Uluru : ఎడారి గుండెలో ఎర్రని దేవాలయం
Uluru : ఉలూరు ఆస్ట్రేలియా లోని ఎర్ర అద్భుతం. హైదరాబాద్ నుంచి ఉలూరు ఎలా వెళ్లాలి, బడ్జెట్, స్టే, ఫుడ్, సన్ రైజ్ వ్యూ, అనంగు తెగ కథలతో పూర్తి ట్రావెల్ గైడ్ తెలుగులో.
ఎక్కడ చూసినా ఎరుపు. ఆ ఎరుపు మధ్యలో ఆకాశాన్ని తాకుతున్న ఒంటరి గుడి. దాని పేరు ఉలూరు. దాని ముందు నిలబడితే మనం చాలా చిన్నవాళ్ళం అని అనిపిస్తుంది.
ఆస్ట్రేలియా అంటే సిడ్నీ కాదు, ఆపెరా హౌస్ కాదు. అసలు ఆస్ట్రేలియా అక్కడ లేదు. అది దేశం మధ్యలో ఉంది. ఎడారి మధ్యలో. వేల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఒక పెద్ద ఎర్ర రాయి దగ్గర ఉంది. స్థానిక అనంగు ప్రజలు దాన్ని గుండె లాగా కొలుస్తారు .
- ఇది కూడా చదవండి : Coorg Coffee : కూర్గ్‌ను కాఫీ ప్యారడైజ్ అని ఎందుకు అంటారో తెలుసా?
సందర్శనీయ ప్రదేశం – ఉలూరు | Places To Visit In Uluru
ఉలూరు అనేది ఒక రాయి కాదు, ఒక జీవి లేదా ప్రాణం ఉన్న ఒక శక్తిగా స్థానికులు భావిస్తారు . ఉదయం పూట ఈ కొండ నారింజ రంగు లో ఉంటుంది, మధ్యాహ్నం ఎర్రగా, సాయంత్రం అగ్ని లాగా మారుతుంది.
సూర్యోదయం సమయంలో ఉలూరు వైభవం అనేది అక్కడి ప్రజలకు ఒక అధ్యాత్మిక అనుభవం కూడా. తెల్లవారు జామునే లేచి ఎడారిలో నిలబడి అప్పటి వరకు చీకటిలో నల్లగా ఉన్న కొండను ఎరుపెక్కుతూ చూస్తూ పరవశించిపోతారు స్థానికులు, పర్యాటకులు.
Uluru transformed by rain 🌧️ Heavy rainfall turned the iconic rock into a series of flowing waterfalls, creating a rare and spectacular sight. https://t.co/RCqBSSNCzX
— AccuWeather (@accuweather) March 18, 2026
ఈ కొండ చుట్టూ 10 కిలోమీటర్ల బేస్ వాక్ ఏరియా ఉంటుంది. నడుస్తూ వెళ్తే ముటిట్జులు వాటర్ హోల్ కనిపిస్తుంది. ఎడారి మధ్యలో చిన్న నీటి గుంట ఇది. ఆ నీరు చాలా చల్లగా ఉంటుంది.
కుంటియా గార్జ్ లో రెండు రాళ్ళ మధ్య వీచే గాలి కూడా ఒక మంత్రంలా ఉంటుంది. గుహల లోపల అనంగు ప్రజలు గీసిన పాత పెయింటింగ్స్ ఉన్నాయి.
సాయంత్రం అయితే కటా జుటా (Kata Tjuta) అనే మరో రాళ్ళ సమూహం వద్దకు వెళ్లవచ్చు. ఇక్కడ 36 తలలు ఒకేచోట ఉన్నట్టు ఉంటాయి ఆ రాళ్లు. రాత్రి అయితే ఇది ఫీల్డ్ ఆఫ్ లైట్‌గా మారిపోతుంది. ఎడారి మొత్తం 50 వేల లైట్ల తో నిండిపోతుంది.
ఎలా వెళ్ళాలి | Hyderabad To Uluru Trip Plan
హైదరాబాద్ నుంచి ఉలూరు కి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. హైదరాబాద్ శంషాబాద్ నుంచి సింగపూర్ లేదా కౌలాలంపూర్ మీదుగా సిడ్నీ (Sydney) లేదా మెల్బోర్న్ వెళ్ళాలి. 14 గంటల ప్రయాణం ఇది.
