Sabarimala Special Trains: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు, వివరాలు ఇవే !
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప భక్తులకు శుభవార్త. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి శమరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ( Sabarimala special trains ) ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైళ్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులో ఉండనున్నాయి ? ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్లనున్నాయి ? ఏఏ స్టేషన్లో ఆగనున్నాయో పూర్తి వివరాలు ఈ పోస్టులో అందిస్తున్నాను. చదవండి.షేర్ చేయండి
శబరిమల అయ్యప్పస్వామికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. మాలధారణ చేసి అయ్యప్ప దర్శనం కోసం వేలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తుంటారు. దీంతో పాటు ఇది కార్తీక మాసం ( karthika masam ) కావడంతో భక్తులు భారీ సంఖ్యలో అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారు.
జనవరి మాసంలో మకరజ్యోతి ( sabarimala makarajyoti darshan ) దర్శనం కోసం వెళ్లే భక్తుల సంఖ్య కూడా భారీగా ఉండనుంది. ఈ విషయాన్ని గమనించిన దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని భక్తుల కోసం 62 ప్రత్యేక రైళ్లను నడపనుంది సౌత్ సెంట్రల్ రైల్వే.
ఈ స్పెషల్ ట్రైన్లు 2024 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 27 వరకు నడపనున్నట్టు ప్రకటించింది రైల్వే శాఖ.
Read Also : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
ముఖ్యాంశాలు
శబమరిలమల స్పెషల్ ట్రైన్ల వివరాలు | Sabarimala special trains 2024 details
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి ప్రకటించిన ఈ ట్రైన్లు వారంలో ఏ రోజు అందుబాటులో ఉండనున్నాయో, ఎప్పుడు మొదలై ఎప్పుడు తమ గమస్థానానికి చేరుతాయో ప్రకటిచింది దక్షణమధ్య రైల్వే.
తెలంగాణ నుంచి శబరిమలకు
Telangana To Sabarimala Special Trains : తెలంగాణలోని కాచిగూడ, హైదారాబాద్ నుంచి 18 ట్రైన్లను శబరిమలకు నడపునున్నట్టు ప్రకటించింది రైల్వే శాఖ. డిసెంబర్ నెలలో ఏ ట్రైన్ ఎప్పుడు మొదలవ్వనుందో చూడండి.
కాచీగూడ నుంచి కొట్టాయం ట్రైన్ 07133
Kacheguda to Kottayam sabarimala special train 07133 details: ఇది కాచిగూడ నుంచి కొట్టాయమ్ వరకు నడుస్తుంది. 2024 డిసెంబర్ 5,12,19,26 వ తేదీల్లో కాచీగూడ నుంచి బయల్దేరనుంది.
గురువారం మధ్యాహ్నం 3.40 నిమిషాలకు కాచీగూడ నుంచి మొదలై శుక్రవారం సాయంత్రం 6.50 నిమిషాలకు కొట్టాయం చేరుకోనుంది.
ఈ ట్రైన్ ఆగే స్టేషన్ల వివరలు
Kacheguda to Kottayam Sabarimala Special Train Route and stops : కాచీగూడ నుంచి బయల్దేరే ఈ ట్రైన్ ఈ స్టేషన్లలో ఆగుతుంది.
షాద్‌నగర్, జెడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, ధోన్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల కడప, రాజంపెట్, రేణిగుంట, కోట్పడి, జోలపెట్టై, ఇరోడ్, తిరుప్పుర్, పొదనూర్, కొయంబత్తూరు, పళక్కాడ్, త్రిసూర, అలువ ఎర్నాకుళం టౌన్ స్టేషన్ నుంచి కొట్టాయం చేరుకోనుంది.
ఇక కొట్టాయం నుంచి కాచీగూడ బయల్దేరే సమయంలో ఇదే రూట్లో వెనక్కి వస్తుంది.
కొట్టాయం నుంచి కాచిగూడ ట్రైన్ 07134
Kottayam To Kacheguda sabarimala special train 07134 details : కేరళలోని కొట్టాయం నుంచి కాచీగూడ మధ్య ఈ ట్రైన్ నడుస్తుంది. శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు కొట్టాయం నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు అంటే శనివారం రాత్రి 11.40 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఈ ట్రైన్ 2024 డిసెంబర్ 6,13,20,27 వ తేదీల్లో ఈ ట్రైన్ కొట్టాయం నుంచి అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్ నుంచి కొట్టాయం ట్రైన్ 07135
Hyderabad to Kottayam Sabarimala Special Train 07135 : హైదరాబాద్ నుంచి ఈ ట్రైన్ మంగళవారం రాత్రి 12 గంటలకు ప్రారంభం అవుతుంది. బుధవారం మధ్యాహ్నం 4 గంటల 10 నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది.
ఈ డ్రైన్ 2024 డిసెంబర్ నెలలో 3వ తేదీ, 10,17,24,31 తేదీల్లో నడవనుంది.
Read Also : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
ఈ ట్రైన్ ఆగేస్టేషన్లు ఇవే
Hyderabad to Kottayam Sabarimala special train route: హైదరాబాద్ రైల్వే ష్టేషన్ నుంచి మొదలయ్యే ఈ ట్రైన్ ఈ కింది స్టేషన్లలో ఆగుతుంది.
