Japan Travel : జపాన్‌లో తప్పక చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు ..ఒకసారి వెళ్తే మర్చిపోలేరు!
Japan Travel : జపాన్‌లో తప్పక చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు… టోక్యో, క్యోటో, మౌంట్ ఫుజి, ఒసాకా, హొక్కైడో ప్రత్యేకతలు, చూడాల్సిన ప్రదేశాలు, ప్రయాణ సూచనలు….
జపాన్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది అనిమే, సుషీ, టెక్నాలజీ. కానీ అసలు జపాన్ మ్యాజిక్ అక్కడి ప్రదేశాల్లో ఉంది. భవిష్యత్తు నగరాలు, వేల ఏళ్ల సంప్రదాయం, మంచు పర్వతాలు, చెర్రీ పూల (Sakura Flowers) అందాలు… అన్నీ ఒకే దేశంలో.
మీరు జపాన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఈ 5 ప్రదేశాలు మీ లిస్ట్‌లో తప్పకుండా ఉండేలా చూసుకోండి.
1. టోక్యో : Tokyo | భవిష్యత్తులోకి అడుగు
జపాన్ రాజధాని టోక్యో అంటే ఒక ఎనర్జీ. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిబుయా క్రాసింగ్‌లో ఒకేసారి వేల మంది నడవడం చూస్తే షాక్ అవుతారు. రాత్రి అయితే షింజుకు, షిబుయా నియాన్ లైట్లతో మెరిసిపోతాయి.
టోక్యో టవర్, సెన్సోజి ఆలయం, హరాజుకు ఫ్యాషన్ స్ట్రీట్, అకిహబరా ఎలక్ట్రానిక్స్ మార్కెట్… ప్రతి సందులో ఒక కొత్త ప్రపంచం. ఫుడ్ లవర్స్ కి రామెన్, సుషీ, వాగ్యు బీఫ్ ఇక్కడ బెస్ట్.
2. క్యోటో : Kyoto | సంప్రదాయ నగరం
places to visit in Japan : టోక్యోకి పూర్తి భిన్నంగా క్యోటో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ 1600 కి పైగా బౌద్ధ దేవాలయాలు, షింటో మందిరాలు ఉన్నాయి. ఫుషిమి ఇనారి ఆలయంలో వేల ఎర్ర తోరణాల (టోరి గేట్స్) మధ్య నడవడం ఒక అద్భుత అనుభవం.
అరషియామా బాంబూ ఫారెస్ట్, కింకకుజి గోల్డెన్ పెవిలియన్, గీషా కల్చర్ ఉన్న గియోన్ ఏరియా తప్పక చూడాలి. క్యోటోలో కిమోనో వేసుకుని ఫోటోలు దిగడం మర్చిపోవద్దు.
- ఇది కూడా చదవండి : El Alto : ఎల్ ఆల్టో.. ఆకాశానికి దగ్గరగా ఉన్న నగరం
3. మౌంట్ ఫుజి : Mount Fuji | జపాన్ గుండెచప్పుడు
3,776 మీటర్ల ఎత్తున్న ఫుజి పర్వతం జపాన్‌కే గర్వకారణం. టోక్యో నుంచి కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. మార్చి-ఏప్రిల్‌లో సాకురా (చెర్రీ బ్లూజమ్స్) సీజన్లో ఫుజి వెనుక పూలు… ఆ వ్యూ మాటల్లో చెప్పలేం.
ఫుజి చుట్టూ ఉన్న ఐదు సరస్సులు (Fuji Five Lakes), హకోనే రోప్‌వే, ఓవకుడాని వేడి నీటి బుగ్గలు చాలా ఫేమస్. అడ్వెంచర్ ఇష్టపడేవారు జూలై-సెప్టెంబర్‌లో ఫుజి ఎక్కవచ్చు.
4. ఒసాకా : Osaka | తిని తిరిగి పడుకోవడానికి పర్పెక్ట్ సిటీ
జపాన్‌లో “కుయిడోరే” అంటే తినడానికి బతకడం, ఇదే ఒసాకా నినాదం. డోటోన్బోరి కెనాల్ పక్కన వీధుల్లో తకోయాకి, ఒకునోమియాకి, కుషికాట్సు, రామెన్ షాపులు వరుసగా ఉంటాయి. రాత్రి గ్లికో మ్యాన్ బోర్డు ముందు ఫోటో, డోటోన్బోరి బోట్ రైడ్ మిస్ చేయొద్దు.
ఒసాకా కోట, యూనివర్సల్ స్టూడియోస్ జపాన్ కూడా ఇక్కడే ఉన్నాయి.
5. హొక్కైడో : Hokkaido | ప్రకృతి ప్రేమికుల స్వర్గం
జపాన్ ఉత్తరాన ఉన్న అతిపెద్ద ద్వీపం హొక్కైడో. చలికాలంలో సపోరో స్నో ఫెస్టివల్లో మంచు శిల్పాలు, స్కీయింగ్. వేసవిలో ఫురానో లావెండర్ పూల తోటలు ఊదా (Grey) రంగులో కనిపించి స్వర్గంలా ఉంటాయి. హొక్కైడో డైరీ ప్రొడక్ట్స్, ఫ్రెష్ సీఫుడ్ చాలా ఫేమస్.
- ఇది కూడా చదవండి : Thailand Travel Guide : హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి? ఎక్కడ ఉండాలి ? కంప్లీట్ గైడ్
Travel Tips : జపాన్‌కు వెళ్లాలంటే JR పాస్ తీసుకోండి, మార్చి-మే, అక్టోబర్-నవంబర్ బెస్ట్ సీజన్. గూగుల్ ట్రాన్స్‌లేట్, క్యాష్ కార్డు తప్పక ఉంచుకోండి.
జపాన్ ట్రిప్ అనేది ట్రిప్ కాదు, జీవితకాల జ్ఞాపకం. మీ బకెట్ లిస్ట్‌లో జపాన్ ఉందా? కామెంట్ చేయండి!
మరిన్ని ప్రపంచ యాత్రా కథల కోసం prayanikudu.com ని ఫాలో అవ్వండి – Ippude Follow Avvandi, లేదంటే Next Story మిస్ అవుతారు.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