సిడ్నీ లో ఒక రోజు ఆగి, అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ లో అలిస్ స్ప్రింగ్స్ కి వెళ్ళాలి. 3 గంటల ఫ్లైట్. అలిస్ స్ప్రింగ్స్ (Alice Spring) అనేది ఎడారి లో ఉన్న చిన్న పట్టణం. అక్కడి నుంచి అయర్స్ రాక్ ఎయిర్పోర్ట్ కి మరో గంట ఫ్లైట్ ఉంది.
లేదా రోడ్డు మీద కార్ లో వెళ్తే 5 గంటలు పడుతుంది. ఆ రోడ్డు ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఎర్ర మట్టి, పొడుగ్గా ఉన్న స్పినిఫెక్స్ గడ్డి, అప్పుడప్పుడు దూకుతున్న కంగారూలను చూసి మైమరిచిపోవచ్చు. విజయవాడ నుంచి వచ్చే వారు హైదరాబాద్ వచ్చి ఇదే రూట్ ఫాలో అవ్వాలి.
ఎక్కడ ఉండాలి | Places To Stay In Uluru
ఉలూరు దగ్గర అయర్స్ రాక్ (Ayers Rock) రిసార్ట్ లోనే ఉండాలి. అక్కడ సెయిల్స్ ఇన్ ది డెసర్ట్, డెసర్ట్ గార్డెన్స్ హోటల్, లగ్జరీ గా లాటిట్యూడ్ 131 డిగ్రీస్ ఉన్నాయి. టెంట్ లో ఉంటే రాత్రి పడుకుని నక్షత్రాలు చూడొచ్చు. ఇక్కడ సిటీ లైట్స్ ఉండవు కాబట్టి పాలపుంత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం టెంట్ జిప్ తీస్తే ఎదురుగా ఉలూరు అద్భుతంగా దర్శనం ఇస్తుంది.
ఏం చూడాలి, ఏం తినాలి | Australian Food
ఉదయం సన్ రైజ్, సాయంత్రం సన్ సెట్ రెండూ చూడాలి. మధ్యలో అనంగు గైడ్ తో కల్చరల్ వాక్ చేయాలి. వాళ్ళు చెప్పే కథలు వింటే ఈ రాయి ఎందుకు పవిత్రమో అర్థం అవుతుంది.
ఇక ఫుడ్ విషయానికి వస్తే బుష్ టక్కర్ ట్రై చేయాలి. వాటిల్ సీడ్ తో చేసిన బ్రెడ్, లెమన్ మిర్టల్ తో చేసిన చికెన్, కంగారూ స్టీక్ ఇందులో ఏది నచ్చితే అది ట్రై చేయవచ్చు.. రాత్రి ఎడారి లో బార్బెక్యూ ఎంజాయ్ చేయవచ్చు.
ఆసక్తికరమైన విషయాలు
- 1. ఉలూరు ఎత్తు 348 మీటర్లు, కానీ భూమి లోపల 6 కిలోమీటర్ల వరకు ఉంది.
- 2. దీని వయసు 550 మిలియన్ సంవత్సరాలు.
- 3. అనంగు ప్రజలు (Anangu Tribe) దీన్ని ఎక్కడం ఇష్టపడరు. 2019 నుంచి ఎక్కడం పూర్తిగా బ్యాన్ చేశారు.
- 4. ఇక్కడికి వెళ్ళడానికి ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా తప్పనిసరి.
- 5. బెస్ట్ టైం మే నుంచి సెప్టెంబర్ వరకు, ఎండ తక్కువ ఉంటుంది.
బడ్జెట్ | Uluru Budget
హైదరాబాద్ నుంచి 5 రోజుల ట్రిప్ కి మనిషికి 1.80 లక్ష నుంచి 2.50 లక్షలు అవుతుంది. ఫ్లైట్ 90 వేలు, స్టే రోజుకి 12 వేల నుంచి, ఫుడ్, ఎంట్రీ టికెట్లు కలిపి. ఖర్చులు మీ లైఫ్ స్టైల్‌ను బట్టి మారే అవకాశం ఉంది.
▶️ వీడియో చూడండి : థాయ్‌లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
ఇది చదవండి : థాయ్‌లాండ్ ట్రావెల్ గైడ్
