Budget 2026 Tourism : విదేశీ ప్రయాణాలు చవకగా… టూరిజానికి భారీ ఊతం

Budget 2026 Tourism : 2026–27 బడ్జెట్‌లో టూరిజం రంగానికి ఊతం ఇచ్చే ఎన్నో అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రెజెంట్ చేస్తూ, ఉద్యోగ కల్పనతో పాటు విదేశీ మారకాన్ని పెంచే సాధనంగా టూరిజం రంగాన్ని భావిస్తున్నట్టు తెలిపారు.

ఈ బడ్జెట్‌లో పెద్ద మార్పు ఏంటంటే, అంతర్జాతీయ ప్రయాణాలు మరింత చవకగా అందుబాటులోకి రానున్నాయి. ఎలా అంటే…

  • ప్రస్తుతం ఉన్న ఓవర్సీస్ ప్యాకేజీలు అంటే విదేశీ ప్యాకేజీలపై ఉన్న 5 శాతం, 20 శాతం టీసీఎస్‌ను తగ్గించి 2 శాతానికి ఫిక్స్ చేశారు.
  • దీంతో పాటు మినిమం ఎమౌంట్ అనే కండిషన్‌ను కూడా తొలగించారు.
  • వీటి వల్ల ప్రతి ప్రయాణికుడు చేసే ఖర్చు తగ్గుతుంది. 
  • భారతీయులు తమ విదేశీ ప్రయాణాలను మరింత చవకగా ప్లాన్ చేసుకోవచ్చు.

పర్వత పర్యాటకానికి ఊతం | Mountain Trails | Budget 2026 Tourism

బడ్జెట్‌లో వరల్డ్ క్లాస్ ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు అడ్వెంచర్ టూరిజాన్ని కూడా ప్రోత్సాహించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కశ్మీర్, అరకు లోయ, పొతిగై మలై (Pothigai Malai) వంటి ఇకో-ఫ్రెండ్లీ మౌంటెయిన్ ట్రెయిల్స్‌ను మరింతగా డెవెలప్ చేయనున్నారు.

Budget 2026 Tourism
Loacation : Mutyala Falls, Telangana – Image Courtesy: Telangana Tourism Department
  • దీంతో పాటు ఒడిశాలోని టర్టిల్ ట్రెయిల్స్, కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రణాళిక చేస్తున్నారు.

చరిత్రాత్మక పర్యాటకం | Archaeological Sites

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్కియాలజికల్ సైట్స్‌తో పాటు మరో 15 సైట్స్‌ను వైబ్రెంట్ కల్చరల్ డెస్టినేషన్లుగా మార్చి పబ్లిక్ యాక్సెస్‌కు ఓపెన్ చేయనున్నారు. ఇక్కడ క్యూరేటెడ్ వాక్‌వేస్ ద్వారా చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

ఇక పూర్వోదయ రాష్ట్రాల్లో (Purvodaya States: సూర్యోదయం జరిగే రాష్ట్రాలు, తూర్పు వైపు ఉన్నవి)  5 కొత్త టూరిజం హబ్‌లను ఏర్పాటు చేసి, 4,000 ఈ-బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

అలాగే ఏడు కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను (Hyderabad High Speed Railway Corridor) ప్లాన్ చేశారు. ఇందులో మూడు కారిడార్లు హైదరాబాద్‌తో లింక్ అయి ఉండటం విశేషం.
వీటి వల్ల దేశంలోని ప్రధాన నగరాల మధ్య రైలు రవాణా మరింత వేగంగా పుంజుకోనుంది.

మొత్తానికి బడ్జెట్ 2026 అనేది చీప్ ఇంటర్నేషనల్ ట్రావెల్, ఇకో, హెరిటేజ్ టూరిజం, గైడెడ్ ఎక్స్‌పీరియెన్స్, బెటర్ కనెక్టివిటీ అంశాలపై ఫోకస్ చేసి, దేశీయ–విదేశీ ట్రావెల్ ఎకానమీని మరో ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో

Leave a Comment

error: Content is protected !!