జర్మనీ వ్లాగర్ షాక్.. ఇది జపాన్ బుల్లెట్ ట్రైన్ లా ఉంది.. 14 లక్షల వ్యూస్! | German vlogger vande bharat
German vlogger vande bharat : జర్మనీ వ్లాగర్ వందే భారత్ లో ₹2,100తో 5.5 గంటలు ప్రయాణించాడు. తిరిగే సీట్లు, భోజనం చూసి జపాన్ బుల్లెట్ ట్రైన్ లా ఉంది అన్నాడు. 14 లక్షల వ్యూస్.
జర్మనీకి చెందిన ట్రావెల్ వ్లాగర్ Alexander Welder భారతదేశంలో పర్యటిస్తున్నాడు. అతని ఇన్ స్టాగ్రామ్ ఐడి alexweldertravels. ఇటీవల వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణించి ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో పేరు Taking a ride on India’s most modern train.
వీడియోలో అతను తన 5.5 గంటల ప్రయాణ అనుభవాన్ని చూపించాడు. కోచ్ లోకి అడుగుపెట్టగానే సీట్ల అమరిక చూసి ఆశ్చర్యపోయాడు. ఇది జపాన్ లేదా చైనా హై స్పీడ్ రైన్ లా ఉంది అన్నాడు.
- ఇది కూడా చదవండి :ప్రపంచ వింతలకు తక్కువ కాని 8 ప్రదేశాలు…చూస్తే వారెవ్వా అనాల్సిందే !
అతనికి నచ్చిన మూడు విషయాలు ఉన్నాయి. మొదటిది తిరిగే సీట్లు. వందే భారత్ లో సీట్లను విండో వైపు తిప్పుకోవచ్చు. అతను తన స్నేహితుడితో కలిసి సీట్లు తిప్పుతూ ఎంజాయ్ చేశాడు.
రెండోది లగేజ్ స్పేస్. పైన ఉన్న కంపార్ట్ మెంట్ లో పెద్ద సూట్ కేస్ కూడా సులభంగా పడుతుంది అని చెప్పాడు. మూడోది టాయిలెట్స్. ఒకే కోచ్ లో ఇండియన్ మరియు వెస్ట్రన్ రెండు రకాల టాయిలెట్స్ ఉన్నాయి.
అతను ఈ 5.5 గంటల ప్రయాణానికి కేవలం 2100 రూపాయలు మాత్రమే పెట్టాడు. అందులో భోజనం కూడా ఉంది. స్నాక్స్ కింద ప్యాక్డ్ ఫరసాన్ మరియు జ్యూస్ ఇచ్చారు. ముందుగా ఆర్డర్ చేసిన భోజనంలో దాల్, సబ్జీ, కర్రీ, చపాతీ, రైస్, ఐస్ క్రీమ్ ఉన్నాయి. ఇదంతా 2100లోనే రావడం చూసి How crazy is that అన్నాడు.
ఈ వీడియో ఇప్పటికే 14 లక్షల వ్యూస్ దాటింది. ఈ వార్త కర్లీ టేల్స్ లో 18-11-2025న వచ్చింది. కామెంట్స్ లో చాలా మంది అతిథి దేవో భవ అని రాశారు. యూరోప్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర అని మెచ్చుకున్నారు.
ఇది భారతీయ రైల్వే మార్పుకు నిదర్శనం. విదేశీయులు మెచ్చుకుంటుంటే తెలుగువాడిగా గర్వంగా ఉంది.
▶️ వీడియో చూడండి : థాయ్లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
