sankranti Destinations in Andhra Pradesh
కోనసీమ, రాజమండ్రి, విజయవాడ ఇలా 7 Sankranti Destinations in Andhra Pradesh గైడ్లో సంక్రాంతి ఏ జిల్లాకు వెళ్తే కంప్లీట్ వైబ్‌ను ఫీల్ అవ్వగలరో మీకోసం…
కోనసీమ, రాజమండ్రి, విజయవాడ ఇలా 7 Sankranti Destinations in Andhra Pradeshగైడ్లో సంక్రాంతి ఏ జిల్లాకు వెళ్తే కంప్లీట్ వైబ్‌ను ఫీల్ అవ్వగలరో మీకోసం…
సంక్రాంతి అంటేనే నింగీ నేలా అన్ని వైపులా రంగులు… ప్రతి ముఖంపై వెలిగే చిరునవ్వులు. ఆకాశాన్ని ఏలే గాలిపటాలు, ఎండ్ల బండి రేసులు, ఫోక్ డ్యాన్సులు, జాతరలు – ఇవన్నీ కలిపి కంప్లీట్ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసే పండగే సంక్రాంతి.
ఈ సమయంలో ఆలయాలు, నదులు, స్థానిక వెరైటీ వంటకాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ సంక్రాంతి, ఈ బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్స్ విజిట్ చేసి ఫెస్టివల్ ఎక్స్‌పీరియెన్స్‌ను మిస్ అవ్వకండి.
ముఖ్యాంశాలు
1.కోనసీమ్ | Konaseema (Godavari)
తెలుగు రాష్ట్రాల్లో ట్రెడిషనల్ సంక్రాంతి (Sankranti In Kosaseema) అంటే ముందుగా గుర్తుకు వస్తేది కోనసీమే. ఇక్కడి గ్రీన్ బ్యాక్ వాటర్స్, గ్రామీణ వాతావరణం ఇవన్నీ మనసులను ఊరటనిస్తాయి. స్థానికంగా తయారు చేసే మిఠాయిలు, చిన్న చిన్న గ్రామాల్లో ట్రెడిషనల్ వేడుకలు – వీటిని తప్పకుండా ట్రై చేయండి. ఫోటో లవర్స్‌కు ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి స్పాట్.
2. విజయవాడ | Vijayawada
విజయవాడ సంక్రాంతికి (Sankranti In Vijayawada ) పుల్ జోష్‌లో ఫుల్ కలర్ఫుల్గా మారిపోతుంది. కృష్ణా నది తీరాల్లో రంగు రంగుల గాలిపటాలు ఆకాశాన్ని ముద్దాడతాయి. వీధుల్లో ఎక్కడ చూసినా ఇంద్రధనస్సును తెగ్గొట్టే ముగ్గులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అరిసెలు, బొబ్బట్లు, పిండివంటలు తప్పకుండా ట్రై చేయండి.

- హైదరాబాద్ నుంచి దూరం: సుమారు 280 km
- సందర్శించాల్సిన ప్రదేశాలు: విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం, కృష్ణా నది
- యాక్టివిటీస్: గాలి పటాలు ఎగరవేయడం, వీధీలో ముగ్గులు చూడటం, స్థానిక sweets ట్రై చేయడం
- ఇది కూడా చదవండి : విజయవాడకు దగ్గర్లో టాప్ 7 కుటుంబ సమేతంగా వెళ్లదగిన ప్రాంతాలు | Vijayawada Near By Places
3.తిరుపతి | Tirupati
సంక్రాంతిని (Sankranti In Tirupati) మీరు ఆధ్మాత్మికంగా, భక్తి మోడ్‌లో ఎంజాయ్ చేయాలనిపిస్తే తిరుపతికి వెళ్లవచ్చు. సంక్రాంతి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు, ఏర్పాట్లు జరుగుతుంటాయి. తిరుపతి సిటీలో మీరు హ్యాండీ క్రాఫ్ట్స్, sweets కూడా ట్రై చేయొచ్చు.
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం చుట్టుపక్కల ఉన్న ఆలయాలు దర్శించుకోవచ్చు. అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆలయ వీధుల్లో భక్తి పారవశ్యంలో కాసేపు నడవండి. ఆ అనుభవం ఎలా ఉందో కామెంట్ చేయండి.
