హైదరాబాద్‌లో పతంగులు ఎగురేయడానికి 5 బెస్ట్ ప్రదేశాలు ఇవే | 5 Best Places To Fly Kites In Hyderabad
5 Best Places To Fly Kites In Hyderabad : ఈ గైడ్లో హైదరాబాద్ సిటీలో కైట్ ఫ్లైయింగ్‌కు సూటబుల్ ప్రదేశాలు, యాక్సెస్ లెవల్స్, బెస్ట్ టైమింగ్స్, పరిమితులు అన్నీ కూడా చర్చిద్దాం.
హైదరాబాద్‌లో సంక్రాంతి సీజన్ వస్తే ఆకాశం ఒక రంగుల మ్యాప్‌లా మారిపోతుంది. కానీ గాలిపటాలు ఎగురేయడానికి సేఫ్, లీగల్ అండ్ ఫ్యామిలీతో వెళ్లగలిగిన ప్రాంతాలు ఏవో చాలా మందికి క్లారిటీ ఉండదు.
ఈ గైడ్లో హైదరాబాద్ సిటీలో కైట్ ఫ్లైయింగ్‌కు సూటబుల్ ప్రదేశాలు, యాక్సెస్ లెవల్స్, బెస్ట్ టైమింగ్స్, పరిమితులు అన్నీ కూడా చర్చిద్దాం.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ | Secunderabad Parade Grounds
International Kite & Sweet Festival Venue
ఇక్కడికి ఎందుకు వెళ్లాలి?
ఇది హైదరాబాద్‌లో అధికారికంగా అనుమతి పొంది, పోలీసులు బందోబస్తు ఉన్న కైట్ ఫ్లైయింగ్ జోన్. ఫ్యామిలీస్, కిడ్స్, టూరిస్టులకు ఇది సేఫ్ ఆప్షన్.
ఎలా వెళ్లాలి? | Access & Planning
లొకేషన్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్.
దగ్గరలో పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లు ఉంటాయి.
పార్కింగ్ గ్రౌండ్ చాలా పెద్దదే. కానీ ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది.
ఫెస్టివల్ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
బెస్ట్ టైమ్ | Best Time
ఉదయం 9 నుంచి 11.30 వరకు. సాయంత్రం 4 నుంచి సూర్యాస్తమయం వరకు
ఎవరికి బాగా సెట్ అవుతుంది?
సంక్రాంతి సమయంలో పండగ వాతావరణాన్ని ఆస్వాదించాలి అనుకునేవారికి ఇది బాగా సెట్ అవుతుంది. పిల్లలకు, పెద్దలకు బాగా సరిపోతుంది.
- ఇది కూడా చదవండి : ఇల్లు భద్రం…మనసు ప్రశాంతం | ఊరికి వెళ్లే ముందు ఈ టిప్స్ చదవండి | Sankranti Safety Tips 2026
2. పాత బస్తీ మేడలు | Old City Rooftops
(Begum Bazaar, Dhoolpet, Hussaini Alam)

ఇవి కేవలం ప్రాంతాలు కాదు. ఇవి హైదరాబాద్ కల్చర్‌కు చిరునామా లాంటివి. కొన్ని తరాల నుంచి ఇక్కడి డాబాల పతంగ్‌బాజీ అంటే గాలిపటాల పోటీ ఓల్డ్ సిటీ ఐడెంటిటీ లాంటిది.
అయితే ఇక్కడికి అందరికీ ఆహ్వానం ఉండదు. తెలిసిన దోస్తు ఉంటే వెళ్లొచ్చు. లోకల్ కాంటాక్ట్స్ ఉంటే వెళ్లొచ్చు. ఇక్కడ టెర్రస్‌లపై నుంచి గాలిపటాలు ఫ్లై చేస్తారు.
పాత బస్తీలో రాత్రి సమయంలో కూడా పతంగులు ఎగురవేస్తారు. వీటిని లైట్ పతంగ్ అని పిలుస్తారు. సంక్రాంతి సమయంలో మూడు రోజులూ సందడి మామూలుగా ఉండదు.
3. నెక్లెస్ రోడ్, దోమలగూడ గ్రౌండ్స్ | 5 Best Places To Fly Kites In Hyderabad
Neclace Road , Domalaguda
ఇవి ఓపెన్ పబ్లిక్ ప్రదేశాలు. ఎవరైనా ఇక్కడికి కుటుంబంతో కలిసి వెళ్లొచ్చు. చాలా మంది ఇక్కడ గాలిపటాలు ఫ్లై చేస్తారు. చక్కని గాలి, అంతే చిక్కని ఎండ ఇవి సంక్రాంతి మూడ్‌ను బాగా సెట్ చేస్తాయి.
ఎలా వెళ్లాలి?
ఖైరతాబాద్ వరకు మెట్రోలో వెళ్లవచ్చు. లేదా నెక్లెస్ రోడ్ వరకు ఎంఎంటీఎస్‌లో వెళ్లవచ్చు.
క్రౌడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ రద్దీగా అనిపించదు.
