Bidar Fort Travel : కర్ణాటకలో ఉన్నా తెలంగాణ టచ్ ఉన్న బీదర్ కోట కథ

Bidar Fort Travel :  కర్నాటక తెలంగాణ బార్డర్ దగ్గర్ ఉన్న బీదర్ కోట అనేది సాధారణ క్రౌడ్ కోసం కాదు. ప్రశాంతంగా చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకునేవారి కోసం ఒక మంచి డెస్టినేషన్ ఇది.

దక్కన్ పీఠభూమిపై ఉన్న ఈ కోటకు వెళ్త నగర జీవితం నుంచి తప్పించుకున్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. భారీ కోట గోడలు, పాత మసీదు, పురాతన నీటి వ్యవస్థ, ఓపెన్ కోర్డ్ యార్డ్ అన్నీ కూడా ఇక్కడ స్లోగా ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు..

పీఠభూమిపై ఉన్న కోట

బీదర్ కోట అనేది మంచి ఎత్తులో ఉన్న కోట. ఇక్కడి నుంచి బీదర్ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి. రాతితో చేసిన రహదారులు, శిథిళమైన ఇక్కడి కట్టడాల మధ్య నడుచుకుంటటూ వెళ్లినప్పుడు, చరిత్ర మౌనంగా తన గాథను వివరిస్తుంది. బాహమనీ సుల్తానుల తరువాత కాలానుగణంగా జరిగిన మార్పులను మీరు ఇక్కడ గమనించవచ్చు.

క్రౌడ్ లేని హెరిటేజ్ వాక్

బీదర్ కోటకు వెళ్తే మీకు ట్రావెల్‌ గైడ్‌తో (travel guide) అంతగా పనిలేదు. టూరిస్టు రష్ చాలా తక్కువగా ఉండటం వల్ల స్లోగా మీరు కోటను గమనిస్తూ ముందుకు వెళ్లవచ్చు. ఆర్కిటెక్చర్ డీటెయిల్స్ చూసుకోవడానికి, ఫోటోగ్రఫీకి మంచి టైమ్ దొరుకుంది. వీకెండ్స్‌లో కూడా ఇక్కడ అంత ఎక్కువ రష్ ఉండదు. 

తెలంగాణ పక్కనే హిస్టరీ టచ్ | Hyderabad to Bidar trip

బీదర్ పట్టణం అనేది తెలంగాణకి (telangana) దగ్గరలో ఉన్న ఒక సింపుల్ అండ్ హిస్టారికల్ డెస్టినేషన్. హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్లడం చాలా ఈజీ. దీంతో పాటు ఇక్కడి కల్చర్, లాంగ్వేజ్‌లో కాస్త దక్కనీ ఇంఫ్లుయెన్స్ కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశం తెలంగాణ ట్రావెల్ రీడర్స్‌కు ఫమిలియర్‌గా అనిపిస్తుంది.

ట్రావెల్ టిప్స్ | Hyderabad to Bidar travel tips
హైదరాబాద్ నుంచి బీదర్ దూరం సుమారు 150 కిలోమీటర్లు. కార్‌లో వెళ్తే దాదాపు 4 గంటల వరకు టైమ్ పడుతుంది. Hyderabad–Zaheerabad–Bidar రూట్ జనరల్‌గా స్మూత్‌గా ఉంటుంది. బీదర్ రైల్వే స్టేషన్ కోటకు దగ్గరలోనే ఉండటం వల్ల, రైలులో ప్రయాణించడం కూడా ఒక ఈజీ ఆప్షన్.

బెస్ట్ టైమ్
బెస్ట్ టైమ్ విషయానికి వస్తే, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో వెళ్తే ప్రయాణాన్ని, కోట వైభవాన్ని కంఫర్ట్‌గా ఆస్వాదించవచ్చు. ఒక్క రోజులో వెళ్లి తిరిగి రావాలి అనుకుంటే, సరైన ప్లానింగ్‌తో అది కూడా సాధ్యం. అయితే నైట్ స్టే ప్లాన్ చేసుకుంటే, హడావిడి లేకుండా కాస్త ప్రశాంతంగా ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో

Leave a Comment

error: Content is protected !!