55 లక్షల జనాభా.. అయినా ప్రపంచంలోనే రిచెస్ట్! Norway ఎలా ఇంత ధనిక దేశమైంది? | Norway Telugu Facts
Norway Telugu Facts: ప్రపంచంలో కొన్ని దేశాల వైశాల్యం చిన్నదే అయినా…ఆర్థికంగా పెద్ద పెద్ద దేశాలను కూడా వెనక్కి నెట్టేశాయి. అలాంటి ఒక దేశమే నార్వే. ఈ దేశంలో ఎటు చూసినా మంచు పర్వతాలు ఉంటాయి. వ్యవసాయానికి అనువైన భూమి చాలా తక్కువ.
జనాభా మన హైదరాబాద్ కన్నా తక్కువ. అయినా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయితే నార్వే అంత డబ్బున్న దేశం ఎలా అయింది అనేదే ఒక ఓపెన్ సీక్రెట్.
నార్వే ఎక్కడ ఉంది ? | Norway Location
ఐరోపాలోని ఉత్తర భాగంలో ఉన్న Norway విస్తీర్ణం సుమారు 3.85 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ దేశంలో పర్వతాలు, మంచుతో కప్పబడిన ప్రదేశాలే ఎక్కువ. వ్యవసాయం చేయడానికి సాగు భూమి లేకపోవడంతో పంటలు పండించడం కష్టం. కానీ ఈ కష్టాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకోలేదు. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించింది నార్వే. ఆ ఆలోచనే ఈ దేశ చరిత్రలో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
అసలు టర్నింగ్ పాయింట్ ఏంటి? |Why Norway is Rich
1969లో North Seaలో చమురు నిల్వలను కనుగొంది నార్వే. ఈ డిస్కవరీ దేశ గతిని (Norway Economy) మార్చేసింది. క్రూడ్ ఆయిల్, గ్యాస్ అమ్మగా వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా భవిష్యత్ తరాల కోసం Government Pension Fund Global లో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫండ్ విలువ $1.7 ట్రిలియన్కు పైగా ఉంది.
అంటే Norway సంపదలో చమురు ఆదాయం మాత్రమే కాదు, దాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టిన విధానం కూడా కీలక పాత్ర పోషించింది. మన జీవితంలో కూడా మనకు వచ్చిన డబ్బును ఎలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేదే ఇంపార్టెంట్.
నూనె అమ్మి..విద్యుత్ వెహికల్స్ కొని | Norway Telugu Facts
ఉన్న నూనె మొత్తం విదేశాలకు అమ్మితే మరి ఆ దేశంలో వాహనాల పరిస్థితి ఏంటి అని వాళ్లు ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే వెహికల్స్‌కు బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్నారు.
అంటే ఒకవైపు క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది…వచ్చిన డబ్బును సేవ్ చేస్తుంది. విద్యుత్ వాహనాలతో ఫ్యూయల్ వాడకాన్ని తగ్గించారు. అందుకే నార్వేలో కొత్తగా అమ్ముడయ్యే కార్లలో దాదాపు 89 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి.
- ఇది కూడా చదవండి : Margherita Hut : 15,000 అడుగుల ఎత్తులో ఒంటరి హోటల్
నార్వేలో సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. లైఫ్‌స్టైల్ కూడా. ఇక్కడి ప్రభుత్వం ప్రజల సంక్షేమం విషయంలో అనేక దేశాలకన్నా ముందంజలో ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్, వైద్యం, ఆరోగ్యం, సోషల్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో ప్రభుత్వం భారీగా డబ్బు ఖర్చు చేస్తుంది.
అందుకే మనం నార్వే కథ గురించి ఎవరికైనా చెప్పే ముందు ఆయిల్ దొరికింది కాబట్టి రిచ్ కంట్రీ అయింది అని చెప్పడం కాదు…వచ్చిన డబ్బుతో ఎలా దేశాన్ని నిలబెట్టారు అనే విషయాన్ని చెప్పాలి.
ప్రకృతి ఇచ్చిన సంపదను చక్కగా మేనేజ్ చేస్తే చిన్న దేశం కూడా ప్రపంచ ఆర్థిక పటంలో పెద్ద శక్తిగా మారగలదని Norway నిరూపించింది.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