- ఇది కూడా చదవండి : తిరుమలలో దర్శనాలు ఎన్ని రకాలు ? ఏ టికెట్లు బుక్ చేసుకుంటే దర్శనం వేగంగా అవుతుంది | Tirumala Darshan Guide

4. శ్రీకాళహస్తి | Srikalahasti
Sankranti In Srikalahasti : సంక్రాంతి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. భక్తితో పాటు పండగ వాతావరణాన్ని అనుభూతి చెందవచ్చు. టైమ్ ఉంటే సమీపంలోని సందర్శనీయ ప్రదేశాలకు కూడా వెళ్లవచ్చు.
5.రాజమండ్రి | Rajahmundry
Sankranti In Rajamundry : సంక్రాంతి సమయంలో గోదావరి నది తీరాలు కలర్ఫుల్గా మారిపోతాయి. గాలిపటాల పోటీలు, బోట్ రైడ్స్, స్థానికంగా జరిగే ఉత్సవాలు, జాతరలు ఇవన్నీ మిమ్మత్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాయి.
6.కర్నూలు జిల్లా | Kurnool
Sankranti In Kurnool : సంక్రాంతి సమయంలో కర్నూలు చాలా కూల్‌గా ఉంటుంది. ఇక్కడి ట్రెడిషనల్ ఆంధ్రా-స్టైల్ పండగ సెలబ్రేషన్స్ బాగుంటాయి. ఎడ్ల బండ్ల రేసులు, ఫోక్ డ్యాన్సులు, మిఠాయిల రుచులు – ఇవన్నీ కలిసి మీ సంక్రాంతికి వేయి రంగులు యాడ్ చేస్తాయి.
- ఇది కూడా చదవండి : Horsley Hills : ఆంధ్రా ఊటీకి క్యూ కడుతున్న తెలుగు ప్రయాణికులు
7. మచిలీపట్నం | Machilipatnam
Sankranti In Machilipatnam : సంక్రాంతిని తీరప్రాంతాల్లో సెలబ్రేట్ చేయాలనుకుంటే మచిలీపట్నం బెస్ట్ ఛాయిస్. మచిలీపట్నం, మంగినపూడి బీచుల్లో పతంగులు ఎగరవేయడం, బోట్ రైడ్స్, ఇసుకులపై ఆటలు – ఇవన్నీ రెగ్యులర్ టూర్ ప్లాన్‌కు భిన్నంగా ఉంటాయి.
ప్రయాణికుడు టిప్స్ | Travel Tips for Sankranti in Andhra Pradesh
- సంక్రాంతి సమయంలో మోర్నింగ్ చలి ఎక్కువగా ఉంటుంది, అందుకే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి.
- తిరుపతి, విజయవాడ లాంటి ప్రదేశాలకు వెళ్లడానికి ముందే మీ స్టే, బస్, రైల్వే టికెట్లు బుక్ చేసుకోండి.
- ఆంధ్రాలో అరిసెలు, బొబ్బట్లు, మురుకులు, ఇలా ఎన్నో పిండి వంటకాలు ఉంటాయి. ఎంజాయ్ చేయండి.
- పతంగులు ఎగరేయడానికి, జాతరలకు వెళ్లడానికి, ఫోటోలు తీయడానికి, వీలైతే నదీ, సరస్సులో స్నానం చేయడానికి mind & bag సిద్ధం చేసుకోండి.
- Sankranti ని ఆంధ్రా స్టైల్లో ఎంజాయ్ చేయాలంటే, లోకల్ కల్చర్, ఫుడ్, అక్కడి vibe ను అర్థం చేసుకుని ఆనందించండి.
సంక్రాంతి అంటే జీవన విధానం | 7 Sankranti Destinations in Andhra Pradesh
సంక్రాంతి సమయంలో ఏపీలో ఎక్కడికి వెళ్లినా ఉత్సవాలు, జాతరలు, ఫోక్ డ్యాన్సులు, హ్యాండీ క్రాఫ్ట్స్, వీధీలో రంగువల్లులు కనిపిస్తాయి. సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు, అది జీవన విధానం. అందుకే సంతోషాన్ని కుటుంబం, మిత్రులతో పంచుకోవాలి అని తెలుగు వారు ఎక్కడ ఉన్నా తమవారితో కలిసి సెలబ్రేట్ చేస్తారు.
మరి ఈ సారి మీరు ఏవూరికి వెళ్తున్నారు? ఏ టూరుకు వెళ్తున్నారు? కామెంట్ చేయండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