కొన్ని ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరేయడంపై అభ్యంతరాలు ఉండవచ్చు.
ఎప్పుడు వెళ్లాలి?
ఉదయం 7 నుంచి 9 మధ్యలో
సాయంత్రం 4 నుంచి 6 వరకు
ఇంపార్టెంట్ విషయం
రోడ్ సైడ్‌లో కరెంట్ వైర్ల దగ్గర గాలిపటాలు ఫ్లై చేయకండి.
- హైదరాబాద్‌ను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసందుకు క్లిక్ చేయండి.
4. ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రౌండ్స్, కులీ కుతుబ్ షా స్టేడియం ఏరియా
(Osmania University Grounds / Quli Qutb Shah Stadium Area)
ఇక్కడ చాలా పెద్ద ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి. రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోండి.
ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని నిషేధిత ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేయకండి.
మీరు వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా ఫెస్టివల్స్ లేదా కార్యక్రమాలు జరుగుతుంటే గాలిపటాలు ఎగరేయడానికి అనుమతి ఉందో లేదో తెలుసుకోండి.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే క్రౌడ్ తక్కువగా ఉంటుంది.
ఎప్పుడు వెళ్లాలి?
ఉదయం సమయంలో వెళ్లితే బెస్ట్. మధ్యాహ్నం వెళ్లకపోవడం ఉత్తమం.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour
5. గండిపేట్ / ఉస్మాన్ సాగర్ లేక్ సైడ్ ఓపెన్ ప్రదేశాలు
(Gandipet / Osman Sagar Lake Side Open Areas)
జనావాసాల నుంచి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో గాలిపటాలు ఎగరేయాలంటే ఇవి చాలా మంచి స్పాట్స్. బ్యాగ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది.
సొంత వాహనంలో వెళ్లడానికి ప్రయత్నించండి. అవకాశం లేకపోతే ప్రజారవాణాను వినియోగించండి. రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా పండగను సెలబ్రేట్ చేయవచ్చు.
ఎప్పుడు వెళ్లాలి?
ఉదయం 7 నుంచి 10 వరకు
గమనిక:
ఇక్కడ గాలిపటాల ఫెస్టివల్ జరగదు. కానీ ఓపెన్ స్పేస్ వల్ల చాలామంది ఇక్కడికి వస్తుంటారు.
- ఇది కూడా చదవండి : Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide
ఈ నియమాలు తప్పకుండా తెలుసుకోండి.
Kite Flying Safety & Rules
గాలిపటాలు ఫ్లై చేయడం ఎంత సరదాగా ఉంటుందో, జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
- బౌండరీ వాల్ లేని మేడలపై గాలిపటాలు ఎగరేయకండి.
- రేకుల ఇళ్లపై ఫ్లైయింగ్ వద్దు.
- మాంజాను ఎవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇందులో సీసం ఉంటుంది. బాటిళ్లు, గ్లాసులు పిండిలా చేసి దారాలకు అద్దుతారు. కోసుకుపోయే ప్రమాదం ఉంది.
- చైనీస్ మాంజా అస్సలు వాడకండి.
- కాటన్ దారాలు మాత్రమే వాడండి.
- వీలైతే పిల్లలకు గ్లౌజులు తొడగండి.
- కట్ అయిన పతంగ్‌లను పట్టుకోవడానికి ప్రయత్నించకండి.
- వైర్లకు ఇరుక్కున్న గాలిపటాలను తీసేందుకు ప్రయత్నించకండి.
- ఎవరైనా మీ గాలిపటాన్ని కట్ చేస్తే గొడవ పెట్టుకోకండి.
- పోలీసుల సూచనలు పాటించండి.
సంక్రాంతి సమయంలో వాతావరణం బాగుంటుంది. అందుకే వెలుతురు ఉన్నప్పుడు ఎప్పుడైనా గాలిపటాలు ఫ్లై చేయవచ్చు. కానీ మధ్యాహ్నం బ్రేక్ తీసుకోవడం మంచిది.
చిన్నమాట | Prayanikudu Travel Note
ఇది ఒక ఈవెంట్ ఆర్టికల్ కాదు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో కలిసి గాలిపటాలు ఎగురవేయడానికి ప్లాన్ చేస్తున్న వారికి కొంత సమాచారం ఇవ్వాలనే ప్రయత్నం మాత్రమే.
ఇక్కడ ప్రస్తావించిన ప్రదేశాల్లో గాలిపటాలు ఎగురవేయడానికి అనుమతి లేకపోతే నన్ను తప్పుపట్టకండి. కాకపోతే ప్రతి సంవత్సరం ఇక్కడ సందడి ఉంటుంది. ఈసారి కూడా ఉండే అవకాశం ఉందని ఊహించి రాసిన ఆర్టికల్ ఇది.
ఈ ఆర్టికల్‌ను మీరు 2030లో చదివినా, 2035లో చదివినా ఈ ప్రాంతాల్లో మాత్రం సంక్రాంతి సమయంలో సందడి పక్కాగా ఉంటుంది.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
