2025 జనవరిలో జరగాల్సిన సూళ్లూరు పేట ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival 2025 ) తేదీలు మారినట్టు సమాచారం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ తేదీలు మారినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ముఖ్యాంశాలు
కొత్త తేదీలు | New Dates Of Flamingo Festival 2025
తిరుపతిలోని సూళ్లూరుపేట ( Sullurpet Bird Festival ) వేదికగా ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించే విషయం తెలిసిందే. 2025 జనవరి 10 నుంచి 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో తేదీలు మారాయి అంటూ ఒక వార్త వచ్చింది.
వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi 2025 ) , ద్వాదశి ( Dwadashi ) సందర్బంగా ఈ తేదీలను మార్చినట్టు, ఈ పక్షుల పండగను జనవరి 17 నుంచి అంటే సంక్రాంతి ( Sankranti 2025 ) తరువాత నిర్వహించాలని అధికారులు నిర్ణయించారని ఆ వార్త సారాంశం. అయితే తేదీల మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. సో ఇప్పటికైతే పాత తేదీలకే పక్షుల పండగ జరుగుతుంది అని భావించవచ్చు. ఏ మైనా అప్డేట్ వస్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాము.
Update On Flamingo Festival 2025 : జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న ఫ్లెమింగో ఫెస్టివల్
ఒకవేళ ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingos Festival 2025 ) తేదీలు మారినా కార్యక్రమం జరిగే విధానం, షెడ్యూల్లో మార్పు ఉండదని తెలుస్తోంది. అదే సమయంలో పక్షుల పండగను వేడుకగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి | Facts About Flamingo Festival In Andhra Pradesh
తిరుపతి ( Tirupati ) జిల్లాలోని సూళ్లూరుపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నేలపట్టు బర్డ్ శాంక్చువరిలో జరిగే ఫ్లెమింగోస్ ఫెస్టివల్‌కు దూర దూరం నుంచి పక్షి ప్రేమికులు వస్తుంటారు. శీతాకాల సమయంలో పులికాట్ సరస్సుకు ( Pulicat Lake ) భారీగా వలస పక్షుల తాకిడి ఉంటుంది. ఈ సరస్సు మొత్తం వివిధ దేశాలకు చెందిన పక్షులతో నిండిపోతుంది. ఇందులో ఫ్లెమింగోలే ఎక్కువగా ఉంటాయి.
ఈ ఫ్లెమింగోలను స్వాగతించేందుకు ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. మూడురోజుల పాటు జరిగే పక్షుల ఉత్సవాలలో అందమైన పక్షులను చూసేందుకు పక్షి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు.
1976 లో పులికాట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ ( Pulicat Wildlife Department ) ఇక్కడ ఒక బర్డ్ శాంక్చువరిని ఏర్పాటు చేసింది. అక్టోబర్ నుంచి ఏప్రిల్ సమయంలో ఇక్కడికి 30 రకాల పక్షులు వస్తాయని సమాచారం. సంతానోత్పత్తి తరువాత ఇక్కడి నుంచి వెళ్లిపోతాయి.
నేలపట్టులో పక్షులు సంతానోత్పత్తి క్రమం | Nelapattu Birds Reproduction Cycle
- నేలపట్టు బర్డ్ శాంక్చువరీ విస్తీర్ణం 458.92 హెక్టార్లు.
- నైజీరియా, బంగ్లాదేశ్, బర్మా. పాకిస్తాన్‌తో పాటు వివిధ దేశాల పక్షులు ఇక్కడికి వస్తాయి.
- అక్టోబర్ , నవంబర్ నెలలో పక్షులు ఇక్కడికి వస్తాయి. గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి.
- నవంబర్, డిసెంబర్ నెలలో గుడ్లు పెడతాయి.
- డిసెంబర్, జనవరి నెలలో గుడ్ల నుంచి పిల్లలు బయటికి వస్తాయి.
- జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో పిల్లలను పోషించి ఏప్రిల్ నెలలో నేల పట్టు నుంచి వెళ్లిపోతాయి.
పక్షుల వలసలు, వేట కొనసాగేది ఇలా | Birds Migration
శీతాకాలంలో ( Winter Andhra Pradesh ) వేలాది సంఖ్యలో విదేశీ పక్షులు వలస వస్తాయి. పులికాట్ సరస్సులో వేటాడి నేలపట్టులో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. వివిధ జాతుల పక్షులు బ్రీడింగ్ కోసం పులికాట్ ( Flamingo festival Sullurpet, Andhra Pradesh) చేరుకుంటాయి. ఇందులో కొన్ని పక్షులు పులికాట్లో లోతైన నీటిలో వేటను కొనసాగిస్తాయి. బ్రీడింగ్ సీజన్ ముగిసిన వెంటనే తమ తమ ప్రాంతాలకు, దేశాలకు వెళ్లిపోతాయి. ఈ మేరకు నేలపట్టు బర్డ్ శాంక్యువరీ ( Nelapattu Bird Sanctuary ) అధికారులు వలస పక్షుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తారు.
నేలపట్టు బర్డ్ శాంక్చువరీకి ఎప్పుడు రావాలి ? | Best Time To Visit Nelapattu
దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులను చూసేందుకు పక్షి ప్రేమికులు ( Bird Lovers ) నేలపట్టు వస్తూ ఉంటారు. ఇక బెస్ట్ టైమ్ విషయానికి వస్తే ఈ పక్ష్లులు ఉన్న సమయంలో అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడికి రావచ్చు. ఇక ఫెస్టివల్ సమయానికి ఇక్కడికి వస్తే ఇంకా బెటర్.
గమనిక: ఈ వెబ్సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
Watch More Vlogs On : Prayanikudu
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రపంచ యాత్ర గైడ్
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
- Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
భారత దేశ యాత్రా దర్శిని
- మనాలిలో చేయాల్సిన 30 పనులు | 30 Activities in Manali | With Photos
- Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
- హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
- Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
- షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
- Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
- Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts