E Visa : భారతీయులకు ఈ వీసా అందిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే

ట్రావెలింగ్ అనేది కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరుస్తుంది. ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడి కల్చర్, ఆహార విధానం, జీవన విధానం వంటివి తెలుసుకుని మెమోరీస్‌గా గుర్తుంచుకునే అవకాశం కల్పిస్తుంది ఒక ప్రయాణం. అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అంటే వీసా అనేది అత్యంత ప్రాధాన్యం అని చెప్పవచ్చు. అందుకే కొన్ని దేశాలు ఎక్కువ మంది టూరిస్టులను, అందులోనూ భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ వీసా E Visa అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీని వల్ల విదేశీ ప్రయాణం సులభతరం అవుతుంది.

అలా ఈ వీసా ఇచ్చే దేశాల్లో టాప్ 10 ఇవే.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
జార్జియా | Georgia E-Visa : ఈ చారిత్రాత్మక దేశానికి అక్కడి అద్భుతమైన పర్వత శ్రేణులు వజ్రాల హారం లాంటివి. ఇక్కడి అద్భుతమైన సీన్స్ చూస్తే స్వర్గం అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది. జార్జియా ఈ వీసా ప్రాసెంగ్‌కు 1-5 రోజుల సమయం పడుతుంది. ఇది ఒక్క సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది.
టర్కీ | Turkey E- Visa: టర్కీ ఈ వీసా 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ- వీసా ప్రాసెసింగ్‌ ( Turkey Visa ) కోసం 3-5 రోజు సమయం పడుతుంది. ఇక్కడి అద్భుతమైన కెపడోషియా ( Capadocia ) అనే ప్రాంతాన్ని చూడటానికి చాలా మంది టర్కీకి వెళ్తుంటారు. దీంతో పాటు టర్కీ ఫుడ్ రెసపీస్ కూడా చాలా మంది ఇష్డపడతారు.ఈస్టు వెస్టు కలిసిన అనూహ్యమైన దేశం టర్కీ. | Photo: Pixabay
అజర్ బైజాన్ | Azerbaijan : ఈ మధ్య భారతీయులకు ఫేవరిట్ డెస్టినేషన్‌గా మారింది అజర్ బైజాన్. బాకు ( baku) లోని ఆధునిక, చారిత్రాత్మక కట్టడాలు పర్యాటకులను ఇట్టే చుట్టిపడేస్తాయి. అజర్ బైజాన్‌ రుచులు నాలుకను నాట్యం చేయిస్తాయి. ఈ దేశం ఈ వీసా అప్లై చేస్తే అప్రూవ్ అవ్వడానికి 3 రోజుల సమయం పడుతుంది. 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. | Photo: Pixabay
వియత్నాం | Vietnam E-Visa : సాపాలో (Sapa) లో ట్రెక్కింగ్‌కు వెళ్లినా, హాలాంగ్ బేలో క్రూజింగ్ చేసినా లేదా హో చి మిన్‌ నగరంలో ( Ho Chi minh ) ఫుడ్ ఎంజాయ్ చేసినా వియత్నాంలో చూడాల్సినవి , చేయాల్సిని ఇంకా చాలానే ఉంటాయి. మీరు వియాత్నాం ఈ వీసా కోసం అప్లై చేస్తే 3-5 రోజుల సమయం పడుతుంది. ఈ వీసా 30 రోజులు చెల్లుబాటు అవుతుంది.| Photo: Pixabay
మయన్మార్ | Mynmar E- Visa : మయన్మార్‌ చాలా మంది భారతీయులకు ఒకప్పుడు ఫేవరిట్ డెస్టినేషన్. నేటికీ చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు. ఇక్కడి బగాన్‌లోని ( Bagan) ఆలయాలు, ఇన్లే లేక్ ( Inle Lake ) అనే సరస్సు టూరిస్టులను చాలా ఇంప్రెస్ చేస్తాయి. మయన్మార్ దేశానికి ఈ వీస అప్లై చేస్తే ప్రాసెసింగ్ కోసం 3-5 రోజులు పడుతుంది. 28 రోజుల పాటు వీసా వ్యాలిడిటీ ఉంటుంది. | Photo: Pixabay
« of 2 »

ఈ వీసా అప్లై చేసే టిప్స్ | Tips for E Visa Applying :

  • ముందస్తు ప్లానింగ్ : అప్లై చేసే ముందు దాని వ్యాలిడిటీ, ప్రాసెసింగ్ టైమ్ వంటి విషయాలను గమనించండి. దాన్ని బట్టి మీ ట్రావెల్ ప్లాన్ చేసుకోండి.
  • డాక్యుమెంట్స్ : ఈ వీసాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ ముందస్తుగా సిద్ధం చేసుకోండి. ఉదాహరణకు పాస్ పోర్టు, రీసెంట్ ఫోటోగ్రాఫ్, ట్రావెల్ ఐటినెరీ వంటివి .
  • డబుల్ చెక్: వీసా అప్లికేషన్ కోసం ఒక్కో దేశానికి ఒక్కో పద్ధతి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుని డబుల్ చెక్ చేసుకోండి.

మొత్తానికి : అనేక దేశాలకు ఈ వీసా అందుబాటులో ఉండటం వల్ల భారతీయులు ప్రశాంతంగా ఈ దేశాల్లో ట్రావెల్ చేయవచ్చు. అది కూడా పెద్ద పేపర్ వర్క్ ఏమీ అవసరం లేకుండా వీటిని కంటిన్యూ చేయవచ్చు. మీరు అడ్వంచర్ , కల్చర్ లేదా రిలాక్స్ అవ్వడం ఇలా మీ పర్పస్ ఏదైనా పైన వివరించిన దేశాలు మీ పర్పస్‌ను పూర్తి చేయగలవు.

ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!

మీ ప్రయాణాన్ని సులభతరం చేసుకునేందుకు కొత్త ప్రపంచాన్ని చూసేందుకు, కొత్త కొత్త డెస్టినేష్స్ గురించి తెలుసుకునేందుకు ప్రయాణికుడు.కామ్ ( Prayanikudu.com ) ను రెగ్యులర్‌గా చూడండి. అలాగే కొత్త కొత్త డెస్టినేషన్స్ గురించి నేను చేసిన వ్లాగ్స్ కూడా చూడండి. హ్యాప్పీ ట్రావెల్స్

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ఈ గ్యాలరీలు కూడా చూడండి

ఇది కూడా చదవండి: Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

ఇది కూడా చదవండి : Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే

ఇది కూడా చదవండి : Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు

ఈ గ్యాలరీ చూడండి :  మేఘాలయ ఎంత అందంగా ఉంటుందో 10 ఫోటోల్లో మీరు చూసేయవచ్చు

Leave a Comment

error: Content is protected !!