బేగంపేట్, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిర్, కృష్ణా, రైచూర్, మంత్రాలయం, అదోని, గుంతకల్, గూటి, యర్రగుంట్ల కడప, రాజంపెట్, రేణిగుంట, కోట్పడి, జోలపెట్టై, ఇరోడ్, తిరుప్పుర్, పొదనూర్, కొయంబత్తూరు, పళక్కాడ్, త్రిసూర, అలువ ఎర్నాకుళం టౌన్ స్టేషన్ నుంచి కొట్టాయం చేరుకోనుంది.
కొట్టాయం నుంచి కాచీగూడ బయల్దేరే సమయంలో ఇదే రూట్లో వెనక్కి రానుంది.
కొట్టాయం నుంచి హైదరాబాద్ ట్రైన్ 07136
Kottayam To Hyderabad Sabarimala Special Train 07136 : ఈ ట్రైన్ కేరళలోని కొట్టాయం నుంచి నిర్ణీత తేదీల్లో బుధవారం రోజు సాయంత్రం 18.10 నిమిషాలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ( గురువారం) రాత్రి 23.45 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ ట్రైన్ డిసెంబర్ 4వ తేదీన, 11 ,18, 25వ తేదీల్లో, 2025 జనవరి 1వ తేదీన అందుబాటులో ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు
Andhra Pradesh sabarimala special train details :శబరిమల వెళ్లే భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కొల్లం మధ్య 44 ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఆ రైళ్ల వివరాలు ఇవే..
Read Also : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
విశాఖపట్నం నుంచి కొల్లం ట్రైన్ 08539
Visakhapatnam to kollam sabarimala special train 08539 details : ఈ ట్రైన్ విశాఖ నుంచి నిర్ణీత తేదీల్లో బుధవారం ఉదయం 8.20 నిమిషాలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు కొల్లాం చేరుకుంటుంది.
2024 డిసెంబర్ 04వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ ట్రైన్ ప్రతీ బుధవారం రోజు భక్తులకు అందుబాటులో ఉంటుంది.
ఈ ట్రైన్ ఆగు స్టేషన్లు
Visakhapatnam To kollam sabarimala special train stop stations: ఈ ట్రైన్ ఈ కింది స్టేషన్లలో ఆగుతుంది.
దువ్వాడ, సమాల్కోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, గూడురు, రేణిగుంట, కోట్పడి, జోలపెట్టై, ఇరోడ్, తిరుప్పుర్, పొదనూర్, కొయంబత్తూరు, పళక్కాడ్, త్రిసూర, అలువ ఎర్నాాకుళం రోడ్, కొట్టాయం, చెంగనచేరి, తిరువల్ల, చెంగనూరు, మావెలికేర, కాయంకుళం నుంచి కొల్లాం చేరుకోనుంది.
కొల్లాం నుంచి విశాఖ బయల్దేరి తరువాత ఇదే రూట్లో వెనక్కి రానుంది.
కొల్లాం నుంచి విశాఖ ట్రైన్ 08540
Kollam to visakhapatnam sabarimala special train 08540 details: కొల్లాం నుంచి ఈ ట్రైను ప్రతీ గురువారం రాత్రి 7 గంటల 35 నిమిషాలకు బయల్దేరుతుంది. తరువాత రోజు రాత్రి 11 గంటల 20 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది.
ఈ ట్రైన్ 2024 డిసెంబర్ 5వ తేదీ 2025 డిసెంబర్ 27 వరకు ప్రతీ గురువారం భక్తులకు అందుబాటులో ఉంటుంది.
శ్రీకాకుళం రోడ్ నుంచి కొల్లాం ట్రైన్ 08553
Srikakulam Road to Kollam sabarimala special train 08553 details: శ్రీకాకుళం నుంచి ఈ ట్రైన్ నిర్ణీత తేదీల్లో ఆదివారం ఉదయం 6 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కొల్లాం చేరుకుంటుంది.
ఈ ట్రైన్ 2024 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 26 వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది.
ఈ ట్రైన్ ఆగు స్టేషన్లు
Srikakulam Road to Kollam sabarimala special train stop stations: ఈ ట్రైన్ ఈ కింది స్టేషన్లలో ఆగుతుంది.
పోందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి,దువ్వాడ, సమాల్కోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, గూడురు, రేణిగుంట, కోట్పడి, జోలపెట్టై, ఇరోడ్, తిరుప్పుర్, పొదనూర్, కొయంబత్తూరు, పళక్కాడ్, త్రిసూర, అలువ ఎర్నాాకుళం రోడ్, కొట్టాయం, చెంగనచేరి, తిరువల్ల, చెంగనూరు, మావెలికేర, కాయంకుళం నుంచి కొల్లాం చేరుకోనుంది.
కొల్లాం నుంచి శ్రీకాకుళం బయల్దేరినప్పుడు కూడా ఇదే రూట్లో వెనక్కి రానుంది.
కొల్లాం నుంచి శ్రీకాకుళం రోడ్ ట్రైన్ 08554
Kollam to srikakulam road sabarimala special train 08554 details : కొల్లా నుంచి ఈ ట్రైన్ నిర్ణీత తేదీల్లో సోమవారం మధ్యామ్నం 4 గంటల 30 నిమిషాలకు బయల్దేరుతుంది. బుధవారం వేకువజామున 2 గంటల 30 నిమిషాలకు శ్రీకాకుళం రోడ్ చేరుతుంది.
ఈ ట్రైన్ 2024 డిసెంబర్ 2వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 27 వరకు భక్తులకు ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రత్యేక ట్రైన్లలో 2AC, 3AC ,స్లీపర్ క్లాస్, జెనరల్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయి.
ఈ కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతంది అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.